SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/smarana/137/the-legend-actoress-anjali-devi201dbc9b-e340-4aed-afac-fd47059cd0f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/smarana/137/the-legend-actoress-anjali-devi201dbc9b-e340-4aed-afac-fd47059cd0f9-415x250-IndiaHerald.jpg అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి అసలు పేరు అంజనీ కుమారి. మంచి నర్తకిగా కూడా పేరు తెచ్చుకుంది. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము, 2007లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది రంగస్థలంపై న‌ట‌న జీవితాన్ని ఆరంభించిన ఆమె త‌క్కువ కాలంలోనే సినిమాల్లో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంది. history;chiranjeevi;geetha;jayaprada;nageshwara rao akkineni;raja;seetha;godavari river;district;cinema;sangeetha;january;tamil;kannada;rangasthalam;husband;traffic police;peddapuram;prasthanamహెరాల్డ్ స్మ‌రామీ : అభిన‌వ సీత‌మ్మ‌..అంజ‌లిదేవి..హెరాల్డ్ స్మ‌రామీ : అభిన‌వ సీత‌మ్మ‌..అంజ‌లిదేవి..history;chiranjeevi;geetha;jayaprada;nageshwara rao akkineni;raja;seetha;godavari river;district;cinema;sangeetha;january;tamil;kannada;rangasthalam;husband;traffic police;peddapuram;prasthanamWed, 13 Jan 2021 07:00:00 GMTరాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది.


ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు. సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993), పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973), చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు, చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.


ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో సంగీత దర్శకుడు. అంజలీదేవి 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంలో జన్మించింది. ఆమె చిన్నప్పటి పేరు అంజనీ కుమారి. సినిమా ప్రస్థానంలో దర్శకుడు సి. పుల్లయ్య ఆమె పేరు అంజలీ దేవిగా మార్చాడు.అంజలీ దేవి చెన్నైలో జనవరి 13, 2014 న, 86 సంవత్సరాలు వయస్సులో మృతి చెందారు.




గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. ఇక నిమిషాల్లో డెలివరీ..?

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?

చంద్రబాబుకు క్రిస్టియన్లు షాక్ ఇచ్చారా.. అసలు వాస్తవం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>