PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jallikattu89e5f2cf-21b2-49bb-ac23-75ff221aeadc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jallikattu89e5f2cf-21b2-49bb-ac23-75ff221aeadc-415x250-IndiaHerald.jpgతమిళనాడులోని పలు ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు ఘనంగా ఆరంభ‌మ‌య్యాయి. మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు జోరందుకుంది. గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈసారి జల్లికట్టును అధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాధికారులు దగ్గరుండి మరీ వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు సందడి నెలకొంది. పోట్ల గిత్తలను నిలువరించేందుకు యువకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఎద్దుల దాడిలో గాయలవుతున్నా.. ఏమాత్రం భయపడకుండా జల్లికట్టును ఆస్వాదిస్తుjallikattu;kranthi;kranti;makar sakranti;sankranthi;chittoor;police;festival;tamil;chittor;history;tamilnaduఏపీలో జ‌ల్లిక‌ట్టు సంద‌డి... జోరుగా పందాలు క‌డుతున్నారుగా..ఏపీలో జ‌ల్లిక‌ట్టు సంద‌డి... జోరుగా పందాలు క‌డుతున్నారుగా..jallikattu;kranthi;kranti;makar sakranti;sankranthi;chittoor;police;festival;tamil;chittor;history;tamilnaduWed, 13 Jan 2021 09:16:38 GMTసంక్రాంతి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు జోరందుకుంది. గతేడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈసారి జల్లికట్టును అధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాధికారులు దగ్గరుండి మరీ వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు సందడి నెలకొంది. పోట్ల గిత్తలను నిలువరించేందుకు యువకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఎద్దుల దాడిలో గాయలవుతున్నా.. ఏమాత్రం భయపడకుండా జల్లికట్టును ఆస్వాదిస్తుంటారు.  దాదాపు 3500 సంవత్సరాల క్రితమే ఈ ఆటకు అంకురార్పణ జరిగినట్టు చరిత్ర చెబుతోంది.


అప్పటినుంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు తమిళులు. పూర్వకాలంలో జల్లికట్టులో పాల్గొని ఎద్దును లొంగదీసుకున్న యువకులను.. యువతులు తమ భర్తలుగా ఎంచుకునేవారట. జ‌ల్లిక‌ట్టు ర‌ద్దుకు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించ‌గా ఏకంగా పెద్ద ఉద్య‌మ‌మే న‌డించింది. దీంతో ప్ర‌భుత్వం వెన‌క్కిత‌గ్గిన విష‌యం తెలిసిందే. జ‌ల్లిక‌ట్టుకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ వ‌చ్చేసింది. పొగ‌రుబోతు గిత్త‌ను దారికి తెచ్చుకుని.. ఓడించ‌డ‌మే ఈ ఆట ప్ర‌ధాన ల‌క్ష్యం. తమిళులు పురాతన సంప్రదాయంగా భావిస్తూ కొనసాగిస్తున్న జల్లికట్టు.. ఓ సాహసక్రీడ. రోషమున్న ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగదీసుకోవడం ఇందులో ప్రధానాంశం.


చువ్వని కొమ్ములతో, భారీ కాయంతో మందలుగా దూసుకొస్తున్న ఎద్దులను యువకులు ఎదురొడ్డి.. వాటిని మచ్చిక చేసుకుని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు.సాధారణంగా కనుమ పండగరోజు ఈ జల్లికట్టు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇది స్పెయిన్‌కు చెందిన ఒక ఆటను పోలి ఉన్నప్పటికీ.. ఇక్కడ ఎద్దులను చంపరు. చేతిలో ఎలాంటి ఆయుధాలనూ వినియోగించరు.  ఇక తాజా విష‌యానికి వ‌స్తే తమిళనాడుకు ఆనుకుని ఉండే ఏపీలోని చిత్తూరుపై  జల్లికట్టు ప్ర‌భావం ప‌డిన‌ట్లుంది. ఇక్క‌డ జ‌రిగే పశువుల పండుగ కాస్త క్ర‌మంగా జల్లికట్టుగా మారింది. ఇప్పుడు ఇక్క‌డ‌ పశువేట పేరుతో పోటీలు నిర్వ‌హిస్తుండ‌టం గ‌మ‌నార్హం.  జల్లికట్టు మాదిరిలా పోటీల్లో బెట్టింగ్‌లు వేసుకునే స్థాయికి చేరుకుంది. జ‌ల్లిక‌ట్టుపై తమిళనాడులో ఆంక్షలు లేకున్నా చిత్తూరు జిల్లాలో మాత్రం ఈ ఆటపై ఆంక్షలు కొన‌సాగుతున్నాయి. అయితే  జిల్లాలో మాత్రం పోటీల‌కు పోలీసులు పెద్ద‌గా అడ్డు చెప్ప‌డం లేద‌ని స‌మాచారం. 


ఏపీకి మళ్ళీ వచ్చిన కరోనా వ్యాక్సిన్

ఇది తెలుసుకోకుండా సంక్రాంతి జరుపుకోవడం దండుగ.. మీకు తెలుసా..?

ఆ ఇద్ద‌రు వైసీపీ నానీలకు పవన్ దెబ్బ త‌ప్ప‌దా ? చెక్ పడేది ఎవరికో ?

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>