MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/this-is-the-list-of-movies-coming-in-the-summer233c7f95-f3a3-4cc8-abd1-744596a1f0bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/this-is-the-list-of-movies-coming-in-the-summer233c7f95-f3a3-4cc8-abd1-744596a1f0bf-415x250-IndiaHerald.jpg9 నెలల విరామం తర్వాత థియేటర్స్‌ ఓపెన్ అయ్యాయి. సోలోబతుకే సో బెటర్‌తో క్రిస్మస్‌ సీజన్‌ మొదలైంది. ఇక సమ్మర్‌ సీజన్‌లో సినిమాలు థియేటర్స్‌పై మూకుమ్మడిగా దాడి చేయనున్నాయి. సమ్మర్‌ సీజన్‌ నితిన్‌ రంగ్‌దేతో మొదలయ్యేలా కనిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్‌దే మార్చి 26న రిలీజ్‌ చేస్తున్నారు. సమ్మర్‌ సీజన్‌ మార్చి 26తో మొదలైతే.. రంగ్‌దే రిలీజ్‌ అయ్యే ఈ డేట్‌కే.. రానా అరణ్య వస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ పాన్‌ ఇండియా మూవీ మార్చి 26కు వెళ్లిపోయింది. ఇక ఏప్రిల్‌ రావడం ఆలస్యం... పెthis is the list of movies coming in the summer;venkatesh;nani;rana;balakrishna;shiva;boyapati srinu;siva nirvana;india;cinema;january;tamil;producer;lord siva;producer1;april;shiva nirvana;march;venky atluri;narappaసమ్మర్ లో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..!సమ్మర్ లో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..!this is the list of movies coming in the summer;venkatesh;nani;rana;balakrishna;shiva;boyapati srinu;siva nirvana;india;cinema;january;tamil;producer;lord siva;producer1;april;shiva nirvana;march;venky atluri;narappaWed, 13 Jan 2021 17:34:21 GMTవెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్‌దే మార్చి 26న రిలీజ్‌ చేస్తున్నారు.

సమ్మర్‌ సీజన్‌ మార్చి 26తో మొదలైతే.. రంగ్‌దే రిలీజ్‌ అయ్యే ఈ డేట్‌కే.. రానా అరణ్య వస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ పాన్‌ ఇండియా మూవీ మార్చి 26కు వెళ్లిపోయింది. ఇక ఏప్రిల్‌ రావడం ఆలస్యం... పెద్ద సినిమాలు క్యూ కడతాయి. ముందుగా నాని ఏప్రిల్‌ బెర్త్‌ను కన్ఫార్మ్‌ చేసేసుకున్నాడు. నిన్నుకోరి తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న 'టక్‌ జగదీశ్‌'ను ఏప్రిల్‌16న రిలీజ్‌ చేస్తున్నట్టు నిర్మాత ఎనౌన్స్‌ చేశారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసేసి.. సమ్మర్‌ డేట్‌ను లాక్‌ చేసేశారు.

ఆల్ రెడీ షూటింగ్‌ పూర్తిచేసుకున్న అఖిల్‌ 'మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచులర్' రీషూట్ష్‌ కారణంగా రిలీజ్‌ వాయిదాపడింది. లేదంటే.. సంక్రాంతికి వచ్చేసేది. జనవరి 26న రంగ్‌దే.. అరణ్య ఉండడంతో.. మార్చి.. ఏప్రిల్ లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌కు రిలీజ్‌ డేట్‌ దొరకనుంది.

సినిమా ఇండస్ట్రీని భయపెడుతున్న ప్రాబ్లమ్‌ ఆక్యుపెన్సీ. కోవిడ్‌ నిబంధనల ప్రకారం 50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ ఓపెన్‌ చేశారు.  భారీ బడ్జెట్‌ మూవీస్‌ను సగం ఆక్యుపెన్సీతో రిలీజ్‌ చేస్తే నష్టాలు తప్పవంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్‌. దీంతో.. షూటింగ్‌ పూర్తి చేసుకుని రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి.

పవన్‌ నటించిన వకీల్‌సాబ్‌ బిజినెస్‌ దాదాపు 100 కోట్లు ఉంటుంది. ఈ భారీ మొత్తం రాబట్టాలంటే.. 100 పర్సెంట్  ఆక్యుపెన్సీ ఉండాల్సిందే. సమ్మర్‌ నాటికి  50 పర్సెంట్ ఆక్యుపెన్సీ రూల్‌ ఎత్తేస్తారట. అందుకే.. వకీల్‌సాబ్‌ను మార్చిలోగానీ..  ఏప్రిల్ లో గానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత.

ప్రభాస్‌  రాధే శ్యామ్‌ షూటింగ్  చివరి దశకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్‌లోనే బొమ్మ పడుతుంది. మరో క్రేజీ మూవీ ఆచార్య షూటింగ్‌ అనుకున్న సమయంలో పూర్తయితే.. సమ్మర్‌ రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తారు.

పెద్దహీరోలందరికీ సమ్మరే  దిక్కయింది. బాలకృష్ణ, బోయపాటి సినిమా కూడా సమ్మర్‌నే నమ్ముకుంది. షూటింగ్‌  స్టార్ట్‌ చేశారో లేదో.. నాన్‌స్టాప్‌గా తీసేస్తున్నారు. బాలయ్య కెరీర్‌లో హై బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇక నారప్ప షూటింగ్‌ చివరి దశకు చేరింది. తమిళ హిట్‌ అసరున్‌కు రీమేక్‌గా రూపొందిన నారప్ప కూడా సమ్మర్‌ స్లాట్‌నే బుక్‌ చేసుకోవాల్సి ఉంది.

సమ్మర్‌లో వచ్చే సినిమాల లిస్ట్‌ చాలా పెద్దదే. గోపీచంద్‌ సీటీమార్‌.. శర్వానంద్ శ్రీకారం షూటింగ్ చివరి దశకు చేరాయి. సందీప్‌ కిషన్‌ నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామ్‌ 'ఎ1 ఎక్స్‌ప్రెస్‌' షూటింగ్‌ పూర్తిచేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. శనివారం  8ప్యాక్‌తో ఉన్న సందీప్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇలా.. చాలా సినిమాలు సమ్మర్‌ కోసం... వెయిటింగ్‌.





పాపం..పోలీసుల నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు.. కానీ వారితో కుల్లబొడిపించుకున్నాడుగా..

గల్లాని బాబు దూరం చేసుకున్నారా...?

సుప్రీం కోర్ట్ లో జగన్ కి షాక్ తగులుతుందా...?

రికార్డు స్థాయిలో తగ్గుతున్న బంగారం ధరలు....!?

వామ్మో... ఆ ఏపీ మంత్రి ఇంత అవినీతి చేసారా...?

ఆ చిత్రం ఏఎన్నార్ దశనే మార్చేసిందట!

కేటిఆర్ ఎందుకు దిగారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>