HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/labvangam-98dedc87-bd67-4631-a1c9-87c89587fe70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/labvangam-98dedc87-bd67-4631-a1c9-87c89587fe70-415x250-IndiaHerald.jpgలవంగాలను ఎక్కువగా మసాలా దినుసులుగా మాత్రమే వాడుతాము, లేదా ఎప్పుడైనా పంటి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు, దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు ఒక లవంగాన్ని నోట్లో చేసుకుంటాం. కానీ లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసు ఉందాం.labvangam,;thulasi;hushaaru;tulasi;oil;aqua;masala;shaktiలవంగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?లవంగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?labvangam,;thulasi;hushaaru;tulasi;oil;aqua;masala;shaktiThu, 14 Jan 2021 11:30:00 GMTలవంగాలను  ఎక్కువగా మసాలా దినుసులుగా  మాత్రమే వాడుతాము, లేదా ఎప్పుడైనా పంటి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు, దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు ఒక లవంగాన్ని నోట్లో చేసుకుంటాం. కానీ లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసు ఉందాం.

 లవంగాలలో ఉండే యూజెనాల్ అనే రసాయన పదార్థం పంటి నొప్పిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా నోటి దుర్వాసనను తగ్గించి, నోటిలోని బ్యాక్టీరియాను కూడా నశింపజేస్తుంది. అందుకే ప్రస్తుతం టూత్ పేస్ట్ తయారీ సంస్థలు ఎక్కువగా టూత్ పేస్ట్ లో లవంగాల పొడిని కలుపుతున్నారు.

తేనే,కొన్ని చుక్కలు లవంగాల నూనె ను గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడుసార్లు తాగితే జలుబు,దగ్గు లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.

వాంతులు,కడుపులో వికారంగా ఉన్నప్పుడు కూడా లవంగాలను తీసుకోవడం మంచిది.

తులసి,పుదీనా, లవంగాలు, యాలకులు అన్నీ మిశ్రమం చేసి,టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించడమే కాక మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చు.వీటిలో చక్కెర,బెల్లం లకు బదులుగా  తేనెను మాత్రమే ఉపయోగించండి.

లవంగాలను పొడి చేసి నీళ్లలో కలిపి ఆ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.

ఉదయం పూట నిద్ర లేచేటప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే,పది- పన్నెండు లవంగాలను తీసుకొని వాటికి చక్కెర,పసుపు పొడి కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు మంచి  నీళ్లలో వేసుకొని తాగడం వల్ల రోజంతా హుషారుగా ఉండవచ్చు.

క్రమం తప్పకుండా లవంగాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒత్తిడి, అలసట, ఆయాసం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా మగవారిలో వీర్యకణాల వృద్ధిని పెంపొందించడానికి లవంగం ఎంతగానో సహాయపడుతుంది.

శ్వాస సంబంధిత వ్యాధులకు కూడా లవంగం బాగా పనిచేస్తుంది. లవంగాలను ఆహారంలో కాని, పొడి చేసుకొని నీటిలో కాని కలిపి  తీసుకోవడం వల్ల  శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.ఈ విధంగా చేయడం వలన కొంతమేరకు ఆరోగ్యంగా ఉండవచ్చు.




లోకేష్ మార‌డ్రా బాబు.... ఇంత‌కు మించి స‌రుకు లేదా...టీడీపీలో గ‌గ్గోలు...!

బీజేపీ, టీడీపీని డిఫెన్స్‌లో ప‌డేసిన జ‌గ‌న్ దూకుడు.. ఆ ఒక్క డెసిష‌న్ దెబ్బ‌కే...!

సిబిఐని పంపండి అంటూ బండి సంజయ్ కేంద్రానికి లేఖ...?

ఢిల్లీ ప్రజలకు మీరు ఇవ్వకపోతే మేమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం - సీఎం కేజ్రీవాల్

జ‌మిలీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పొత్తులా ? ఆ రెండు పార్టీల‌తోనా ?

పోర్న్ స్టార్ పాత్రలో నటించనున్న నటి ఎస్తేర్..!?

నిమ్మగడ్డతో వైసీపీకి భారీ నష్టమేనా ? టీడీపీకి కలిసొచ్చేది ఏంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>