PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani-highlight-bjp-in-apbd7c3be7-b099-4c52-bbdb-7da12f9b93ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani-highlight-bjp-in-apbd7c3be7-b099-4c52-bbdb-7da12f9b93ee-415x250-IndiaHerald.jpgఏపీలో మంత్రి కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు అనే విషయం తెలిసిందే. చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటికాలు మీద వెళ్లిపోతారు. ఏ మాత్రం మొహమాట పడకుండా చంద్రబాబు అండ్ బ్యాచ్‌పై కాస్త పరుష పదజాలం వాడే విమర్శలు చేస్తారు. ఇక ఆయన విమర్శలు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అయితే కొడాలి నాని టీడీపీ నుంచే రాజకీయ జీవితం మొదలుపెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీలోకి వచ్చి మరో రెండు సార్లు గెలిచి, ఇప్పుడు జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. kodali nani;view;nani;jeevitha rajaseskhar;kodali nani;bharatiya janata party;jagan;2019;minister;tdp;partyబీజేపీని హైలైట్ చేస్తున్న కొడాలి...అదిరిపోయే ప్లాన్ వేశారుగా....!బీజేపీని హైలైట్ చేస్తున్న కొడాలి...అదిరిపోయే ప్లాన్ వేశారుగా....!kodali nani;view;nani;jeevitha rajaseskhar;kodali nani;bharatiya janata party;jagan;2019;minister;tdp;partyWed, 13 Jan 2021 01:00:00 GMTమంత్రి కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు అనే విషయం తెలిసిందే. చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటికాలు మీద వెళ్లిపోతారు. ఏ మాత్రం మొహమాట పడకుండా చంద్రబాబు అండ్ బ్యాచ్‌పై కాస్త పరుష పదజాలం వాడే విమర్శలు చేస్తారు. ఇక ఆయన విమర్శలు ఎలా ఉంటాయో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. అయితే కొడాలి నాని టీడీపీ నుంచే రాజకీయ జీవితం మొదలుపెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, వైసీపీలోకి వచ్చి మరో రెండు సార్లు గెలిచి, ఇప్పుడు జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

నాని ఓ వైపు మంత్రిగా తన శాఖని మంచిగా నడుపుకుంటూనే, మరో వైపు ఎమ్మెల్యేగా గుడివాడలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు.  ఇక నాని ఈ రెండిటికంటే ఎక్కువగా ప్రతిపక్ష టీడీపీని దెబ్బతీసే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక నాని లాంటి వారు దెబ్బకు టీడీపీకి చుక్కలు కనబడుతున్నాయి.

అయితే ఈ మధ్య నాని, టీడీపీని మరీ తేలికగా తీసి పారేస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు తెలంగాణలో టీడీపీని చంపేశారని, ఇక ఏపీలో కూడా చావుబ్రతుకుల మధ్య ఉందని ఎద్దేవా చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాని ఓ వ్యూహ ప్రకారం టీడీపీని వీక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే నాని బీజేపీని బాగా హైలైట్ చేస్తున్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ-టీడీపీల్లో ఏ పార్టీ ఉంటుందనే ప్రశ్న వస్తున్నప్పుడు, అది చెప్పలేమని టీడీపీ-బీజేపీలు ఒకే స్థాయిలో ఉన్నాయని,  వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు పడే ఓట్లలో పెద్ద తేడా ఉండదని, టీడీపీకి మొన్న వచ్చిన 40 శాతం ఓట్లలోనే బీజేపీ 20 శాతం పైనే తీసుకోవచ్చని మాట్లాడుతున్నారు.

అంటే 2019 ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు కూడా సరిగ్గా పడని బీజేపీ నెక్స్ట్ 20 శాతంపైనే ఓట్లు తెచ్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు. నాని మాటలు బట్టి చూస్తుంటే టీడీపీని వీక్ చేయడానికి బీజేపీని కావాలనే లేపుతున్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి నాని చెప్పినట్లుగా ఏపీలో బీజేపీ ఏ మేర సత్తా చాటుతుందో.




బాత్రూంలో జారిపడిన హీరోయిన్.. ఆ వెంటనే సాంగ్ షూట్‌ ఉండటంతో..

హనీమూన్ ఎప్పుడో చెప్పేసిన సింగర్ సునీత.. ప్లాన్ ఏంటంటే..

బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనితో ప్రేమలో ఉందా?

వాట్సాప్ వీడుతున్నారా? అయితే ఈ పని చేయండి.. లేదంటే డేంజరే

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!

శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో.. మన ర్యాంక్ ఎంతో చెప్పిన జాబితా.. అగ్రస్థానం మళ్లీ వాళ్లకే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>