PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/greater-war0fb974d5-c998-41b3-84c0-bc42c5478214-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/greater-war0fb974d5-c998-41b3-84c0-bc42c5478214-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవలే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో పలువురు అధికారులు, నాయకులు ఈ పోలింగ్ శాతంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ అయితే... ఒక అడుగు ముందుకు వేసి ఓటు వేయనివారికి సంక్షేమ పథకాలన్నీ కట్ చేయాలన్నారు. అప్పట్లో అదొక సంచలన న్యూస్ అయింది. కానీ.. నిజామాబాద్‌లో మాత్రం ఒక కౌన్సిలర్ భర్త ఓటు వేయని కొందరి విషయంలో అదే చేశాడు. కొంతమందికి పెన్షన్లను నిలిపివేశాడుghmc;hyderabad;telangana;capital;husband;local languageఓటు వేయనందుకు పెన్షన్లను ఆపేసిన కౌన్సిలర్ భర్త...ఓటు వేయనందుకు పెన్షన్లను ఆపేసిన కౌన్సిలర్ భర్త...ghmc;hyderabad;telangana;capital;husband;local languageWed, 13 Jan 2021 10:35:00 GMTతెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవలే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో పలువురు అధికారులు, నాయకులు ఈ పోలింగ్ శాతంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ అయితే... ఒక అడుగు ముందుకు వేసి ఓటు వేయనివారికి సంక్షేమ పథకాలన్నీ కట్ చేయాలన్నారు. అప్పట్లో అదొక సంచలన న్యూస్ అయింది. అప్పుడు ఆయన అలా ఎందుకన్నారో తెలియదు కానీ.. నిజామాబాద్‌లో మాత్రం ఒక కౌన్సిలర్ భర్త ఓటు వేయని కొందరి విషయంలో అదే చేశాడు. కొంతమందికి పెన్షన్లను నిలిపివేశాడు. ఓటు వేయలేదన్న కారణంతో జిల్లాలోని ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 33 మంది తాలూకా పెన్షన్లను కౌన్సిలర్ భర్త రద్దు చేయించారు.


దీంతో పాపం గత మూడు నెలలుగా బాధితులకు పెన్షన్ అందడం లేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి నెలవారీగా వచ్చే పెన్షన్‌ సడెన్ గా ఎందుకు ఆగిపోయిందో వారికి అర్థం కాలేదు. దీంతో ఆ విషయం తెలుసుకోవడం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో విసుగు చెందిన బాధితులు రోడ్డుపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్దం అయ్యారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ భర్త హుటాహుటిన దిద్దుబాటు చర్యలకు దిగారు. వెంటనే మున్సిపల్‌ కార్యాలయంలోని ఆపరేటర్ల సహాయంతో లబ్దిదారులకు డబ్బులు పంపిణీ చేయించాడు. హడావిడిగా వచ్చి బాధితులు అందరికీ డబ్బులు అందించి వారి వద్ద సంతకాలు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. మరోవైపు ఈ విషయంపై కలెక్టర్‌తో పాటు స్థానిక ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు కౌన్సిలర్ భర్త నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. ఓటు వేయకపోతే ఎలా పెన్షన్ నిలిపివేస్తారంటూ నిలదీస్తున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..... మరో ముగ్గురు మృతి

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?

2021 కేంద్ర బడ్జెట్ లో షాకింగ్ అదే..

చూస్తూ చూస్తూ కొంపముంచిన బాబు...?

జ‌మిలీకి జ‌గ‌న్ రెడీ... సిగ్న‌ల్స్ ఇచ్చేశారుగా...!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌... ఇద్ద‌రు కీల‌క నేత‌లు టీడీపీలోకి జంప్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>