Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/sports/libra_libra/boxing-day-teste539abe2-fa38-45fa-8eab-f19f09696c6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/sports/libra_libra/boxing-day-teste539abe2-fa38-45fa-8eab-f19f09696c6c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో ఆటగాళ్లు కఠిన నిబంధనల మధ్య ఎన్నో కష్టాలు పడుతూ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. అయితే మొన్నటి వరకు సిడ్నీ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు ఇక నాలుగవ టెస్ట్ కోసం బ్రిస్బేన్ చేరుకున్నారు. కానీ అక్కడ భారత ఆటగాళ్లు అందరికీ ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. జనవరి 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నాల్గవ టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా kohli;cricket;australia;january;sourav ganguly;bcci;houseఆస్ట్రేలియాలో బాత్రూంలు కడిగిన భారత ఆటగాళ్లు.. దాదా వెరీ సీరియస్..?ఆస్ట్రేలియాలో బాత్రూంలు కడిగిన భారత ఆటగాళ్లు.. దాదా వెరీ సీరియస్..?kohli;cricket;australia;january;sourav ganguly;bcci;houseWed, 13 Jan 2021 12:00:00 GMTఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో ఆటగాళ్లు కఠిన నిబంధనల మధ్య ఎన్నో కష్టాలు పడుతూ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. అయితే మొన్నటి వరకు సిడ్నీ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు ఇక నాలుగవ టెస్ట్ కోసం బ్రిస్బేన్ చేరుకున్నారు.  కానీ అక్కడ భారత ఆటగాళ్లు అందరికీ ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. జనవరి 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నాల్గవ టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా జరుగనుంది అన్న విషయం తెలిసిందే.



 ఇక కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో క్రికెట్ స్టేడియానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సోఫిటల్  అనే ఫైవ్ స్టార్ హోటల్ ను  పూర్తిగా టీమిండియాకు కేటాయించారు.  ఈ క్రమంలోనే ఆటగాళ్లకు కరోనా  వైరస్ బారిన పడకుండా ఉండేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అతి జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో హోటల్ లో ఏ సౌకర్యాన్ని కూడా భారత క్రికెటర్లు వినియోగించుకోలేక పోతున్నారు.  ఈ క్రమంలోనే తమ బాత్రూంలని తామే శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది భారత ఆటగాళ్లకు.  అయితే ఈ విషయం బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి తెలిసి  సీరియస్ అయినట్లు తెలుస్తుంది.



 అయితే ప్రస్తుతం భారత క్రికెటర్లు అందరూ కూడా బయో బబుల్ సెక్యూర్ పద్ధతిలో ఉండగా...  హోటల్ సిబ్బంది తో ఎవరికీ ఫిజికల్ కాంటాక్ట్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే హోటల్ మొత్తాన్ని ఖాళీ చేసి ప్రస్తుతం కేవలం భారత ఆటగాళ్ల కోసం మాత్రమే ఈ హోటల్ కేటాయించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.  ఈ క్రమంలోనే హౌస్ కీపింగ్, రూమ్ సర్వీస్ చేసే సిబ్బంది కూడా హోటల్ నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆటగాళ్లు అందరికీ ఆహారం కూడా ఆ హోటల్ సమీపంలో ఉన్న ఒక భారత హోటల్  నుంచి తెప్పించనున్నారు.  ఈ క్రమంలోనే ఎవరు సిబ్బంది లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఏకంగా తమ బాత్రూంలని  సైతం క్లీన్ చేసుకున్నారట. ఇక దీనిపై సౌరవ్ గంగూలీ సీరియస్ అయ్యి  ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పెద్దలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.


రుచికరమైన పల్లీల సలాడ్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?

2021 కేంద్ర బడ్జెట్ లో షాకింగ్ అదే..

చూస్తూ చూస్తూ కొంపముంచిన బాబు...?

జ‌మిలీకి జ‌గ‌న్ రెడీ... సిగ్న‌ల్స్ ఇచ్చేశారుగా...!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌... ఇద్ద‌రు కీల‌క నేత‌లు టీడీపీలోకి జంప్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>