MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpgక్రాక్ సినిమా లో ఐదుగురు దర్శకులా ? ఇదెక్కడి ట్విస్టు అనుకుంటున్నారా. అయితే ఈ కథనం మొత్తం చదవండి మీకే అర్థమవుతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ మూవీ క్రాక్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9వ తారీఖున థియేటర్లో రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న రవితేజకు ఈ సినిమా భారీ ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు. సినిమా బాగుండడంతో జనాల్లోకి పాజిటివ్ టాక్ బాగా వెళ్ళింది. అందుకే రోజురోజుకీ వసూళ్లు పెరుగుతూ పోతున్నాయి. అయితే ఈ సిprabhas;mahesh;ravi;gopichand;kranthi;kranti;ravi anchor;ravi teja;vivek;makar sakranti;cinema;telugu;sankranthi;january;tamil;director;traffic police;jawaan;kathi mahesh;samuthirakani;pinnamaneni babji;wanted;mass;krack;katthiక్రాక్ సినిమాలో ఐదుగురు డైరెక్టర్స్.. మీరు గమనించారా ?క్రాక్ సినిమాలో ఐదుగురు డైరెక్టర్స్.. మీరు గమనించారా ?prabhas;mahesh;ravi;gopichand;kranthi;kranti;ravi anchor;ravi teja;vivek;makar sakranti;cinema;telugu;sankranthi;january;tamil;director;traffic police;jawaan;kathi mahesh;samuthirakani;pinnamaneni babji;wanted;mass;krack;katthiWed, 13 Jan 2021 15:00:00 GMTక్రాక్ సినిమా లో ఐదుగురు దర్శకులా ? ఇదెక్కడి ట్విస్టు అనుకుంటున్నారా. అయితే ఈ కథనం మొత్తం చదవండి మీకే అర్థమవుతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ మూవీ క్రాక్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9వ తారీఖున థియేటర్లో రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న రవితేజకు ఈ సినిమా భారీ ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు. సినిమా బాగుండడంతో జనాల్లోకి పాజిటివ్ టాక్ బాగా వెళ్ళింది. అందుకే రోజురోజుకీ వసూళ్లు పెరుగుతూ పోతున్నాయి. అయితే ఈ సినిమాలో ఐదుగురు దర్శకులు నటించారు. 

కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే. వాళ్ళు ఎవరెవరు అంటే సముద్రఖని, మచ్చ రవి (బీవీఎస్), కత్తి మహేష్, వివేక్, అలానే దేవీప్రసాద్. ముందుగా సముద్రఖని విషయానికి వస్తే ఈయన ఒక తమిళ పాపులర్ డైరెక్టర్. కొన్నాళ్ల క్రితం నటుడిగా మారిన ఈయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన విలన్ పాత్ర పోషించాడు. ఇక మచ్చ రవి విషయానికి వస్తే తెలుగులో వాంటెడ్ అలాగే జవాన్ అనే సినిమాలు చేసిన ఈయన చాలా సినిమాలకు కథ అందించాడు.

 కొన్ని చిన్న చిన్న సినిమాల్లో నటించాడు కూడా. ఈయన కూడా క్రాక్ సినిమాలో జోగి బ్రదర్స్ ని గుర్తుకు తెచ్చే లాంటి పాత్రలో నటించాడు. ఇక పెసరట్టు ,ఎగిసే తారాజువ్వలు లాంటి సినిమాలను తెరకెక్కించిన సినీ విమర్శకుడు, దర్శకుడు కత్తి మహేష్ కూడా ఈ సినిమాలో ఒక కుల సంఘం నాయకుడుగా నటించాడు. ఇక బ్లేడ్ బాబ్జీ లాంటి అనేక హిట్ సినిమాలను అందించిన దర్శకుడు దేవీప్రసాద్ కూడా ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఈ సినిమాలో కూడా ఆయన పోలీస్ పాత్ర లో నటించాడు. ఇక బెజవాడ ఇలాంటి వివాదాస్పద సినిమాని తెరకెక్కించిన మరో దర్శకుడు వివేక్  కూడా ఒక రౌడీ పోలీస్ పాత్రలో నటించాడు. అలా మొత్తం ఐదుగురు దర్శకులు ఈ సినిమాలో నటించారు.




బ్రేకింగ్: బండి సంజయ్ రథయాత్ర...?

ఒక గంటలో ప్రేమించిన హీరోతో పెళ్లి...కానీ కొన ప్రాణాలతో ఆసుపత్రిలో హీరోయిన్ మాలాశ్రీ..ఆ రోజు ఏం జరిగింది

మేనల్లుడితో పవర్ స్టార్ సినిమా నిజమేనా?

నాలుగు నెలలు ఏపీలోనే పవన్...?

నటి శుభశ్రీ ఇప్పుడు ఎక్కడ ఉంది..ఈమె అక్క ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

పోలీసులను టార్గెట్ చేసిన బండి... హోం మంత్రికి ఫిర్యాదు...?

ఉగాది నుంచి జగన్ రచ్చబండ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>