PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhattivikramarkaf453226b-6587-4547-ab6d-ca813a399d8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhattivikramarkaf453226b-6587-4547-ab6d-ca813a399d8c-415x250-IndiaHerald.jpgకేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. కేసీఆర్ తన వ్య‌క్తి గ‌త అవ‌స‌రాల కోసం రాష్ట్ర రైతాంగాన్ని మోదీ కాళ్ల ద‌గ్గ‌ర పెట్ట‌డం మంచిది కాద‌ని భ‌ట్టి మండిప‌డ్డారు.bhattivikramarka;kcr;vidya;delhi;narendra modi;media;chief minister;electricity;assembly;central government;mantraత‌క్ష‌ణమే అసెంబ్లీని ఏర్పాటు చేయాలిత‌క్ష‌ణమే అసెంబ్లీని ఏర్పాటు చేయాలిbhattivikramarka;kcr;vidya;delhi;narendra modi;media;chief minister;electricity;assembly;central government;mantraWed, 13 Jan 2021 20:03:12 GMTకేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. దీనికి సంబంధించిన  ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖ‌ను భ‌ట్టి విక్ర‌మార్క బుధ‌వారం మీడియాకు విడుద‌ల చేశారు.  ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తక్షణమే శాస‌న‌ స‌భ‌ను స‌మావేశప‌రిచి వ్యవసాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా తీర్మానం చేసి పంపాల‌ని లేఖ‌లో సీఎల్పీ పక్షాన కోరిన‌ట్లు చెప్పారు.

విద్యుత్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినట్లుగానే..  వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఆయ‌న లేఖ‌లో డిమాండ్ చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను మొద‌ట్లో వ్య‌తిరేకించిన కేసీఆర్‌... అందుకు అనుగుణంగా భార‌త్ బంద్ లో మంత్రులు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు పాల్గొన్నార‌ని అన్నారు. అయితే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వ‌చ్చాక‌.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై యూ ట‌ర్న్ తీసుకున్నార‌ని భ‌ట్టి విమర్శించారు. కేసీఆర్ నిర్ణ‌యంతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళ‌న‌లో ఉంద‌ని అన్నారు. కేసీఆర్ తన వ్య‌క్తి గ‌త అవ‌స‌రాల కోసం రాష్ట్ర రైతాంగాన్ని మోదీ కాళ్ల ద‌గ్గ‌ర పెట్ట‌డం మంచిది కాద‌ని భ‌ట్టి మండిప‌డ్డారు. ఇకరాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను తొలగిస్తామంటే స‌హించేది లేద‌ని హెచ్చరించారు.

కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై వివిధ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు గత రెండు నెలలుగా అన్న దాతలు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతులు పోరాటం చేస్తున్నారు.  కాగా రైతుల అందోళనపై సుప్రీంకోర్టు  ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ  రైతు చట్టాలను సమర్థించిన విషయం తెల్సిందే. ఈ చట్టాలు అన్నదాతల మేలు కోసమే ఉన్నాయని ఆ కమిటీ పేర్కొంది.


పోలీసులు బ్యాన్ చేసినా.. ఆగని కోడి పందేలు.. ఆ జిల్లాలో ఏకంగా..

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>