MoviesK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arcamediabdc941da-3696-49e7-8072-734dc3fa499c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arcamediabdc941da-3696-49e7-8072-734dc3fa499c-415x250-IndiaHerald.jpgదర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు ఇండస్ట్రీలో ఓ సరికొత్త చరిత్రను సృష్టించారు. ఆయన టాలీవుడ్ పైతరం నటుల్లో ప్రతి ఒక్క హీరోతోనూ సినిమా తీశారు. ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా మారేందుకు ఆయన సినిమాలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ఈయన గత arcamedia;bharani;nageshwara rao akkineni;tanikella bharani;tollywood;cinema;media;hero;heroine;rashi khanna;s p balasubrahmanyam;v;raghavendraరాఘవేంద్రరావు హీరో.. రాశిఖన్నా హీరోయిన్.. ఏంటి షాకవుతున్నారా?రాఘవేంద్రరావు హీరో.. రాశిఖన్నా హీరోయిన్.. ఏంటి షాకవుతున్నారా?arcamedia;bharani;nageshwara rao akkineni;tanikella bharani;tollywood;cinema;media;hero;heroine;rashi khanna;s p balasubrahmanyam;v;raghavendraWed, 13 Jan 2021 21:00:00 GMTరాఘవేంద్ర రావు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు ఇండస్ట్రీలో ఓ సరికొత్త చరిత్రను సృష్టించారు. ఆయన టాలీవుడ్ పైతరం నటుల్లో ప్రతి ఒక్క హీరోతోనూ సినిమా తీశారు. ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా మారేందుకు ఆయన సినిమాలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ఈయన గత మూడేళ్ల నుంచి ఒక్క సినిమాను కూడా తెరకెక్కించలేదు. 2017లో చివరగా అక్కినేని నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. రాఘవేంద్ర రావు ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన ఎన్నడూ ఇన్నేళ్ల గ్యాప్ తీసుకోలేదు. అయితే ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్న తరువాత ఆయన మళ్లీ షూటింగ్‌లలో బిజీ కానున్నట్టు తెలుస్తోంది.

కానీ ఈ సారి ఆయన దర్శకత్వం వహించరట.. ఈ సారి ఆయన హీరోగా నటిస్తున్నారు. ఈ వార్త వింటేనే ఆశ్చర్యానికి గురవుతున్నారు కదా. అవును.. రాఘవేంద్రరావు హీరోగా మారుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆయనకు జోడీగా నటి రాశీ ఖన్నా నటిస్తోందట. ఆమెతో కలిపి మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నట్టు టాక్. ఈ సినిమాకు ఆయన సొంత బ్యానర్ అయిన ఆర్కా మీడియా వర్క్స్ ప్రొడ్యూస్ చేస్తోందట. మరి ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తున్నారనేగా మీ డౌట్. సీనియర్ నటుడు తనికెళ్ల భరణిసినిమా దర్శకత్వ బాధ్యతలను తీసుకుంటున్నారట.

తనికెళ్ల భరణి గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో మిథునం సినిమాను తీసిని విషయం తెలిసిందే. ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు కూడా రాఘవేంద్రరావుతో ఆ తరహా సినిమానే తనికెళ్ల భరణి తీయబోతున్నారా అన్నది కూడా చర్చ సాగుతోంది. అయితే ఈ సినిమాలో రాశీ ఖన్నా వంటి యంగ్ హీరోయిన్లు నటిస్తుండటంతో ఈ చిత్ర కథ అసలు ఏ విధంగా ఉండనుందోనని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


రహనే ఆ వ్యూహమే మ్యాచ్ ను నిలబెట్టిందా..?

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>