PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpgరైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరు అని ఆయన అన్నారు. రైతు కూలీలు చితికిపోయారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజావ్యతిరేకత పై నిర్ణయాలు మీద నిర్ణయాలు కోనసాగిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. 7వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదు అని మండిపడ్డారు. అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారు అని విమర్శించారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానని అడ్డంగా దొరికారు అని విమర్శించారు. ప్రజావేదిక కూల్చిchandrababu;jagan;chief minister;minister;air;vegetable market;tdp;reddy;mantra;anandamగాలి రెడ్డి అంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలుగాలి రెడ్డి అంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలుchandrababu;jagan;chief minister;minister;air;vegetable market;tdp;reddy;mantra;anandamWed, 13 Jan 2021 08:57:41 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరు అని ఆయన అన్నారు. రైతు కూలీలు చితికిపోయారు అని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజావ్యతిరేకత పై నిర్ణయాలు మీద నిర్ణయాలు కోనసాగిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. 7వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదు అని మండిపడ్డారు. అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారు అని విమర్శించారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానని అడ్డంగా దొరికారు అని విమర్శించారు.

ప్రజావేదిక కూల్చి ఇంతవరకు శిథిలాలు తీయకుండా పైశాచిక ఆనందం పొందే శాడిస్టు జగన్ అని విమర్శించారు. ఒక డెకాయిట్ మాదిరి వ్యవహరిస్తున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా వాళ్ళు, బూతులు మంత్రులు నన్ను విమర్శిస్తున్నారు అని ఎద్దేవా చేసారు. దాన్యం కొనుగోళ్లు బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు అని అన్నారు. రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోంది అని విమర్శించారు. పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు ఊగిపోయారు.

రైతులకు మద్దతు ధర ఉండటంతో పాటు మార్కెట్ కమిటీలు కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నా అన్నారు ఆయన. మీటర్లు వ్యవసాయ మోటర్లకు కాదు మంత్రులకు పెట్టాలి అని, వైకాపా మంత్రులకు మీటర్లు పెడితే ఏ మంత్రి ఎంత దోచుకుంటున్నారో రియల్ టైమ్ లో తెలుస్తుంది అని ఎద్దేవా చేసారు. ఫించన్లు పెంచుకుంటూ పోతానని మోసగిస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అప్పుల కోసమే మీటర్లు పెడుతున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పట్టణాల్లో అన్నింటి పైనా పన్నులే అని అన్నారు. పెంపుడు జంతువుల పైనా పన్నులు విధిస్తున్నారు అని మండిపడ్డారు గాలి రెడ్డి కాబట్టి రేపోమాపో గాలిపైనా పన్ను వేస్తారు అని ఆయన విమర్శించారు. జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేశారు అని ఆయన విమర్శించారు. నేనేం తప్పు చేసానో నాకు తెలీదు అని, ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశా అని ఆయన అన్నారు.


ఆర్ ఆర్ ఆర్ వద్దు... ఆచార్య ముద్దు అంటున్న చరణ్.

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?

చంద్రబాబుకు క్రిస్టియన్లు షాక్ ఇచ్చారా.. అసలు వాస్తవం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>