PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpgమ‌రోవైపు న‌గ‌రంలో టీడీపీలో హ్యాట్రిక్ కొట్టిన తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి శ్రీరామ‌కృష్ణ‌ను అడుగ‌డుగునా అడ్డుకుంటున్నారు. జ‌గ‌న్ వార్నింగ్‌లు కూడా ప‌ని చేస్తుండ‌డంతో వైసీపీ నేత‌లు త‌మ వంతుగా కృషి చేస్తున్నారు. అయితే సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టుగా రూర‌ల్ జిల్లాకు చెందిన కొంద‌రు పార్టీ నేత‌లు న‌గ‌ర రాజ‌కీయాల్లో వేలు పెట్టి కెలుకుతుండ‌డంతో పార్టీలో ఉన్న గ్రూపుల‌కు కొత్త గ్రూపులు ఏర్ప‌డుతున్నాయి. అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో బాగా జోక్యం చేసుకుంటున్నార‌న్న ysrcp;amarnath cave temple;vishakapatnam;mla;minister;letter;tdp;ycp;reddy;partyవిశాఖ వైసీపీని కెలుకుతోందెవ‌రు... శ‌త్రువుల‌తో చేతులు క‌లిపారా ?విశాఖ వైసీపీని కెలుకుతోందెవ‌రు... శ‌త్రువుల‌తో చేతులు క‌లిపారా ?ysrcp;amarnath cave temple;vishakapatnam;mla;minister;letter;tdp;ycp;reddy;partyWed, 13 Jan 2021 13:28:00 GMTవిశాఖ సిటీలో వైసీపీ వీక్‌గా ఉన్న మాట వాస్త‌వం. గ‌త ఎన్నిక‌ల్లో న‌గ‌రంలో నాలుగు దిక్కులా ఉన్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ జెండాయే ఎగిరింది. ఇక వ‌చ్చే గ్రేట‌ర్ విశాఖ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగ‌రాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న జ‌గ‌న్ ఆ బాధ్య‌త‌ల‌ను రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఉత్త‌రాంధ్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ విజ‌య‌సాయి రెడ్డి కి ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. విజ‌య‌సాయి జ‌గ‌న్‌ను మెప్పించేందుకు ఇత‌ర పార్టీల‌కు చెందిన వారికి వైసీపీ కండువాలు క‌ప్పేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే అన‌కాప‌ల్లి ఎంపీగా ఓడిన అడారి ఆనంద్‌తో పాటు విశాఖ ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ కుమార్‌ల‌ను వైసీపీ వైపు తిప్పేశారు. ఇక గంటా కూడా టీడీపీలో ఉంటారా ?  లేదా ? అన్న‌ది సందేహ‌మే. మ‌రోవైపు న‌గ‌రంలో టీడీపీలో హ్యాట్రిక్ కొట్టిన తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి శ్రీరామ‌కృష్ణ‌ను అడుగ‌డుగునా అడ్డుకుంటున్నారు. జ‌గ‌న్ వార్నింగ్‌లు కూడా ప‌ని చేస్తుండ‌డంతో వైసీపీ నేత‌లు త‌మ వంతుగా కృషి చేస్తున్నారు. అయితే సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టుగా రూర‌ల్ జిల్లాకు చెందిన కొంద‌రు పార్టీ నేత‌లు న‌గ‌ర రాజ‌కీయాల్లో వేలు పెట్టి కెలుకుతుండ‌డంతో పార్టీలో ఉన్న గ్రూపుల‌కు కొత్త గ్రూపులు ఏర్ప‌డుతున్నాయి.

అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్నాథ్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో బాగా జోక్యం చేసుకుంటున్నార‌న్న టాక్ బాగా వ‌చ్చేసింది. కొద్ది రోజులుగా అక్క‌డ టీడీపీ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి వ‌ర్సెస్ విజ‌య‌సాయి మ‌ధ్య స‌వాళ్ల ప‌ర్వం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే వెల‌గ‌పూడిని తూర్పు వైసీపీ ఇన్‌చార్జ్ అక్క‌ర‌మాని విజ‌య‌నిర్మ‌ల టార్గెట్ చేశారు. అయితే ఇందులోకి త‌న‌కు సంబంధం లేకపోయినా గుడివాడ అమ‌ర్నాథ్ ఎంట‌ర్ అయిపోయారు. ఆమె గ‌త ఎన్నిక‌ల్లో ఓడినా బాగానే క‌ష్ట‌ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆమెకే సీటు అని ప్ర‌చారం న‌డుస్తోంది.

అయితే ఆమెను సైడ్ చేయ‌డంతో పాటు.. గ‌త ఎన్నిక‌ల్లో ఆమె ఓట‌మికి కృషి చేసిన వారిని వెంటేసుకుని మ‌రీ అమ‌ర్నాథ్ తూర్ప‌లో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌డంతో విజ‌య‌నిర్మ‌ల గుస్సాతో ఉన్నారంటున్నారు. త్వ‌ర‌లో జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఛాన్స్ వ‌స్తుంద‌ని భావించే అమ‌ర్నాథ్ అత్య‌త్సాహానికి పోతున్నార‌ని వైసీపీ వాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. 


శృతి మించిన శృతి హాసన్.... అందాల విందు...!?

తలైవా ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు...!

కేసీఆర్ కు మంత్రులు ఏం చెప్పారు...?

చిరు ఆచార్య‌కు అదే మైన‌స్సా... !

రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?

రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు

మీర‌లా చేస్తే రూ.కోటి ముప్పై ల‌క్ష‌లు చేతికి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>