MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroines-turns-sisters-to-same-herosed4ce7e3-6b64-435e-98a6-55c16c4a16af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroines-turns-sisters-to-same-herosed4ce7e3-6b64-435e-98a6-55c16c4a16af-415x250-IndiaHerald.jpgసినిమా వాళ్లకు నటన మాత్రమే ముఖ్యం అది ఎలాంటి పాత్ర అయినా సరే నచ్చిందంటే చేసేస్తారు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన వారే లైమ్ లైట్ తగ్గిపోయాక ఫేడవుట్ అవుతూ ఉంటారు. అలాంటి దశలో సిస్టర్ క్యారెక్టర్, ఆంటీ పాత్రలు చేయడానికి కూడా వెనకాడరు. tollywood heroines;beauty;pawan;chiranjeevi;mahesh;kumaar;allu arjun;bhama;kajal aggarwal;kalyan;nayana harshita;nayantara;renu desai;sukumar;india;sye-raa-narasimha-reddy;tollywood;cinema;rajani kanth;remake;wife;saira narasimhareddy;hero;heroine;arjun 1;sai pallavi;chitramస్టార్ హీరోయిన్స్ ని చెల్లెళ్లుగా మార్చేసిన హీరోస్..మాములు ట్విస్ట్ కాదుస్టార్ హీరోయిన్స్ ని చెల్లెళ్లుగా మార్చేసిన హీరోస్..మాములు ట్విస్ట్ కాదుtollywood heroines;beauty;pawan;chiranjeevi;mahesh;kumaar;allu arjun;bhama;kajal aggarwal;kalyan;nayana harshita;nayantara;renu desai;sukumar;india;sye-raa-narasimha-reddy;tollywood;cinema;rajani kanth;remake;wife;saira narasimhareddy;hero;heroine;arjun 1;sai pallavi;chitramWed, 13 Jan 2021 13:00:00 GMTసినిమా వాళ్లకు నటన మాత్రమే ముఖ్యం అది ఎలాంటి పాత్ర అయినా సరే నచ్చిందంటే చేసేస్తారు. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన వారే లైమ్ లైట్ తగ్గిపోయాక ఫేడవుట్ అవుతూ ఉంటారు. అలాంటి దశలో  సిస్టర్ క్యారెక్టర్, ఆంటీ పాత్రలు చేయడానికి కూడా వెనకాడరు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నటీమణులు మాత్రం అలా కాదు ప్రస్తుతం స్టార్ హీరోన్లుగా చలామణి అవుతున్నారు అయినా కూడా ఇంతకముందు ఏ హీరో పక్కన హీరోయిన్ గా నటించారో అదే హీరో పక్కన చెల్లెలి పాత్రలకు ఒప్పుకున్నారు. మరి ఆ అందమైన భామలను చెల్లెళ్లుగా మార్చేసిన ఆ హీరోస్ ఎవరో చూద్దాం.

అల్లు అర్జున్ చెల్లిగా సాయి పల్లవి:  ప్రస్తుతం శరవేగం గా షూటింగ్ జరుపుకుంటున్న అల్లు అర్జున్ సుకుమార్ కాంబో సినిమా పుష్ప. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి చెల్లెలి పాత్ర చాల కీలకమైనది కావడంతో మంచి పెర్ఫార్మర్  కోసం వేట మొదలెట్టాడట సుకుమార్. సౌత్ లో సూపర్ ఫామ్ తో దూసుకుపోతున్న సాయి పల్లవి అయితే బాగుంటుందని అనుకోని ఆమెకు కూడా కథను వినిపించడం తో సాయి పల్లవి ఒకే చెప్పిందట. ఇలా ఈ మలయాళీ భామ అల్లు అర్జున్ పక్కన చెల్లెలి పాత్రలో నటిస్తుంది.

చిరుకి చెల్లి గా నయన్: సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా పిలబడుతున్న నయనతార ఇంకా ఎంత కాలం గ్లామర్ షో చేస్తాం అనుకుందో ఏమో కానీ మంచి స్కోప్ ఉన్న పాత్రలు చేయడానికి సిద్ధం అయినట్టు ఉంది. ఇటీవలే అమ్మోరు సినిమాతో అలాంటి హిట్ ఒకటి కొట్టింది కూడా. ఇక చిరంజీవి నటిస్తున్న లూసిఫర్ రీమేక్ లో నయన్ ని చెల్లి పాత్రలో ఫిక్స్ చేశారట. ఆమె కూడా చిరంజీవి కి చెల్లి గా చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే సైరా లో వీరిద్దరూ హీరోహీరోయిన్స్ గా నటించారు.

 మంచు వారబ్బాయికి కాజల్ జోడి: ఇటు సౌత్ అటు నార్త్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. ఈ హీరోయిన్ మన చిన్నప్పటి నుండి హీరోయిన్ గా నటిస్తూనే ఉంది. ఇప్పుడు ఎవరు ఊహానించని విదంగా మొదటి సారి మంచు విష్ణు కి చెల్లి పాత్ర చేయడానికి ఒప్పుకుంది, అది కూడా ఇంటెర్నేషనల్ ప్రాజెక్ట్ అవ్వడమే కారణం అని తెలుస్తుంది.

ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం మహేష్ బాబు కి వదిన గా నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్న అది ఇంకా ఆఫీసియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇదండీ సంగతి హీరోయిన్ గా ఉండటమే కాదు కథ నచ్చితే చెల్లి పాత్ర అయినా ఒకే అంటూ ముందుకు దూసుకుపోతున్నారు మన టాలీవుడ్ ముద్దు గుమ్మాలు.
 


ఎట్టకేలకు రాజమౌళి వారిని ఫ్రీ బర్డ్స్ చేశాడుగా..

చిరు ఆచార్య‌కు అదే మైన‌స్సా... !

రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?

రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు

మీర‌లా చేస్తే రూ.కోటి ముప్పై ల‌క్ష‌లు చేతికి...

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>