MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya-would-be-surprised-to-know-the-set-story800f192d-f622-43d0-beb2-1674f405e55f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya-would-be-surprised-to-know-the-set-story800f192d-f622-43d0-beb2-1674f405e55f-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమాలు ఇప్పుడు ఆర్ట్‌ డైరెక్టర్స్‌ చుట్టూ తిరుగుతున్నాయి. పెద్ద సినిమాల నుంచి మొదలుపెడితే, చిన్న సినిమాల వరకు అన్నింటిలో సెట్స్‌ మెయిన్‌ రోల్‌ ప్లే చేస్తున్నాయి. నిర్మాతలైతే సెట్స్‌ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారు. మరి కోట్ల రూపాయలతో నిర్మాణమవుతోన్న ఆ సెట్స్‌ కహానీ తెలిస్తే ఆశ్చర్యపోతారు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేస్తోన్న 'ఆచార్య' సినిమాపై భారీ బజ్‌ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న ఈ సినిమా ఏ లెవల్‌లో ఉంటుందో చూడాలని ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీళ్ల అంచనాలకు తacharya would be surprised to know the set story;chiranjeevi;mahesh;nani;ram charan teja;shiva;gunasekhar;koratala siva;madhura sridhar reddy;ram pothineni;tiru;cinema;bank;industry;director;lord siva;shamshabad;rudramadevi;calcuttaఆచార్య సెట్ కహానీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!ఆచార్య సెట్ కహానీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!acharya would be surprised to know the set story;chiranjeevi;mahesh;nani;ram charan teja;shiva;gunasekhar;koratala siva;madhura sridhar reddy;ram pothineni;tiru;cinema;bank;industry;director;lord siva;shamshabad;rudramadevi;calcuttaWed, 13 Jan 2021 20:00:00 GMT
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేస్తోన్న 'ఆచార్య' సినిమాపై భారీ బజ్‌ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న ఈ సినిమా ఏ లెవల్‌లో ఉంటుందో చూడాలని ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీళ్ల అంచనాలకు తగ్గట్లుగానే 'ఆచార్య' సినిమాని లార్జ్‌ స్కేల్‌లో డిజైన్ చేస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమా కోసం 20 ఎకరాల్లో వేసిన టెంపుల్‌ టౌన్‌ సిటీ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.

మహేశ్ బాబు బ్యాంక్ ‌స్కామ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేస్తోన్న సినిమా 'సర్కారు వారి పాట'. ఫస్ట్‌ లుక్‌తోనే మంచి బజ్‌ క్రియేట్‌ చేసుకుందీ సినిమా. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌తోనే అభిమానులకి మంచి కిక్‌ ఇచ్చిన ఈ మూవీలో భారీ సెట్స్ ఉంటాయని చెబుతున్నారు. సినిమా బ్యాక్‌డ్రాప్‌కి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్.ప్రకాశ్ భారీ బ్యాంక్‌ సెట్‌ బిల్డ్‌ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో వస్తోన్న సినిమా 'శ్యామ్‌ సింగా రాయ్'. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీ పశ్చిమబెంగాల్, కలకత్తా నేపథ్యంలో తెరకెక్కబోతోంది. ఇక కలకత్తా కాళీ మందిర్‌ సెట్‌ కోసం 6 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. శంషాబాద్ దగ్గరలో 15 ఎకరాల్లో కాళీ మందిర్‌ సెట్‌ కట్టారని చెబుతున్నారు.

మాస్టర్‌ ఆఫ్‌ సెట్స్‌గా స్పెషల్‌ ఇమేజ్‌ ఉన్న దర్శకుడు గుణశేఖర్. 'ఒక్కడు'లో చార్మినార్ సెట్, 'అర్జున్‌'లో మధుర మీనాక్షిటెంపుల్, 'రుద్రమదేవి'లో సెట్స్‌తో కాకతీయ కళాతోరణాలని చూపించిన గుణశేఖర్, ఇప్పుడు 'శాకుంతలం' సినిమాలోనూ భారీ సెట్స్‌ కట్టిస్తున్నాడని చెప్తున్నారు. దుష్యంతుడు, శకుంతల ప్రణయగాధ ఆధారంగా వస్తోన్న ఈ సినిమాలో నాటి వాతావరణాన్ని సృష్టించడానికి భారీగా సెట్స్‌ డిజైన్ చేయిస్తున్నాడట దర్శకుడు.






ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఫేక్ కేసులో ఎక్కువట!

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం

ఫ్యామిలీ మ్యాన్-2లో సమంత ఎలా ఉందో చూశారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>