MoviesK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh642de682-14ee-45a8-9bac-73c59de5adf6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh642de682-14ee-45a8-9bac-73c59de5adf6-415x250-IndiaHerald.jpgరవితేజ, శ్రుతి హాసన్ జంటగా నటించిన క్రాక్ చిత్రం ఇప్పటికే రిలీజై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజైన పెద్ద సినిమా అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సంక్రాంతిని మాస్ మహారాజ్ దున్నేయనున్నాడు. మరోపక్క బుధవారం రిలీజైన మాస్టర్ చిత్రానికిvenkatesh;ravi;venkatesh;gopichand malineni;jeevitha rajaseskhar;ravi teja;shankar;cinema;director;press;hero;house;mass;master;krackక్రాక్ సినిమా చేయనని చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?క్రాక్ సినిమా చేయనని చెప్పిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?venkatesh;ravi;venkatesh;gopichand malineni;jeevitha rajaseskhar;ravi teja;shankar;cinema;director;press;hero;house;mass;master;krackWed, 13 Jan 2021 23:00:00 GMTరవితేజ, శ్రుతి హాసన్ జంటగా నటించిన క్రాక్ చిత్రం ఇప్పటికే రిలీజై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజైన పెద్ద సినిమా అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సంక్రాంతిని మాస్ మహారాజ్ దున్నేయనున్నాడు. మరోపక్క బుధవారం రిలీజైన మాస్టర్ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో క్రాక్ సినిమా షోలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా చూస్తే రవితేజ కోసమే గోపిచంద్ మలినేని ఈ చిత్ర కథను రాసి ఉంటారని అందరూ అనుకుంటారు. అంతలా రవితేజ ఈ సినిమాలో పోతురాజు వీర శంకర్ క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. అయితే ఈ సినిమా కథను డైరెక్టర్ ముందుగా చెప్పింది మాస్ మహారాజ్‌కు కాదట.

క్రాక్ సినిమా కథ ముందుగా విక్టరీ వెంకటేష్ వద్దకు వెళ్లిందంట. సినిమా కథ మొత్తం విన్న వెంకటేష్సినిమా చేసేందుకు నో అన్నారట. ఆయనను క్రాక్ స్టోరీ ఆకట్టుకోలేదని, అందుకే ఆయన ఈ సినిమాకు నో చెప్పినట్టు తెలుస్తోంది. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు కథ లేదని, స్టోరీలో చిన్న చిన్న మార్పులు చేయాలంటూ విక్టరీ వెంకటేష్ గోపిచంద్ మలినేనికి సూచించారట. అయితే మార్పులు చేసేందుకు గోపిచంద్ మలినేని ఇష్టపడకపోవడంతో వెంటనే ఈ స్టోరీని తిరిగి రవితేజకు చెప్పారట. రవితేజ ఈ కథను విన్న వెంటనే ఇంప్రెస్ అయి వెంటనే ఓకే చెప్పేయడంతో చివరికి రవితేజ హీరోగా క్రాక్ విడుదలైంది.

ఇప్పుడు హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో వెంకటేష్ ఒక మంచి కథను మిస్ చేసుకున్నాంటూ ఆయన అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలోని కొన్ని క్యారెక్టర్‌లు నిజమైన క్యారెక్టర్‌లేనని చిత్ర దర్శక నిర్మాతలు ఇప్పటికే చెప్పారు. ఒంగోలు నేపథ్యంలో వచ్చే క్యారెక్టర్లు నిజ జీవితంలోని వారిని ఆధారంగా తీసుకుని గోపిచంద్ మలినేని తన కథకు తగ్గట్టు వాడుకున్నారు.


రహస్యం: ప్రపంచంలో అక్కడే విమానాలు ఎక్కువగా ఎందుకు కూలతాయో తెలుసా..?

సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి

జల్లికట్టులో మెరిసిన ఎన్టీఆర్.. హుషారు చూపించిన ఫ్యాన్స్

చైనాకు మంట పుట్టించిన భారత్...?

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>