PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-klayan-miss-a-chances-in-ap-416ea476-e50d-4059-819f-0aa40caae1fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-klayan-miss-a-chances-in-ap-416ea476-e50d-4059-819f-0aa40caae1fa-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో బాగా బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందటే అది జగన్ సారథ్యంలోని వైసీపీ అని ఠక్కున చెప్పేయొచ్చు. 2019 ఎన్నికల్లో జగన్ సృష్టించిన సునామీ ఎవరు మర్చిపోరు. ఊహించని విధంగా వైసీపీకి 151 సీట్లు వచ్చేశాయి. అలాగే 50 శాతం పైనే ఓట్లు వచ్చాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది. ఈ 19 నెలల కాలంలో వైసీపీ హవా ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే 50 శాతం పైనే ఓట్లు వైసీపీకి ఉన్నాయని, ఈ మధ్య వచ్చిన పలు సర్వేలు తేల్చి చెప్పాయి. pawan kalyan;pawan;bandara;jagan;andhra pradesh;janasena;2019;bank;assembly;mla;tsunami;tdp;ycp;janasena party;partyఅక్కడ ఛాన్స్ కోల్పోతున్న పవన్...ఫోకస్ పెట్టాల్సిందేనా...అక్కడ ఛాన్స్ కోల్పోతున్న పవన్...ఫోకస్ పెట్టాల్సిందేనా...pawan kalyan;pawan;bandara;jagan;andhra pradesh;janasena;2019;bank;assembly;mla;tsunami;tdp;ycp;janasena party;partyWed, 13 Jan 2021 02:00:00 GMTఏపీ రాజకీయాల్లో బాగా బలంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందటే అది జగన్ సారథ్యంలోని వైసీపీ అని ఠక్కున చెప్పేయొచ్చు. 2019 ఎన్నికల్లో జగన్ సృష్టించిన సునామీ ఎవరు మర్చిపోరు. ఊహించని విధంగా వైసీపీకి 151 సీట్లు వచ్చేశాయి. అలాగే 50 శాతం పైనే ఓట్లు వచ్చాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతుంది. ఈ 19 నెలల కాలంలో వైసీపీ హవా ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే 50 శాతం పైనే ఓట్లు వైసీపీకి ఉన్నాయని, ఈ మధ్య వచ్చిన పలు సర్వేలు తేల్చి చెప్పాయి.

ఇదే సమయంలో 40 శాతం ఓట్లు తెచ్చుకుని 23 సీట్లు తెచ్చుకున్న టీడీపీ ఓటింగ్ శాతంలో కూడా ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. అయితే ఈ రెండు పార్టీల తర్వాత బలంగా ఉన్న పార్టీ జనసేననే. ఈ పార్టీకి 5 శాతం వరకు ఓటు బ్యాంక్ ఉంది. కాకపోతే ఎన్నికలయ్యాక పవన్, బీజేపీతో కలిసి ముందుకెళ్లడం వల్ల, కాస్త జనసేన పవర్ తగ్గిందనే వాదన కూడా వస్తుంది.

ఇక ఇదే ఇలాగే కొనసాగితే జనసేన పుంజుకోవడం కష్టమని తెలుస్తోంది. ఇలా తిరోగమనంలో వెళ్ళడం వల్ల 2019 ఎన్నికల్లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న నియోజకవర్గాల్లో కూడా జనసేన అడ్రెస్ లేకుండా పోతుంది. అలా జనసేన మంచి ఛాన్స్ కోల్పోతున్న స్థానాల్లో నరసాపురం అసెంబ్లీ స్థానం కూడా ఒకటి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి నిలబడిన ముదునూరి ప్రసాదరాజు 55 వేల పైనే ఓట్లు తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక్కడ జనసేన అభ్యర్ధి బొమ్మిడి నాయకర్ దాదాపు 50 వేల వరకు ఓట్లు తెచ్చుకుని సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. టీడీపీ అభ్యర్ధి బండారు మాధవ నాయుడు 27 వేల ఓట్లు తెచ్చుకుని మూడోస్థానానికి పరిమితమయ్యారు. అయితే ఎన్నికల తర్వాత ఇక్కడ జనసేన వీక్ అయిపోయింది. అధికార వైసీపీ ఎమ్మెల్యే దూసుకెళుతున్నారు. సెకండ్ ప్లేస్‌లోకి టీడీపీ వచ్చింది. కాబట్టి ఇలాంటి నియోజకవర్గాలపై పవన్ ఫోకస్ పెడితే జనసేనకు ప్లస్ అవుతుంది, లేదంటే అంతే సంగతులు.




బాత్రూంలో జారిపడిన హీరోయిన్.. ఆ వెంటనే సాంగ్ షూట్‌ ఉండటంతో..

హనీమూన్ ఎప్పుడో చెప్పేసిన సింగర్ సునీత.. ప్లాన్ ఏంటంటే..

బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనితో ప్రేమలో ఉందా?

వాట్సాప్ వీడుతున్నారా? అయితే ఈ పని చేయండి.. లేదంటే డేంజరే

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!

శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో.. మన ర్యాంక్ ఎంతో చెప్పిన జాబితా.. అగ్రస్థానం మళ్లీ వాళ్లకే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>