PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhogi23269c90-c758-4b2c-ad02-c844278df7e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhogi23269c90-c758-4b2c-ad02-c844278df7e4-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒక్కటి. ఈ పండగను మూడు రోజులు జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. ఈ పండుగ. తెలుగు లోగిళ్లలో కళా కాంతులు, సంతోషాలు నింపే పండుగను నాలుగు రోజులు జరుపుకోవడం మన ఆనవాయితీ. ఇక మొదటి రోజు భోగి. భోగి రోజు తెల్లవారుఝామునే భోగిమంటలు వేస్తారు.bhogi;archana;gummadi;indra;jeevitha rajaseskhar;kranthi;kranti;makar sakranti;sankranthi;festival;letter;cow slaughter;father;bhogi;ahuti;santoshamఅమావాస్య భోగి రోజు ఇలా చేయడం మంచిదంట..!?అమావాస్య భోగి రోజు ఇలా చేయడం మంచిదంట..!?bhogi;archana;gummadi;indra;jeevitha rajaseskhar;kranthi;kranti;makar sakranti;sankranthi;festival;letter;cow slaughter;father;bhogi;ahuti;santoshamWed, 13 Jan 2021 07:00:00 GMTసంక్రాంతి పండుగ ఒక్కటి. ఈ పండగను మూడు రోజులు జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. ఈ పండుగ. తెలుగు లోగిళ్లలో కళా కాంతులు, సంతోషాలు నింపే పండుగను నాలుగు రోజులు జరుపుకోవడం మన ఆనవాయితీ. ఇక మొదటి రోజు భోగి. భోగి రోజు తెల్లవారుఝామునే భోగిమంటలు వేస్తారు.

ఇక ధుర్మాసం అంతా ఆడపిల్లలు తయారు చేసిన  గొబ్బిపిడకలను , రావి,మామిడి, మేడి చెట్ల పుల్లలు,  తాటాకులు మొదలైనవి  భోగి మంటల్లో వేయడం తో పాటు  ఇంట్లో ఉండే పాత వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేస్తుంటారు. దీని అర్ధం ఏమిటి అంటే మనలో  ఉన్న పనికిరాని చెత్త ఆలోచనలు తీసిపడేసి,కొత్త ఆలోచనల్లతో  మంచి మార్గంలో జీవితం లో ఎదగాలని  దీని అర్ధం. ఈ మంటలను వేస్తున్నప్పుడు,కొన్ని ప్రాంతాల్లో స్వర్గాధిపతి ఇంద్రుని గౌరవార్ధం డప్పులను వాయించే ఆచారము ఉంటుంది.

అయితే మంటలు వేసిన తర్వాత, తలంటి స్నానం చేయాలి. ఆ తరువాత ఇళ్ల ముందు ఆవును పేడతో కళ్ళాపు చల్లి, రంగురంగుల ముగ్గులు వేసి , గొబ్బెమ్మలు చేసి ముగ్గుల్లో పెట్టి, వాటికి పసుపు కుంకుమలను గుమ్మడి పువ్వుల ను అలంకరిస్తారు. దాని తర్వాత .. గొబ్బిళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ కన్నెపిల్లలు ‘గొబ్బియల్లో… అంటూ పాటలు పాడి  తరువాత హారతులుఇచ్చిన తర్వాత ఇంద్రుడి తో పాటు ఇష్ట దేవతలను పూజించాలి. పిల్లలకు బోగి రోజు సాయంత్రం భోగిపళ్లు తలపై పోయడం ద్వారా వారు మంచి జ్ఞానవంతులు అవుతారని అంటారు.

ఇక ఈ సారి భోగి పండుగ అమావాస్య రోజు రావడంతో పలుసందేహాలు కలుగుతున్నాయి. కానీ ఈ అమావాస్య భోగి రోజు  ఈశ్వర అర్చన, రుద్రాభిషేకం, పితృ, తిలా దానం తిలా తర్పణాలు, స్వయంపాక దానాలు, వస్త్రదానాలు చేయడం వలన విశేషమైన ఫలితం వస్తుంది. భోగి రోజు దానాలు చేసేవారు భోగాలు అనుభవిస్తారు. ఇది ఒక పెద్ద విశేషం. ఇప్పుడు భోగి తో అమావాస్య రావడంవలన దానం చేసినదానికి వేయి రేట్లు ఫలితం వస్తుంది. కాబట్టి అమావాస్య రోజు వచ్చిన భోగి అని బెంగ పెట్టుకోకుండా రెట్టించిన సంతోషంతో సద్వినియోగం చేసుకోండి.


మతబోధకుడికి వెయ్యేళ్ల జైలు శిక్ష!టర్కీ కోర్టు సంచలన తీర్పు

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?

చంద్రబాబుకు క్రిస్టియన్లు షాక్ ఇచ్చారా.. అసలు వాస్తవం ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>