PoliticsK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/users-mistake-make-profits-to-another-companyd625d25f-9d95-4f1e-956d-d6a3df2400f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/users-mistake-make-profits-to-another-companyd625d25f-9d95-4f1e-956d-d6a3df2400f2-415x250-IndiaHerald.jpgవాట్సాప్ సంస్థ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. కేవలం ప్రకటించడమే కాదు ఈ కొత్త ప్రైవసీ పాలసీని యూజర్లు యాక్సెప్ట్ చేయకుంటే ఫిబ్రవరి 8 నుంచి వారంతా వాట్సాప్ వినియోగించడానికి అనుమతులు ఉండవు. ఈ ప్రైవసీ పాలసీ కారణంగా వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్ బుక్‌తో పంచుకుంటారు. elonmusk;american samoa;whatsapp;media;twitter;february;audio;vegetable market;texas;mahaఆ యాప్ వాడమంటూ ప్రపంచ కుబేరుడు ట్వీట్.. చిన్న పొరపాటు జరగడంతో..ఆ యాప్ వాడమంటూ ప్రపంచ కుబేరుడు ట్వీట్.. చిన్న పొరపాటు జరగడంతో..elonmusk;american samoa;whatsapp;media;twitter;february;audio;vegetable market;texas;mahaWed, 13 Jan 2021 11:58:00 GMT
" style="height: 206px;">
టెక్సాస్: వాట్సాప్ సంస్థ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. కేవలం ప్రకటించడమే కాదు ఈ కొత్త ప్రైవసీ పాలసీని యూజర్లు యాక్సెప్ట్ చేయకుంటే ఫిబ్రవరి 8 నుంచి వారంతా వాట్సాప్ వినియోగించడానికి అనుమతులు ఉండవు. ఈ ప్రైవసీ పాలసీ కారణంగా వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్ బుక్‌తో పంచుకుంటారు. దీంతో ఈ నిర్ణయం విమర్శలకు కారణమయ్యింది. ఎంతలా అంటే.. ప్రపంచ అత్యంత ధనవంతుడు ఇలాన్ మస్క్ కూడా వాట్సాప్ వాడొద్దు అనే అంత. వాట్సాప్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఇలాన్ మస్క్ ‘సిగ్నల్ వాడండి’ అంటూ ఓ ట్వీట్ పెట్టారు.

సిగ్నల్ అనేది వాట్సాప్ లాంటి మరో మెసెంజర్. అందులో కూడా వాట్సాప్ మాదిరి ఆడియో, వీడియో కాల్స్ మెసేజ్‌లు పంపించుకునే సౌకర్యం ఉంది. సిగ్నల్ వాడండి అన్న ఒక్క ట్వీట్ మహా ప్రభంజనాన్ని సృష్టించింది. వాట్సాప్ తీరుతో విసిగిపోయి ఉన్న యూజర్లు ఒక్కసారిగా సిగ్నల్ యాప్‌ వైపు మారిపోయారు. అయితే సిగ్నల్ వాడండి అంటే సిగ్నల్ అడ్వాన్స్ అనుకుని వినియోగదారులు పొరబడ్డారు. ఈ కారణంగా సిగ్నల్ అడ్వాన్స్ కంపెనీలోకి ఒక్కసారిగా భారీ పెట్టుబడులు వచ్చి పడ్డాయి. కంపెనీ షేర్ ధర ఆరు రెట్లు పెరిగిపోయి మూడు రోజుల వ్యవధిలో కంపెనీ షేర్ల విలువ 5100 శాతం పెరిగిపోయింది. దీంతో ఆ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ 390 డాలర్లకు చేరుకుంది.

మరోపక్క అమెరికా మీడియా ఇలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఈ కంపెనీ గురించి కాదంటూ మొత్తుకుంటూనే ఉంది. అయినా సరే సిగ్నల్ అడ్వాన్స్ కంపెనీ షేర్ ధర మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సిగ్నల్ అడ్వాన్స్ సంస్థ సీఈో దీనిపై స్వయంగా స్పందించాల్సి వచ్చింది. తమ కంపెనీ టెస్లాతో కానీ సిగ్నల్ యాప్‌తో కానీ ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పెట్టుబడుదారులు పెట్టుబడులకు సంబంధించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరుతూ ఓ బహిరంగ ప్రకటనను విడుదల చేశారు.




రుచికరమైన పల్లీల సలాడ్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?

2021 కేంద్ర బడ్జెట్ లో షాకింగ్ అదే..

చూస్తూ చూస్తూ కొంపముంచిన బాబు...?

జ‌మిలీకి జ‌గ‌న్ రెడీ... సిగ్న‌ల్స్ ఇచ్చేశారుగా...!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌... ఇద్ద‌రు కీల‌క నేత‌లు టీడీపీలోకి జంప్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>