HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-flying-aeroplane-rules-confused363a9a3b-b479-4cb7-90f0-d0f57359520f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-flying-aeroplane-rules-confused363a9a3b-b479-4cb7-90f0-d0f57359520f-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాల పెద్దన్నగా పిలువబడే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అలాగే మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కొవిడ్ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు కాగా... మంగళవారం (జనవరి 12) 4470 మరణాలు నమోదయ్యాయి. 2,35,000 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. ఈ కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై అమెరికా దేశం మరిన్ని ఆంక్షలు విధించింది.airways;american samoa;january;international;coronavirusఅమెరికాలో భారీగా పెరుగుతున్న మరణాలు ... అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలుఅమెరికాలో భారీగా పెరుగుతున్న మరణాలు ... అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలుairways;american samoa;january;international;coronavirusWed, 13 Jan 2021 10:30:00 GMTకరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అలాగే మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కొవిడ్ మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు కాగా... మంగళవారం (జనవరి 12) 4470 మరణాలు నమోదయ్యాయి. 2,35,000 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. ఈ కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై అమెరికా దేశం మరిన్ని ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కే ముందు కచ్చితంగా కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపించాలనే నిబంధన విధించాలని నిర్ణయం తీసుకుంది. యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ అవకాశం ఉంది.


 యూకేలో కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అమెరికా ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఇదే తరహాలో ఇతర దేశాల ప్రయాణికులపై కూడా ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సీడీసీ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులే కాకుండా యూఎస్ నుంచి విదేశాలకు వెళ్లి అమెరికాకు తిరిగి రానున్న తమ సొంత దేశ పౌరులకు కూడా ఇది వర్తిస్తుంది. ఇక ఇప్పటికే కరోనా బారిన పడ్డ జనం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ఆ ఆసుపత్రులు కూడా కిక్కిరిసిపోయాయి. చాలా మందికి బెడ్స్, వైద్య సదుపాయాలు సక్రమంగా అందడం లేదు. ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన అమెరికా దేశానికి ఇలాంటి దుస్థితి దాపురించడం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను ఆవేదనకు, ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆఖరికి మృతుల అంత్యక్రియలకు శ్మశాన వాటికల్లో కూడా చోటు దక్కని దుస్థితి నెలకొంది.


ఓటు వేయనందుకు పెన్షన్లను ఆపేసిన కౌన్సిలర్ భర్త...

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌... ఇద్ద‌రు కీల‌క నేత‌లు టీడీపీలోకి జంప్ ?

ప్రభాస్ వ్యూహాల పై కన్నేసిన నాని !

షాకింగ్‌: పోలీసుల చేతికి చిక్కిన అఖిలప్రియ భర్త.. అన్నీ చెప్పేశాడా..?

టీడీపీలో మ‌రో ఇద్ద‌రు లోకేశాలు... ఆ ఇద్ద‌రు వీళ్లే...!

వంశీ దెబ్బకు బచ్చుల సైలెంట్...టీడీపీకి దిక్కు ఎవరు ?

ఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>