SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news784a5d61-801f-495e-b223-597eb3178c3d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news784a5d61-801f-495e-b223-597eb3178c3d-415x250-IndiaHerald.jpgబార్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరుగుతున్నా టెస్ట్ సిరీస్ మొదటి నుండి ఎన్నో వివాదాలతోను, ఆసీస్ ఆటగాళ్ల వైఖరితోను, టీమిండియా ఆటగాళ్లు గాయాలతోనూ, ఇలా ఒకటేమిటి ఈ టెస్ట్ సిరీస్ లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా స్టీవ్ స్మిత్, ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మరో వివాదానికి తెర తీసిన సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ లో భారత్ ముందు ఆసీస్ 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగా, భారత్ ఓటమి ఖాయమని అందరూ భావించారు. ఇలాంటి తరుణంలో హనుమ విహారి, అశ్విన్ ఇద్దరు తమ అద్బుత ప్రదర్శనతో భారత్ ను ఓsports news;india;naga aswin;rishabh pant;letter;steve smith;paruguఒకరి క్షమాపణ...మరొకరి సమర్థింపు..!!ఒకరి క్షమాపణ...మరొకరి సమర్థింపు..!!sports news;india;naga aswin;rishabh pant;letter;steve smith;paruguWed, 13 Jan 2021 17:00:00 GMT బార్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరుగుతున్నా టెస్ట్ సిరీస్ మొదటి నుండి ఎన్నో వివాదాలతోను, ఆసీస్ ఆటగాళ్ల వైఖరితోను, టీమిండియా ఆటగాళ్లు గాయాలతోనూ, ఇలా ఒకటేమిటి ఈ టెస్ట్ సిరీస్ లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా స్టీవ్ స్మిత్, ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మరో వివాదానికి తెర తీసిన సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ లో భారత్ ముందు ఆసీస్ 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగా, భారత్ ఓటమి ఖాయమని అందరూ భావించారు. ఇలాంటి తరుణంలో హనుమ విహారి, అశ్విన్ ఇద్దరు తమ అద్బుత ప్రదర్శనతో భారత్ ను ఓటమి నుండి తప్పించి డ్రా గా ముగించారు. ఇదిలా ఉండగా గెలుపు చేజారిందన్న అసహనంతో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ అశ్విన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం సంచలనంగా మారింది.

మ్యాచ్ అనంతరం ఈ వివాదం పై టిమ్ పైన్ వివరణ ఇచ్చుకున్నాడు. ఒక కెప్టెన్ గా తాను ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఘోరంగా విఫలం అయ్యనాని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం అశ్విన్ ను క్షమాపణ కోరినట్టు తెలిపాడు. ఇదిలా ఉండగా ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ మూడవ టెస్ట్ లో భాగంగా పంత్ గార్డ్ మార్క్స్ చెరిపాడని వస్తున్న వార్తల నేపథ్యంలో తన చర్య పై వివరణ ఇచ్చుకున్నాడు. అసలు ఇందులో ఎలాంటి వివాదమే లేదని అతను స్పష్టం చేశాడు.  తనపై వస్తున్న ఈ ఆరోపణలు విని ఆశ్చర్య పోయానని తెలిపాడు. ఇలాంటి వార్తలు రావడం మానసికంగా తనను చాలా బాధించయని స్మిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.

" సాధారణంగా పిచ్‌ వద్దకు వెళ్లి మా బౌలర్లు ఎక్కడ బంతులు వేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడుతున్నారు అనేది అక్కడ నిలబడి ఒక దృశ్యాన్ని నా మదిలో ఊహించుకుంటానని . అప్రయత్నంగా మిడిల్‌ స్టంప్‌కు అనుగుణంగా ఒక మార్కింగ్‌ కూడా చేసుకోవడం నాకు అలవాటు. అంతే గానీ నేనేమీ కావాలని చేసిన పని కాదని " స్మిత్ స్పష్టం చేశాడు . భారత జట్టు చూపిన అద్భుత ప్రదర్శన కాకుండా ఇలాంటి విషయాలకు ప్రాధాన్యత దక్కడం సిగ్గు పడాల్సిన అంశం’ అంటూ స్మిత్‌ తనను తాను సమర్థించుకున్నాడు. దీంతో స్మిత్ వివరణ పై భారత అబిమానుల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు స్మిత్ వివరణలు సమర్థిస్తుండగా, మరికొందరు "ఇది నీకు అలవాటే" అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  . 


సమ్మర్ లో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..!

వామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?

ఆ చిత్రం ఏఎన్నార్ దశనే మార్చేసిందట!

కేటిఆర్ ఎందుకు దిగారు...?

సింగర్ సునీత వివాహంపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసిన నాగబాబు

చంద్రబాబుని తీవ్రంగా విమర్శించిన.... ఫైర్ బ్రాండ్...!?

పిల్లలకు దేవుడుగా మారిన సోనూ సూద్.. ఈసారి ఏకంగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>