PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/atchannaidu-benfit-for-jagan-and-damage-babuf3ebd229-5a35-4146-86cb-dcd6ad391a7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/atchannaidu-benfit-for-jagan-and-damage-babuf3ebd229-5a35-4146-86cb-dcd6ad391a7b-415x250-IndiaHerald.jpg2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. ఆ ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీ నేతలని, ఎమ్మెల్యేలని, ఎంపీలని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. అలాగే చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు, జగన్‌ కేసుల గురించి అనేకసార్లు ఎద్దేవా చేశారు. జైలు నాయకుడు అని, బెయిల్ మీద బయట తిరుగుతున్నారని అసెంబ్లీ, బయట విమర్శలు చేశారు. jagan;cbn;nithya new;tiru;jagan;andhra pradesh;2019;assembly;christian;tdp;ycp;reddyజగన్‌ని లేపుతున్న అచ్చెన్న...బాబుకు డ్యామేజ్ ఖాయమేనా?జగన్‌ని లేపుతున్న అచ్చెన్న...బాబుకు డ్యామేజ్ ఖాయమేనా?jagan;cbn;nithya new;tiru;jagan;andhra pradesh;2019;assembly;christian;tdp;ycp;reddyWed, 13 Jan 2021 04:00:00 GMT2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలిసిందే. ఆ ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీ నేతలని, ఎమ్మెల్యేలని, ఎంపీలని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేసింది. అలాగే చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు, జగన్‌ కేసుల గురించి అనేకసార్లు ఎద్దేవా చేశారు. జైలు నాయకుడు అని, బెయిల్ మీద బయట తిరుగుతున్నారని అసెంబ్లీ, బయట విమర్శలు చేశారు.

ఇక ఇందులో అప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు, జగన్‌పై ఎలాంటి విమర్శలు చేశారో కూడా తెలిసిందే. అసెంబ్లీలో జగన్‌ని చాలాసార్లు ఎగతాళి చేశారు. అవినీతి పరుడు అని, జైలు పక్షి అంటూ, ఇంకా అనేక రకాలుగా విమర్శలు చేశారు. అయితే ఇలా జగన్‌ని ఎగతాళి చేయడంలో వల్ల 2019 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు  వచ్చాయో కూడా తెలిసిందే. అలా జగన్‌ని వ్యక్తిగతం టార్గెట్ చేయడం వల్ల టీడీపీకే పెద్ద బొక్క పడింది.

అయితే అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యాక కూడా టీడీపీ తగ్గడం లేదు. జగన్‌పై నిత్యం ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు కులం, మతం ముద్ర వేసే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. జగన్ రెడ్డి సామాజికవర్గానికి, క్రిస్టియన్ మతానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న, మళ్ళీ జగన్‌పై విరుచుకుపడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జగన్ డైరక్షన్‌లోనే జరుగుతున్నాయని, అసలు ఎక్కడా ఏమి జరిగినా దానికి కారణం జగన్ అనే విధంగా అచ్చెన్న విమర్శలు చేస్తున్నారు.

అయితే ఎవరైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే ప్రజలు అంగీకరిస్తారు. కానీ ఇలా అడ్డగోలుగా మాట్లాడితే ఆ పార్టీకే డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు అచ్చెన్న ఇలా విమర్శలు చేయడం వాళ్ళ జగన్‌కే బెన్‌ఫిట్ వచ్చేలా కనిపిస్తోంది. ఎటు తిరిగి బాబుకే నష్టం జరిగేలా ఉంది.  




ఆ కంపెనీ స్కూటీ ధర తక్కువ.. ఎక్కువ ఫీచర్స్ తో వచ్చేసింది..!!

బాత్రూంలో జారిపడిన హీరోయిన్.. ఆ వెంటనే సాంగ్ షూట్‌ ఉండటంతో..

హనీమూన్ ఎప్పుడో చెప్పేసిన సింగర్ సునీత.. ప్లాన్ ఏంటంటే..

బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనితో ప్రేమలో ఉందా?

వాట్సాప్ వీడుతున్నారా? అయితే ఈ పని చేయండి.. లేదంటే డేంజరే

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>