MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd07065c2-64b7-4e68-8e5c-bf9772c89da6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd07065c2-64b7-4e68-8e5c-bf9772c89da6-415x250-IndiaHerald.jpgఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లే పరువు తీసేస్తూ ఉంటాయి. అయితే అది మీడియా ముఖంగా జరిగినప్పుడు మాత్రం ఎల్లకాలం గుర్తుండిపోయేలా రికార్డ్ అవుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి ఎదురైంది రామ్ రెడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. నిన్న సాయంత్రం రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో జరిగిన చిన్న పొరపాటు కాసేపు అక్కడివారిని టెన్షన్ పెట్టింది. మామూలుగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరిలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి టికెట్ ని వచ్చిన ముఖ్య అతిథిగా చేత ఓపెన్tollywood;ravi;bhavana;ram pothineni;ravi teja;srinivas;trivikram srinivas;hyderabad;tollywood;cinema;media;event;krack;redరెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ కి షాకిచ్చిన క్రాక్ మూవీ టికెట్ !రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ కి షాకిచ్చిన క్రాక్ మూవీ టికెట్ !tollywood;ravi;bhavana;ram pothineni;ravi teja;srinivas;trivikram srinivas;hyderabad;tollywood;cinema;media;event;krack;redWed, 13 Jan 2021 07:00:00 GMTమీడియా ముఖంగా జరిగినప్పుడు మాత్రం ఎల్లకాలం గుర్తుండిపోయేలా రికార్డ్ అవుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి ఎదురైంది రామ్ రెడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. నిన్న సాయంత్రం రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.


అయితే ఈ ఈవెంట్ లో జరిగిన చిన్న పొరపాటు కాసేపు అక్కడివారిని టెన్షన్ పెట్టింది. మామూలుగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరిలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి టికెట్ ని వచ్చిన ముఖ్య అతిథిగా చేత ఓపెన్ చేయిస్తూ ఉంటారు. అది వారికి అందించినట్టుగా ఓ భారీ బ్రోచర్ అందిస్తారు. నిన్న కూడా ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఈ యూనిట్ సభ్యులు భారీ బ్రోచర్ అందించారు. ఆ బ్రోచర్ లో రామ్ రెడ్ సినిమా కి బదులు ఇటీవల రిలీజ్ అయిన రవితేజ క్రాక్ సినిమా టిక్కెట్ ఉంది. ఇదేంటి అని టెన్షన్ పడి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆ తర్వాత దాని పక్కన పెట్టేసి కార్యక్రమాన్ని ముగించారు.


అయితే లైవ్ చూసిన వాళ్ళు కూడా పెద్దగా దీనిని గుర్తించలేక పోవచ్చు కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే ఈ రెండు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లను టాలీవుడ్ కి చెందిన శ్రేయాస్ మీడియా అనే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నిర్వహించింది. ముందుగా క్రాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 6వ తేదీన జరిగింది. బహుశా ఈ రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి ఒక చోటే ఈ బ్రోచర్లు ప్రింట్ చేయించారు ఏమో. అందుకే రెండిటికీ క్రాక్ అనే టైటిల్ పడి ఉండొచ్చనే భావన వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం అయితే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. ఇక నిమిషాల్లో డెలివరీ..?

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?

చంద్రబాబుకు క్రిస్టియన్లు షాక్ ఇచ్చారా.. అసలు వాస్తవం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>