PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr7aaa9be6-6a48-494d-bfdf-22b06f0a1396-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr7aaa9be6-6a48-494d-bfdf-22b06f0a1396-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఈ మధ్య బీజేపీకి కొంత ఊపు వచ్చిన మాట వాస్తవం. ఆ ఊపుతో బీజేపీ ఇక తెలంగాణా మాదే అంటోంది. బస్తీ మే సవాల్ అంటూ గట్టిగానే నినాదాలు చేస్తోంది. నిజానికి తెలంగాణా అసేంబ్లీలో బీజేపీ బలం చూస్తే కచ్చితంగా రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే. kcr;modi;kcr;bharatiya janata party;assembly;mla;cheque;central government;march;dookuduఅతి పెద్ద ప్రచారానికి చెక్ ?అతి పెద్ద ప్రచారానికి చెక్ ?kcr;modi;kcr;bharatiya janata party;assembly;mla;cheque;central government;march;dookuduThu, 14 Jan 2021 10:00:00 GMTబీజేపీ ఇక తెలంగాణా మాదే అంటోంది. బస్తీ మే సవాల్ అంటూ గట్టిగానే నినాదాలు చేస్తోంది. నిజానికి తెలంగాణా అసేంబ్లీలో బీజేపీ బలం చూస్తే కచ్చితంగా రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే.

ఈ నేపధ్యంలో బీజేపీ ఇపుడు ఎన్నికలు పెడితే తాము గెలిచి చూపిస్తామని చాలెంజ్ చేస్తోంది. దానికి తగినట్లుగానే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా ఉంది. జమిలి ఎన్నికలను వచ్చే ఏడాది మోడీ నిర్వహించే సూచనలు కూడా ఉన్నాయి.  ఆ విధంగా తీసుకుంటే 2023లో రావాల్సిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ఒక ఏడాది ముందు వస్తాయన్న మాట.

మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద గులాబీ బాస్ కేసీయార్ ఇప్పటి నుంచే ఆలోచనలు చేస్తున్నారు. నిజానికి ఈ మధ్య తెలంగాణా రాజకీయాలో అతి పెద్ద ప్రచారం ఒకటి బయటకు వచ్చింది. అదేంటీ అంటే కేటీయార్ ని ఈ ఏడాది మార్చి లోగా సీఎం ని చేస్తారని, దానికి తగినట్లుగానే కేసీయార్ కార్యాచరణ ఉండబోతోందని. ఈ విషయాన్ని ఏకంగా ఒక టీయారెస్ ఎమ్మెల్యే బయట పెట్టడంతో అంతా నమ్ముతున్నారు కూడా.

కేసీయార్ సైతం ఆ దిశగా సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అన్న మాట కూడా ఈ మధ్యదాకా  వినిపించింది. కానీ ఇపుడు ఆ ఆలోచనల నుంచి కేసీయార్ వెనక్కి తగ్గారని అంటున్నారు. 2022లో జమిలి ఎన్నికలు అంటే ఎక్కువ సమయం లేనందువల్ల తానే ముఖ్యమంత్రిగా  కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం అవుతోంది. పైగా బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఈ కీలకమైన సమయంలో తాను ఉండాలని భావిస్తున్నారుట. కేటీయార్ ని సీఎం ని చేసినా ఈ తక్కువ సమయం ఆయనకు సరిపోదని కూడా ఆలోచన చేస్తున్నారుట. తెలంగాణాలో మరోమారు గెలిచి అపుడు కేటీయార్ ని సీఎం చేసేందుకు కేసీయార్ చూస్తారని అంటునారు. మొత్తానికి చూసుకుంటే బీజేపీ దెబ్బ తీసేందుకు తాను రెడీ అని కేసీయార్ అంటున్నారన్న మాట.




వైరల్: బావకు ఐ లవ్ యూ చెప్పిన నిహారిక..!?

సారీ చెప్పిన చంద్రబాబు.. బాబోయ్‌..ఏంటీ వెటకారం..?

ఆ మంత్రినే బీజేపీ ఎందుకు టార్గెట్ చేస్తోంది.. ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ఈక్వేష‌న్ ?

చింత‌మ‌నేని, మాగంటిల దూకుడుకు జ‌గ‌న్ మార్క్‌ చెక్‌..!

ఎప్పుడూ అదేనా ? రాజకీయం బోర్ కొడుతుంది బాబు !

వైసీపీలో మ‌రో వార‌సుడు... ఎంపీ సీటు టార్గెట్టా ?

కొడాలి నానిపై నంద‌మూరి అస్త్రం వ‌దులుతోన్న బాబు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>