PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో కాస్త స్పీడ్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ పీ.అశోక్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తొలుత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, కరోనా వ్యాప్తి దృష్ట్యా రద్దు చేసినప్పుడు కరోనా సాధారణ జ్వరం లాంటిదే అన్న ముఖ్యమంత్రి, నేడు సామాన్యులను చంపడానికే ఎన్నికలు పెడుతున్నారని చెప్పడం ఆయనలోని బుద్ధిహీనతకు సంకేతం అని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషనర్ ప్రతిపక్ష నేతకు కోవర్టు అంటున్న వ్యక్తి, తనపై ఉన్న కేసులకు భయపడి, ప్రత్యేక హోదాను, రైల్వేజోన్ ను, రాష్ట్ర ప్రయోజనాలcourt, jagan, ap;ashok;hari;hari music;kerala;delhi;telugu desam party;jagan;andhra pradesh;high court;telugu;government;panchayati;court;chief minister;tdp;supreme court;ammavodi;nijam;v;yevaru;party;mantraసుప్రీం కోర్ట్ లో జగన్ కి షాక్ తగులుతుందా...?సుప్రీం కోర్ట్ లో జగన్ కి షాక్ తగులుతుందా...?court, jagan, ap;ashok;hari;hari music;kerala;delhi;telugu desam party;jagan;andhra pradesh;high court;telugu;government;panchayati;court;chief minister;tdp;supreme court;ammavodi;nijam;v;yevaru;party;mantraWed, 13 Jan 2021 17:00:00 GMTతెలుగుదేశం పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో కాస్త స్పీడ్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ పీ.అశోక్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తొలుత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి,  కరోనా వ్యాప్తి దృష్ట్యా రద్దు చేసినప్పుడు  కరోనా సాధారణ జ్వరం లాంటిదే అన్న ముఖ్యమంత్రి, నేడు సామాన్యులను చంపడానికే ఎన్నికలు పెడుతున్నారని చెప్పడం ఆయనలోని బుద్ధిహీనతకు సంకేతం అని ఆయన విమర్శించారు. ఎన్నికల కమిషనర్ ప్రతిపక్ష నేతకు కోవర్టు అంటున్న వ్యక్తి, తనపై ఉన్న కేసులకు భయపడి, ప్రత్యేక హోదాను, రైల్వేజోన్ ను,  రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకొని వారికి కోవర్టుగా మారలేదా?  అని ప్రశ్నించారు.

పల్లెల్లో అధికంగా ఉండే రైతులకు అన్యాయం చేయబట్టే, పాలకులు పంచాయతీ ఎన్నికలకు భయపడుతున్నారు అని మండిపడ్డారు. రైతులతో పాటు రైతు కూలీలు, చేతి వృత్తుల వారు ఉపాధి కోల్పోయి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని పాలకులకు అర్థమైంది అని అన్నారు. నిజంగా ప్రభుత్వం ఎన్నికలకు భయపడకపోతే, వ్యాక్సిన్ పంపిణీ, కరోనా అంటూ సాకులు చెప్పదు అని వ్యాఖ్యానించారు. దుర్యోధనుడి మాట విని చీర లాగిన దుశ్శాసనుడి మాదిరే, ముఖ్యమంత్రి మాటలు వింటూ, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఏదిపడితే అది మాట్లాడుతున్నారు అని విమర్శించారు.

ఎన్నికల కమిషనర్ గా ఎవరున్నా, అమ్మఒడి, ఇళ్లపట్టాలతో పాటు, మద్యం ఉచితంగా పంచినా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పాలకులు చల్లార్చలేరు అని అన్నారు. ప్రభుత్వానికి ఎన్నికలంటే భయం లేకుంటే, కోర్టులో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకొని, తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనని హైకోర్టుకి చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు.     సుప్రీం కోర్టులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేంగానే తీర్పు వస్తుందని మేం భావిస్తున్నాం అని అన్నారు. రాజస్తాన్, కేరళ ప్రభుత్వాల మాదిరే ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీం ఆదేశాలతో విధిగా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అని ఆయన డిమాండ్ చేసారు.


షాకింగ్: టీడీపీలోకి కాంగ్రెస్ నేతలు

వామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?

ఆ చిత్రం ఏఎన్నార్ దశనే మార్చేసిందట!

కేటిఆర్ ఎందుకు దిగారు...?

సింగర్ సునీత వివాహంపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసిన నాగబాబు

చంద్రబాబుని తీవ్రంగా విమర్శించిన.... ఫైర్ బ్రాండ్...!?

పిల్లలకు దేవుడుగా మారిన సోనూ సూద్.. ఈసారి ఏకంగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>