MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-akkineni46e30757-4543-462b-8943-f50f2739e12b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-akkineni46e30757-4543-462b-8943-f50f2739e12b-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను "బొమ్మరిల్లు" ఫేమ్ భాస్కర్ డైరెక్ట్ చేశాడు. భాస్కర్ మూవీస్ అనేవి ఫీల్ గుడ్ మూవీస్ గా పేరొందుతాయి అన్న విషయం తెలిసిందే. గతంలో, భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులకు మంచి ఫీల్ ను కలిగించాయి. akhil akkineni;murli sharma;pooja hegde;akhil akkineni;bhaskar;gopi sundar;kranthi;kranti;nageshwara rao akkineni;pragathi;surender reddy;makar sakranti;cinema;baba bhaskar;sankranthi;film industry;industry;heroine;reddy;aamaniసంక్రాంతిలో రిస్క్ ఎందుకని సమ్మర్ కు ఫిక్సయిన అఖిల్సంక్రాంతిలో రిస్క్ ఎందుకని సమ్మర్ కు ఫిక్సయిన అఖిల్akhil akkineni;murli sharma;pooja hegde;akhil akkineni;bhaskar;gopi sundar;kranthi;kranti;nageshwara rao akkineni;pragathi;surender reddy;makar sakranti;cinema;baba bhaskar;sankranthi;film industry;industry;heroine;reddy;aamaniWed, 13 Jan 2021 09:00:00 GMTఅక్కినేని అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను "బొమ్మరిల్లు" ఫేమ్ భాస్కర్ డైరెక్ట్ చేశాడు.

భాస్కర్ మూవీస్ అనేవి ఫీల్ గుడ్ మూవీస్ గా పేరొందుతాయి అన్న విషయం తెలిసిందే. గతంలో, భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులకు మంచి ఫీల్ ను కలిగించాయి.

ఇక, ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, మొదట్లో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ, ఆ తరువాత మేకర్స్ తమ డెసిషన్ ను మార్చుకున్నారు. ఈ విషయంలో, అఖిల్ అభిమానులు అప్సెట్ అయ్యారు.

సినిమా సంక్రాంతి రేస్ నుండి తప్పుకుని సమ్మర్ రేస్ కు సిద్ధమైంది. సమ్మర్ లో ఆడియెన్స్ ను అలరించేందుకు ముందుకు వస్తానంటున్నాడు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్"

ఈ సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ పై కూడా దృష్టిపెట్టారట. ఈ సినిమాలో అఖిల్ సందడి మాములుగా ఉండదని ఫిలిం ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాకి సంబంధించి ఇంకో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ షెడ్యూల్ ను పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

ఇందులో, మురళీ శర్మ, ఆమని, ప్రగతి, జయప్రకాశ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే, అఖిల్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన డెసిషన్ ను కూడా ఆల్రెడీ తీసేసుకున్నాడు. సురేందర్ రెడ్డితో కలిసి వర్క్ చేయబోతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పై సురేందర్ రెడ్డి వర్క్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ కి సంబంధించి ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమవడానికి కొంచెం సమయం పడుతుందట.

ఇదిలా ఉంటే, సురేందర్ రెడ్డి హీరోలు స్టైలిష్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ తనదైన స్టైల్ తో ఆకట్టుకునే అఖిల్ ను సురేందర్ మరింత స్టైలిష్ గా చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన విశేషాలు కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. 


స్నేహితులను ఇలాంటి విషయాల్లో అస్సలు నమ్మకండి..నమ్మితే ఇదే జరుగుతుంది..

ఆ ఇద్ద‌రు వైసీపీ నానీలకు పవన్ దెబ్బ త‌ప్ప‌దా ? చెక్ పడేది ఎవరికో ?

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>