PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp273e391b-c355-4b23-b319-e23c60280bd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp273e391b-c355-4b23-b319-e23c60280bd7-415x250-IndiaHerald.jpgముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామయ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆల‌యాల్లో విగ్ర‌హాల ధ్వంసానికి పాల్ప‌డుతున్న‌ది ఎవ‌రో త‌న‌కు తెలుసంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స్వ‌యంగా వ్యాఖ్య‌నించిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు 91 సీఆర్‌పీసీ ఇచ్చి ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి నిజాలు రాబ‌ట్టాల‌ని డీజీపీకి టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు వ‌ర్ల రామ‌య్య డీజీపీకి లేఖ కూడా రాశారు. గతంలో చంద్రబాబుకు, తనకు నోటీసులిచ్చిన పోలీసులు.. సీఎం జగన్‌కు సైతం నోటీస్‌లు ఇవ్వjagan;cbn;amala akkineni;darshana;deva;prema;jagan;andhra pradesh;nellore;police;cm;love;aqua;letter;tdp;ammavodiఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...jagan;cbn;amala akkineni;darshana;deva;prema;jagan;andhra pradesh;nellore;police;cm;love;aqua;letter;tdp;ammavodiWed, 13 Jan 2021 11:35:55 GMTటీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామయ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆల‌యాల్లో విగ్ర‌హాల ధ్వంసానికి పాల్ప‌డుతున్న‌ది ఎవ‌రో త‌న‌కు తెలుసంటూ  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స్వ‌యంగా వ్యాఖ్య‌నించిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు 91 సీఆర్‌పీసీ ఇచ్చి ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి నిజాలు రాబ‌ట్టాల‌ని డీజీపీకి టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు వ‌ర్ల రామ‌య్య డీజీపీకి లేఖ కూడా రాశారు. గతంలో చంద్రబాబుకు, తనకు నోటీసులిచ్చిన పోలీసులు.. సీఎం జగన్‌కు సైతం నోటీస్‌లు ఇవ్వాలన్నారు. సీఎంకు నోటీసులు ఇవ్వకుంటే పోలీసులు విచారణ జరిపే తీరు సరైంది కాదని భావిస్తామన్నారు. సీఎం జగన్‌ క్రైస్తవ సంఘాలను రెచ్చగొట్టి వారిని రోడ్లపైకి పంపిస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం వారిని సీఎం జగన్‌ వాడుకుంటున్నారన్నారు.


నెల్లూరులో అమ్మఒడి కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి  ఈవిధంగా మాట్లాడారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంటే ఓర్వలేక కడుపు మంటలో ఆలయాల ధ్వంసం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు, శక్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాన్యులకు రక్షణ లేకుండా ఎన్నికలకు నిర్వహించాలంటున్నారని విమర్శించారు. విద్రోహ శక్తుల పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ప్రతిపక్షాల్లో కడుపుమంట కనిపిస్తోందని సీఎం అన్నారు. దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, ఆ తర్వాత దేవాలయాల సందర్శన అంటున్నారని మండిపడ్డారు.


“రథాలను తగలబెట్టి రథయాత్రలు చేస్తున్నారు.. సంక్షేమ పథకాల మంచి ప్రజలకు తెలియకూడదనే.. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు” అంటూ వ్యాఖ్య‌నించారు. దేవుడిపై భక్తి లేనివాళ్లు ఆలయాల భూములను కాజేసిన వాళ్లు, ఆలయాల్లో క్షుద్రపూజలు చేసినవాళ్లు. ఇప్పుడు దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. పేదింటి మహిళలకు ఇళ్ల స్థలాలు అందకుండా కేసులు వేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న కోవర్టులు కూడా ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఆలయాల్లో విగ్రహాలు పగలగొట్టారని, రాబోయే రోజుల్లో బడులపై విధ్వంసం సాగిస్తారేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.




తెలంగాణ రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..... మరో ముగ్గురు మృతి

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?

2021 కేంద్ర బడ్జెట్ లో షాకింగ్ అదే..

చూస్తూ చూస్తూ కొంపముంచిన బాబు...?

జ‌మిలీకి జ‌గ‌న్ రెడీ... సిగ్న‌ల్స్ ఇచ్చేశారుగా...!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌... ఇద్ద‌రు కీల‌క నేత‌లు టీడీపీలోకి జంప్ ?

ప్రభాస్ వ్యూహాల పై కన్నేసిన నాని !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>