CrimeSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhihar-crime9c7480c5-ef8c-4aef-83f7-99f01f225160-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhihar-crime9c7480c5-ef8c-4aef-83f7-99f01f225160-415x250-IndiaHerald.jpgగుంటూరు ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్ ఇంట్లో చోరీ మిస్టరీ వీగింది. రెండు గంటల్లోనే ఈ కేసును పోలీసులు చేధించారు. కమాండెంట్ ఇంటి దగ్గర విధులు నిర్వహిస్తున్న కానిస్టేబులే ఈ దొంగతనం చేశాడని తెలిసి అంతా అవాక్కయ్యారు. నాగార్జున యూనివర్సిటీలోని 10వ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌కు సంతోష్‌కుమార్‌ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కునుకు శ్రీనివాసరావు ఎన్‌డీఆర్‌ఎఫ్‌లోని కమాండెంట్‌ కార్యాలయం వద్ద డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. crime;nagarjuna akkineni;santhosh;police;mangalagiri;atmakur;santhossh jagarlapudiకమాండెంట్ ఇంటికి కన్నం వేసిన నమ్మిన బంటు......కమాండెంట్ ఇంటికి కన్నం వేసిన నమ్మిన బంటు......crime;nagarjuna akkineni;santhosh;police;mangalagiri;atmakur;santhossh jagarlapudiWed, 13 Jan 2021 09:45:00 GMTగుంటూరు ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్ ఇంట్లో చోరీ మిస్టరీ వీగింది. రెండు గంటల్లోనే ఈ కేసును పోలీసులు చేధించారు. కమాండెంట్ ఇంటి దగ్గర విధులు నిర్వహిస్తున్న కానిస్టేబులే ఈ దొంగతనం చేశాడని తెలిసి అంతా అవాక్కయ్యారు. నాగార్జున యూనివర్సిటీలోని 10వ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్‌కు సంతోష్‌కుమార్‌ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కునుకు శ్రీనివాసరావు ఎన్‌డీఆర్‌ఎఫ్‌లోని కమాండెంట్‌ కార్యాలయం వద్ద డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఏడేళ్ళుగా శ్రీనివాసరావును నమ్మి సంతోష్ ఇంటి తాళం ఒకటి ఇచ్చాడు. జమ్మూకాశ్మీర్‌కు కమాండెంట్‌, శ్రీకాకుళానికి కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం వెళ్లి రిపోర్టు చేయాలని శ్రీనివాసరావును సంతోష్ ఆదేశించారు. కాశ్మీర్‌ వెళ్లే వరకు ఉంటానని సంతోష్‌ను నమ్మించాడు. రెండు రోజుల క్రితం కమాండెంట్‌ తన ఇంటి సామాను జమ్మూకు పంపించారు. బంగారు ఆభరణాలన్నీ ఒక సంచిలో పెట్టి ఇంట్లోనే ఉంచుకున్నారు. 11న సంతోష్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓ అధికారి కుమారుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్లారు. వారితోపాటు వచ్చిన శ్రీనివాసరావు మధ్యలోనే వెళ్లిపోయాడు. సీన్ కట్ చేస్తే వేడుక ముగిశాక కమాండెంట్‌, తన ఇంటికి వచ్చి చూస్తే నగల సంచీ కనిపించలేదు.





చోరీ జరగడంతో అవాక్కైన కమాండెంట్ ఎస్పీకి ఫోన్‌ చేశారు. వెంటనే డీఎస్పీ దుర్గాప్రసాద్‌, సీఐ శేషగిరిరావు, క్లూస్‌టీం అలర్ట్ అయ్యింది. పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలించి శ్రీనివాసరావును ప్రశ్నించగా వారిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. నగల సంచితోపాటు ఇతర సంచులు తెరిచి ఉన్నాయని.. కిటికీ గ్రిల్స్‌ను వంచేశారని, అక్కడక్కడా సిగరెట్‌ ముక్కలున్నట్లు చూపించి దొంగలపనిగా నమ్మించాలని చూశాడు. కానీ ఇంటి తాళం ఒకటి శ్రీనివాసరావు వద్ద ఉన్నట్లు పోలీసులకు తెలియడంతో.. అతడ్ని ప్రశ్నించారు. తనపై అనుమానపడుతున్నారా.. తన ఫోన్‌ లొకేషన్‌ టవర్‌ నుంచి పరిశీలించుకోండి అని చెప్పాడు. అనుమానంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో తానే దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు. తనకున్న రూ.10 లక్షల అప్పులు తీర్చి.. భార్యాపిల్లలకు బంగారు ఆభరణాలు చేయించాలని అనుకుంటున్నానని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు.




కర్బూజా తో చర్మ సమస్యలు మాయం.. ఎలా అంటే.?

ప్రభాస్ వ్యూహాల పై కన్నేసిన నాని !

షాకింగ్‌: పోలీసుల చేతికి చిక్కిన అఖిలప్రియ భర్త.. అన్నీ చెప్పేశాడా..?

టీడీపీలో మ‌రో ఇద్ద‌రు లోకేశాలు... ఆ ఇద్ద‌రు వీళ్లే...!

వంశీ దెబ్బకు బచ్చుల సైలెంట్...టీడీపీకి దిక్కు ఎవరు ?

ఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?

అయోధ్య రామ మందిరానికి భారీ విరాళం ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>