PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagane4400a31-8358-4cfb-8762-e6e6bef869e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagane4400a31-8358-4cfb-8762-e6e6bef869e5-415x250-IndiaHerald.jpgగత ఏడాది మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్స్ కూడా స్వీకరించి, కరోనా మొదలైందని చెప్పి ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికలు వాయిదా పడ్డాక, జగన్ ప్రభుత్వం, నిమ్మగడ్డల మధ్య ఎలాంటి వార్ జరిగిందో అందరికీ తెలిసిందే. jagan;kumaar;jagan;sambandam;andhra pradesh;high court;government;court;episode;war;local language;ycp;election commissionనిమ్మగడ్డ కథలో ట్విస్ట్....జగన్ భారీ క్లైమాక్స్ రెడీ చేశారా?నిమ్మగడ్డ కథలో ట్విస్ట్....జగన్ భారీ క్లైమాక్స్ రెడీ చేశారా?jagan;kumaar;jagan;sambandam;andhra pradesh;high court;government;court;episode;war;local language;ycp;election commissionWed, 13 Jan 2021 00:00:00 GMTస్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్స్ కూడా స్వీకరించి, కరోనా మొదలైందని చెప్పి ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే.  ఇక ఎన్నికలు వాయిదా పడ్డాక, జగన్ ప్రభుత్వం, నిమ్మగడ్డల మధ్య ఎలాంటి వార్ జరిగిందో అందరికీ తెలిసిందే.

వారి మధ్య వార్ ఏ మేరకు జరిగిందో కూడా చూశారు. అయితే ఎలక్షన్ కమిషన్, ఏపీ ప్రభుత్వాల మధ్య రగడ ఇంకా జరుగుతూనే ఉంది. నిమ్మగడ్డ గత కొంతకాలంగా కరోనా ప్రభావం తగ్గిందని ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. తాజాగా పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ఇక నిమ్మగడ్డ నిర్ణయాలని మొదట నుంచి వ్యతిరేకిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేమని హైకోర్టుకు కూడా వెళ్లింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు పెట్టలేమని కోర్టుకు తేల్చి చెప్పింది.

ఇక ప్రభుత్వం వాదనతో కోర్టు కూడా అంగీకరించి, నిమ్మగడ్డ ఇచ్చిన నోటిఫికేషన్ సస్పెండ్ చేసింది. దీంతో స్థానిక ఎన్నికలకు మళ్ళీ బ్రేక్ పడింది. అయితే ఈ విషయాన్ని నిమ్మగడ్డ వదిలేలా కనిపించడం లేదు. దీనిపై ఇంకా న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే వైసీపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ బాగా పంతంతో ఉన్నారు. తాను పదవి నుంచి తప్పుకునేలోపు ఎన్నికలు పెట్టాలని నిమ్మగడ్డ చూస్తుంటే, నిమ్మగడ్డ వెళ్లిపోయాకే ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం చూస్తుంది.

మరో రెండు నెలల్లో నిమ్మగడ్డ పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త కమిషనర్‌ని పెట్టి, ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగానే ముందుకెళుతుంది. అయితే నిమ్మగడ్డ పదవి నుంచి తప్పుకున్నాక, జగన్ భారీ క్లైమాక్స్ సెట్ చేయొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డకు టీడీపీతో ఉన్న సంబంధంపై వైసీపీ విమర్శలు చేస్తుంది. ఇక పదవీకాలం ముగిశాక నిమ్మగడ్డ టార్గెట్‌గా జగన్ ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి చూడాలి ఏపీలో నిమ్మగడ్డ ఎపిసోడ్ ఎప్పటికి ముగుస్తుందో.




చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!

శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో.. మన ర్యాంక్ ఎంతో చెప్పిన జాబితా.. అగ్రస్థానం మళ్లీ వాళ్లకే!

త్రివిక్రమ్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో.. ఏమని చెప్పాడంటే

‘మాస్టర్’ లీక్ చేసిందెవరో తెలిసిపోయింది.. ఎవరో తెలుసా?

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>