PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradesh881addb9-0f52-4cc0-81f8-f8bc6cce57a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradesh881addb9-0f52-4cc0-81f8-f8bc6cce57a5-415x250-IndiaHerald.jpgస్నేహం ముసుగులో చాలా మోసాలకు పాల్పడుతున్నారు.. డబ్బులు వస్తాయని అంటే ఇంకా నీచానికి ఒడిగడుతున్నారు.. కరోన వల్ల ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్న జనాలు దారుణాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది. స్నేహితురాలు అని నమ్మిన పాపానికి నట్టెట్లో ముంచింది.. దాంతో ఆ స్నేహతురాలు ప్రాణాలను తీసుకుంది. తనతో పాటు తన కొడుకు భర్త కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పాలకోడేరandhra pradesh;ramu;savitri;godavari river;andhra pradesh;district;west godavari;village;husband;bhimavaram;allu sneha;savithri 1స్నేహితులను ఇలాంటి విషయాల్లో అస్సలు నమ్మకండి..నమ్మితే ఇదే జరుగుతుంది..స్నేహితులను ఇలాంటి విషయాల్లో అస్సలు నమ్మకండి..నమ్మితే ఇదే జరుగుతుంది..andhra pradesh;ramu;savitri;godavari river;andhra pradesh;district;west godavari;village;husband;bhimavaram;allu sneha;savithri 1Wed, 13 Jan 2021 09:09:52 GMTభర్త కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పాలకోడేరు ఎస్సై ఏజీఎస్‌ మూర్తి కథనం ప్రకారం.. భీమవరం మండలం యనమదుర్రుకు చెందిన సీడే పరశురాముడు, ధనసావిత్రి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. సావిత్రి స్నేహితురాలైన అత్తిలికి చెందిన చోడిశెట్టి హైమావతి అధిక వడ్డీ ఇస్తానని.. పది రోజులకోసారి సొమ్ము చెల్లిస్తానని వీరిని నమ్మించింది.దాంతో ఆ దంపతులు స్నేహితులు బంధువుల దగ్గర అప్పు చేసి మరి దాదాపు 25 లక్షలు ఇచ్చారు. అదే వారి ప్రాణానికి పెద్ద గుది బండ లా మారింది.. హాయిగా సాగి పోవాల్సిన జీవితాలను తుంచివేసింది..

హైమావతి వారం కిందట సొమ్ముతో పరారవడంతో ఈ దంపతులు తట్టుకోలేకపోయారు. తమను నమ్మి అప్పు ఇచ్చిన వారు కూడా మోసపోయారంటూ ఆవేదన చెందేవారు. మంగళవారం ఉదయం భీమవరంలో ఆసుపత్రికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ఏడాదిన్నర వయసున్న కుమారుడు నాగవెంకట శ్రీనివాస్‌తో సహా ఇంటి నుంచి బయలుదేరారు. ఊరి చివరికి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ప్రాణాలను విడిచారు.ఎవరి సొమ్మూ మా వద్ద లేదు. చనిపోయాక మమ్మల్ని ఎవరూ తిట్టుకోవద్దు. మాకు రావాల్సిన డబ్బు తీసుకుని బాకీదారులకు చెల్లించండి' అని ఆ దంపతులు విలపిస్తూ మెసేజ్‌ పంపించారు.. ఆ మెసేజ్ అందరినీ కదిలించి వేసింది.. ప్రస్తుతం ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..


ఏపీలో జ‌ల్లిక‌ట్టు సంద‌డి... జోరుగా పందాలు క‌డుతున్నారుగా..

ఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?

ఆ ఇద్ద‌రు వైసీపీ నానీలకు పవన్ దెబ్బ త‌ప్ప‌దా ? చెక్ పడేది ఎవరికో ?

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>