PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలను కాస్త ఎక్కువగా చేస్తుంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా జనసేన పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక జనసేన పార్టీ వరుసగా కార్యక్రమాలు కూడా చేస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం చేసారు. విజయవాడ 40 డివిజన్ లో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు బోయిన శ్రీనివాస్ యాదవ్, అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుycp,janasena,ap;mahesh;kranthi;kranti;srinivas;makar sakranti;jagan;vijayawada;andhra pradesh;janasena;sankranthi;kanna lakshminarayana;festival;minister;janasena party;reddy;party;anandamవామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?వామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?ycp,janasena,ap;mahesh;kranthi;kranti;srinivas;makar sakranti;jagan;vijayawada;andhra pradesh;janasena;sankranthi;kanna lakshminarayana;festival;minister;janasena party;reddy;party;anandamWed, 13 Jan 2021 16:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలను కాస్త ఎక్కువగా చేస్తుంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా జనసేన పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక జనసేన పార్టీ వరుసగా కార్యక్రమాలు కూడా చేస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా  జనసేన  ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం చేసారు. విజయవాడ 40 డివిజన్ లో జనసేన  పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు బోయిన శ్రీనివాస్ యాదవ్, అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనసేన పీఎసీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్  మాట్లాడుతూ... రాష్ట్రంలో పేదలు జీవించే పరిస్థితి లేదు..  ఉపాధి కల్పనలో  ప్రభుత్వం విఫలమైంది అని ఆరోపణలు చేసారు. నిత్యావసర వస్తువులు ధరలు నింగినంటాయి.. పన్నుల భారాలు మోపుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. జగన్ పాలనలో అన్ని వర్గాల వారు అవస్థలు పడుతున్నారు అని అన్నారు. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడుతూ... ప్రజలు ఆనందంగా పండుగను జరుపునే పరిస్థితి లేదు అని అన్నారు. ఇసుక కొరత, కరోనా కారణం గా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు  అని ఆవేదన వ్యక్తం చేసారు.

ధరల నియంత్రణ లో సర్కార్ విఫలమైంది అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు,సంక్షేమం లేదు అని అన్నారు. అవినీతి సంపాదన మీద కాకుండా రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టాలి అని సూచించారు. అమ్మఓడి తోనే ప్రజలు పండుగ చేసుకోవాలా..  గతంలో ప్రజలు పండుగ చేసుకోలేదా అని నిలదీశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ 1000కోట్ల అవినీతి కి పాల్పడ్డారు అని మండిపడ్డారు. ప్రజల పాట్లు కన్నా... పైసల వసూళ్ళ పైనే ఆయనకు ఆరాటం అని విమర్శించారు. అటువంటి మంత్రి ప్రజలకు అవసరమా.. జగన్ రెడ్డి బర్తరఫ్ చేయాలి అని అన్నారు.


సమ్మర్ లో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..!

ఆ చిత్రం ఏఎన్నార్ దశనే మార్చేసిందట!

కేటిఆర్ ఎందుకు దిగారు...?

సింగర్ సునీత వివాహంపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసిన నాగబాబు

చంద్రబాబుని తీవ్రంగా విమర్శించిన.... ఫైర్ బ్రాండ్...!?

పిల్లలకు దేవుడుగా మారిన సోనూ సూద్.. ఈసారి ఏకంగా...

బ్రేకింగ్: బండి సంజయ్ రథయాత్ర...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>