Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-signed-after-increased-priority9ea1d510-ae0c-4202-980d-9314cdef967f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi-signed-after-increased-priority9ea1d510-ae0c-4202-980d-9314cdef967f-415x250-IndiaHerald.jpgమూడేళ్ల తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇన్నాళ్ల గ్యాప్ పు పూరించాలనే ఈ హీరో సాధ్యమైనన్నీ సినిమాలకు ఓకే చెప్తూ వెలుతున్నాడు. తాజాగా పింక్ రీమేక్ గా తెరకెక్కిన‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో పవన్ కళ్యాణ్ మలయాళం సూపర్ హిట్ మూవీ అయిన అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాను ఫిsai pallavi;beauty;pawan;rana;kalyan;pawan kalyan;puri jagannadh;cinema;remake;february;hero;heroine;success;pink;sai pallaviపవన్ సరసన సాయి పల్లవి నటించడానికి కారణం అదా ?పవన్ సరసన సాయి పల్లవి నటించడానికి కారణం అదా ?sai pallavi;beauty;pawan;rana;kalyan;pawan kalyan;puri jagannadh;cinema;remake;february;hero;heroine;success;pink;sai pallaviWed, 13 Jan 2021 11:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇన్నాళ్ల గ్యాప్ పు పూరించాలనే ఈ హీరో సాధ్యమైనన్నీ సినిమాలకు ఓకే చెప్తూ వెలుతున్నాడు. తాజాగా పింక్ రీమేక్ గా తెరకెక్కిన‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో పవన్ కళ్యాణ్ మలయాళం సూపర్ హిట్ మూవీ అయిన అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాను ఫిబ్రవరి నుంచే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఇరు హీరోల సరసన ఏ కథానాయికలు నటిస్తున్నారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
హీరోయిన్లను ఇంకా సెలక్ట్ చేసే పనిలోనే ఉంది ఈ చిత్ర యూనిట్. కాగా పవన్ సరసన నటించే ఈ హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యనే ఈ సినిమాలో పవన్ సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ సినిమాలో నటించడానికి ఈ బ్యూటీ పారీతోషికం భారీగా డిమాండ్ చేయడంతో మేకర్స్ ఆమెను తీసుకోవాలా లేదా అనే విషయం ఆలోచిస్తున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ తాజాగా సాయి పల్లవి ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీంతో ఈ అమ్మడు ఎలా ఒప్పుకుందసలు.. రాజీ పడే రకమైతే కాదు.. మరి ఏ కారణంతో సాయి పల్లవి ఒప్పుకుందో అర్థమవ్వని విషయమే.

 అయితే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర పరిధి పెద్దదిగా ఉండబోతోందట. అలాగే తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉందని తెలుస్తోంది. దాంతోనే ఈ చిన్నది ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.  అయితే సాయి పల్లవి అడిగినంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఓకే కూడా చెప్పే ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సాయి పల్లవి ఒప్పుకుందని నెటిజన్లు భావిస్తున్నారు. అంతే కదా సాయి పల్లవి నటన అంటే ఇష్ట పడని వారెవరూ ఉండరూ. ఈ ముద్దుగుమ్మ ఏ పాత్రలో నటించినా దాన్ని వంద శాతం సక్సెస్ గా చేయడంలో ముందుంటుంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఈ చిన్నదాన్ని సినిమాలోకి తీసుకోవడానికి ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది. కాగా ఈ మూవీలో రానా సరసన ఎవరు నటిస్తున్నారన్న విషయం పై ఒక క్లారిటీ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.


తెలంగాణ రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..... మరో ముగ్గురు మృతి

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?

2021 కేంద్ర బడ్జెట్ లో షాకింగ్ అదే..

చూస్తూ చూస్తూ కొంపముంచిన బాబు...?

జ‌మిలీకి జ‌గ‌న్ రెడీ... సిగ్న‌ల్స్ ఇచ్చేశారుగా...!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌... ఇద్ద‌రు కీల‌క నేత‌లు టీడీపీలోకి జంప్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>