MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-shraddha-kapoorc05cf2ca-b6da-407f-9085-aa4ba944b2d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-shraddha-kapoorc05cf2ca-b6da-407f-9085-aa4ba944b2d0-415x250-IndiaHerald.jpgతారక్ అలాగే ఎన్టీఆర్ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలోని హీరోయిన్ ఎంపిక విషయంలో హీరో అలాగే డైరెక్టర్ మధ్య డిఫరెన్సెస్ తలెత్తాయన్న టాక్ నడుస్తోంది. తారక్ హీరోయిన్ విషయంలో పట్టు వదలట్లేదని ఫిలిం ఇండస్ట్రీ టాక్. ntr and shraddha kapoor;ntr;prabhas;varun dhawan;anirudh ravichander;bharath;jr ntr;rajamouli;srinivas;trivikram srinivas;varun;varun sandesh;varun tej;korea, south;bollywood;sri bharath;rrr movie;cinema;saaho;film industry;industry;director;thriller;hero;heroine;selection process;shradda kapoor;agnyaathavaasi;nandamuri taraka rama rao;shikhar dhawanత్రివిక్రమ్ కు తలనొప్పి తెస్తున్న తారక్...?త్రివిక్రమ్ కు తలనొప్పి తెస్తున్న తారక్...?ntr and shraddha kapoor;ntr;prabhas;varun dhawan;anirudh ravichander;bharath;jr ntr;rajamouli;srinivas;trivikram srinivas;varun;varun sandesh;varun tej;korea, south;bollywood;sri bharath;rrr movie;cinema;saaho;film industry;industry;director;thriller;hero;heroine;selection process;shradda kapoor;agnyaathavaasi;nandamuri taraka rama rao;shikhar dhawanWed, 13 Jan 2021 10:00:00 GMTతారక్ అలాగే ఎన్టీఆర్ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలోని హీరోయిన్ ఎంపిక విషయంలో హీరో అలాగే డైరెక్టర్ మధ్య డిఫరెన్సెస్ తలెత్తాయన్న టాక్ నడుస్తోంది. తారక్ హీరోయిన్ విషయంలో పట్టు వదలట్లేదని ఫిలిం ఇండస్ట్రీ టాక్.

అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ "భరత్ అనే నేను" అనే సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కియారాను ఎంపిక చేద్దామని అనుకున్నాడు. కానీ, ఎన్టీఆర్ మాత్రం ప్రభాస్ తో "సాహో"లో జతకట్టిన శ్రద్ధా కపూర్ నే ఎంపిక చేయాలని పట్టుబట్టాడట. ఐతే, శ్రద్ధా కపూర్ బిజీగా ఉండటంలో ఆమెతో ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ తెప్పించుకోవడం అంత సులభం కాదని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.

ప్రస్తుతం, హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయట. రన్ బీర్ కపూర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది ఈ చిన్నది. ఈ సినిమాపై ఆల్రెడీ బాలీవుడ్ ఎంతో ఎగ్జైటెడ్ గా ఉంది. శ్రద్ధా కపూర్, రణబీర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం ఫ్యాన్స్ కు థ్రిల్ ను కలిగిస్తోంది.  

శ్రద్ధా రణబీర్ తో ఎటువంటి కెమిస్ట్రీ పండిస్తుందో చూడాలని ఆడియెన్స్ తహతహలాడుతున్నారు. వరుణ్ ధావన్, ప్రభాస్ అలాగే ఆదిత్యలతో శ్రద్ధా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందన్న విషయం తెలిసిందే. అలాగే, ఎన్టీఆర్ పక్కన శ్రద్ధా కన్ఫర్మ్ ఐతే కచ్చితంగా వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మొత్తమ్మీద, బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సౌత్ ఇండస్ట్రీ మూవీ మేకర్స్ దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది చెప్పుకోవాలి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "సాహో" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ముద్దుగుమ్మతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.

కాబట్టి, ఈ విషయం త్రివిక్రమ్ కు తలనొప్పిగా మారిందట. హీరోయిన్ విషయంలో ఒక డెసిషన్ కి త్వరగా వచ్చేస్తే ఈ సినిమాకు సంబంధించిన మిగతా పనులలో దృష్టిపెట్టవచ్చని త్రివిక్రమ్ ఆలోచన.

ఇదిలా ఉంటే, తారక్ అలాగే త్రివిక్రమ్ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిరుధ్ ఆల్రెడీ త్రివిక్రమ్ తో "అజ్ఞాతవాసి" అనే చిత్రానికి వర్క్ చేశాడు. తెలుగు ఆడియెన్స్ ను అలరించడానికి మేనేజ్ చేశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి అప్కమింగ్ మూవీ "ఆర్ఆర్ఆర్"తో బిజీగా ఉన్నాడు.


కర్బూజా తో చర్మ సమస్యలు మాయం.. ఎలా అంటే.?

ప్రభాస్ వ్యూహాల పై కన్నేసిన నాని !

షాకింగ్‌: పోలీసుల చేతికి చిక్కిన అఖిలప్రియ భర్త.. అన్నీ చెప్పేశాడా..?

టీడీపీలో మ‌రో ఇద్ద‌రు లోకేశాలు... ఆ ఇద్ద‌రు వీళ్లే...!

వంశీ దెబ్బకు బచ్చుల సైలెంట్...టీడీపీకి దిక్కు ఎవరు ?

ఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?

అయోధ్య రామ మందిరానికి భారీ విరాళం ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>