TVsavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/suma-kanakala56ea09bd-f505-4e3d-973d-07a0c71278b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/suma-kanakala56ea09bd-f505-4e3d-973d-07a0c71278b1-415x250-IndiaHerald.jpgసుమ కనకాల గురించి తెలియని వారెవ్వరూ ఉండరేమో.. గలగలా తెలుగులో మాట్లాడుతూ.. అందరినీ ఆకట్టుకుంటుంది సుమ కనకాల. మదర్ లాంగ్వేజీ తెలుగు కాకపోయినా అచ్చతెలుగును పొల్లు పోకుండా మాట్లాడగలదు. అందుకే ఈమెను ఎన్నో షో లకు వ్యాఖ్యాతగా తీసుకుంటారు. బుల్లితెరపై ఎంతో మంది వ్యాఖ్యాతగా వస్తున్నా సుమ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. కాగా అంతకంతకూ తన ప్రాముఖ్యతను చాటుకుంటూ వెళుతోంది. ఈమెకు బుల్లితెరపై పోటీ ఎవరూ లేరు. ఈమె టాలెంట్ కు నాకు ఎవరూ సాటి లేరు అనిపించేలా యాంకరింగ్ చేసుకుంటూ బుల్లితెరను ఏలేస్తోంది. చాలా సినిమాల్లో suma kanakala;women;suma;suma kanakala;telugu;womanఏంటి సుమ నువ్వేనా ఇలా చేసింది ?ఏంటి సుమ నువ్వేనా ఇలా చేసింది ?suma kanakala;women;suma;suma kanakala;telugu;womanWed, 13 Jan 2021 02:00:00 GMTసుమ కనకాల గురించి తెలియని వారెవ్వరూ ఉండరేమో.. గలగలా తెలుగులో మాట్లాడుతూ.. అందరినీ ఆకట్టుకుంటుంది సుమ కనకాల. మదర్ లాంగ్వేజీ తెలుగు కాకపోయినా అచ్చతెలుగును పొల్లు పోకుండా మాట్లాడగలదు. అందుకే ఈమెను ఎన్నో షో లకు వ్యాఖ్యాతగా తీసుకుంటారు. బుల్లితెరపై ఎంతో మంది వ్యాఖ్యాతగా వస్తున్నా సుమ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. కాగా అంతకంతకూ తన ప్రాముఖ్యతను చాటుకుంటూ వెళుతోంది. ఈమెకు బుల్లితెరపై పోటీ ఎవరూ లేరు. ఈమె టాలెంట్ కు నాకు ఎవరూ సాటి లేరు అనిపించేలా యాంకరింగ్ చేసుకుంటూ బుల్లితెరను ఏలేస్తోంది. చాలా సినిమాల్లో సుమ నటించినా ఆవేవీ ఈమెకు అంత పేరు తీసుకురాలేదు. కాని ఎప్పుడైతే యాంకరింగ్ మొదలు పెట్టిందో అప్పటినుంచే సుమ అసలైన టాలెంట్ అందరికీ తెలిసిపోయింది.
ఎక్కడా తడబడకుండా పంచులు వేస్తూ.. నవ్వులు పూయిస్తూ.. గలగలా గోదారిలా మాట్లాడుతూ.. తన వాక్ చాతుర్యంతో ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకుంటూ వెళుతోంది. ఎంతో మంది యాంకర్లకు ఈమె ఒక ఆదర్శం. అందుకే సుమ అంటే గౌరవం ప్రేక్షకులకు. అందులోనూ ఈ టీవీలో వచ్చిన స్టార్ మహిళ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆడవారిని షోకు పరిచయం చేసి ఎంతగానో అలరించింది. తన మాటల ప్రవాహంతో ఈ షోను ఎంతో పాపులర్ చేసింది సుమ. అందుకే స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తిచేసినందుకు గానూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కేసింది. ఆ ఒక్క ప్రోగ్రాంతో తన వాక్ చాతుర్యాన్ని చాటుకున్నసుమ కనకాల ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా నటించే అవకాశాలను అందిపుచ్చుకుంది.

పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు కూడా యాంకరింగ్ చేసింది. ప్రస్తుతం సుమ ఎన్నో షో లకు యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటోంది. ఎంత పెద్ద షో అయినా జరగని అదరకుండా బెదరకుండా అలవోకగా తన మాటలను రంజింప చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది సుమ. ఆగని మాటల ప్రవాహంతో ప్రేక్షకులను మైమరిపిస్తుంటుంది. ఈ సంగతి పక్కన్నపెడితే సుమ కనకాల లాక్ డౌన్ సమయం నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా పాల్గొంటూ వస్తోంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా సుమ డ్యాన్స్ వేస్తూ ఉన్న ఫోటోస్ ను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. దాంతో సోషల్ మీడియాలో సుమ డ్యాన్స్ చేసే ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు సుమ మాటలతో పాటుగా అందంగా డ్యాన్స్ కూడా చేయగలదా అంటూ పొగుడుతున్నారు. 


అక్కడ ఛాన్స్ కోల్పోతున్న పవన్...ఫోకస్ పెట్టాల్సిందేనా...

బాత్రూంలో జారిపడిన హీరోయిన్.. ఆ వెంటనే సాంగ్ షూట్‌ ఉండటంతో..

హనీమూన్ ఎప్పుడో చెప్పేసిన సింగర్ సునీత.. ప్లాన్ ఏంటంటే..

బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనితో ప్రేమలో ఉందా?

వాట్సాప్ వీడుతున్నారా? అయితే ఈ పని చేయండి.. లేదంటే డేంజరే

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>