SportsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sehwaag6f618ad1-2c87-4c40-8ca9-248c0054c87b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sehwaag6f618ad1-2c87-4c40-8ca9-248c0054c87b-415x250-IndiaHerald.jpg ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో గాయాల పాలైన టీం ఇండియా ఆట‌గాళ్లు ఒక్కోరుగా జ‌ట్టుకు దూర‌మ‌వుతున్నారు. ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డుతుండ‌టం భారత జట్టు మెనేజ్ మెంట్ ను కలవర పెడుతోంది. టూర్‌కు మొత్తంగా దూర‌మైన వాళ్లు, మ‌ధ్య‌లో గాయ‌ప‌డి వెళ్లిపోయిన వారి సంఖ్య దాదాపు ఎనిమిదికి చేరింది. మూడో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ కోలుకున్నాడు. తాజాగా జ‌స్‌ప్రీత్ బుమ్రా కూడా గాయ‌ప‌డ్డాడు. ఉద‌ర కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అత‌డు నాలుగో టెస్ట్‌కు దూర‌మ‌య్యాడు. హనుమ విహారి కూడా తొడ కండరాల్లు పట్టsehwaag;kumaar;rahul new;rahul;rohit;k l rahul;ravindra jadeja;rohit sharma;india;australia;naga aswin;kanna lakshminarayana;bcci;2020;rishabh pant;rahul sipligunj;kollu ravindra;mohammed shamiఆశ్చ‌ర్యం.. నాలుగో టెస్టులో ఆడేందుకు భార‌త జ‌ట్టులోకి వీరూ...ఆశ్చ‌ర్యం.. నాలుగో టెస్టులో ఆడేందుకు భార‌త జ‌ట్టులోకి వీరూ...sehwaag;kumaar;rahul new;rahul;rohit;k l rahul;ravindra jadeja;rohit sharma;india;australia;naga aswin;kanna lakshminarayana;bcci;2020;rishabh pant;rahul sipligunj;kollu ravindra;mohammed shamiWed, 13 Jan 2021 09:33:07 GMTఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో గాయాల పాలైన టీం ఇండియా ఆట‌గాళ్లు ఒక్కోరుగా జ‌ట్టుకు దూర‌మ‌వుతున్నారు. ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డుతుండ‌టం భారత జట్టు మెనేజ్ మెంట్ ను కలవర పెడుతోంది. టూర్‌కు మొత్తంగా దూర‌మైన వాళ్లు, మ‌ధ్య‌లో గాయ‌ప‌డి వెళ్లిపోయిన వారి సంఖ్య దాదాపు ఎనిమిదికి చేరింది. మూడో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ కోలుకున్నాడు. తాజాగా జ‌స్‌ప్రీత్ బుమ్రా కూడా గాయ‌ప‌డ్డాడు. ఉద‌ర కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అత‌డు నాలుగో టెస్ట్‌కు దూర‌మ‌య్యాడు. హనుమ విహారి కూడా తొడ కండరాల్లు పట్టేయడంతో నాలుగో మ్యాచ్ కు డౌటే.


ఐపీఎల్ 2020 నుంచి ఆస్ట్రేలియా పర్యటనవరకు ఎన్నడూ లేనివిధంగా భారత ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇటీవలే కోలుకొని జట్టులోకి వచ్చాడనుకుంటే.. మరోవైపు గాయాలతో స్టార్ ఆటగాళ్లంతా ఒక్కక్కరుగా దూరమవుతున్నారు. భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జ‌స్‌ప్రీత్ బుమ్రా గాయాలతో ఆటకు దూరమయ్యారు. రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ సైతం గాయపడినా నెట్టుకొస్తున్నారు. దీంతో జట్టులో గాయపడ్డవారి జాబితా చెప్పడం కన్నా.. గాయపడని జాబితా చెప్పడమే చాలా సులువుగా ఉంది.


ఇదిలా ఉండ‌గా టీం ఇండియా ఆట‌గాళ్లు వ‌రుస‌గా గాయాల‌పాల‌వ‌డం, జ‌ట్టులో ఆటగాళ్ల లోటును పూడ్చ‌డానికి మేనేజ్‌మెంట్ ప‌డుతున్న తంటాల‌పై మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ స‌ర‌దాగా స్పందించారు. తదుపరి బ్రిస్బేన్లో జ‌ర‌గ‌నున్న నాలుగోల‌ టెస్టుకు 11 మంది ఆట‌గాళ్లు ఫిట్‌గా లేకపోతే.. ఆస్ట్రేలియాకు  వెళ్లి ఆడడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించాడు. 'ఇంతమంది ఆటగాళ్లు గాయపడ్డారు. బ్రిస్బేన్ టెస్టుకు 11 మంది ఫిట్‌గా లేకపోతే.. ఆస్ట్రేలియాకు వెళ్లి ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బీసీసీఐ.. క్వారంటైన్ చూసుకో' అని సెహ్వాగ్ చమత్కరించాడు. సెహ్వాగ్ త‌న మాట‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు భార‌త జ‌ట్టు ఆటగాళ్ల‌లో స్ఫూర్తినింపుతుంటాడు. అప్పుడ‌ప్పుడు ఇలా చ‌మ‌త్కారాల‌తో న‌వ్వులు పూయిస్తుంటాడు కూడా.


వంశీ దెబ్బకు బచ్చుల సైలెంట్...టీడీపీకి దిక్కు ఎవరు ?

ఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?

ఆ ఇద్ద‌రు వైసీపీ నానీలకు పవన్ దెబ్బ త‌ప్ప‌దా ? చెక్ పడేది ఎవరికో ?

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>