తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా ప్రముఖ నటుడు విజయ్ సేతుపతితో కలిసి నటించిన సినిమా ‘మాస్టర్’, తెలుగు రాష్ట్రాల్లో హీరో విజయ్‌కు అంత మార్కెట్ లేకపోయినప్పటికీ తమిళనాడులో మాత్రం వసూళ్లలో ఆయనే నంబర్ వన్. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ‘అదిరింది’, ‘విజిల్’ సినిమాలతో తెలుగులోనూ కూడా విజయ్‌కు ఫాలోయింగ్ పెరిగింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా 9 నెలల పాటు థియేటర్లు మూతబడటంతో తమ హీరోను మళ్లీ తెరపై చూడటానికి ఆత్రుతగా వేచి చూస్తున్న విజయ్ ఫ్యాన్స్ భారీ అంచనాల నడుమ ‘మాస్టర్’ సినిమా నేడు విడుదలైంది. సంక్రాంతి కానుకగా 13న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వినిపిస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందంటూ టాక్ వస్తోంది. అయితే, బాలీవుడ్‌కు చెందిన సినీ విమర్శకుడు శివ సత్యం మాత్రం ‘మాస్టర్’ సినిమాకు ఘోరమైన రేటింగ్ ఇచ్చారు. ఆయన రివ్యూ విజయ్ అభిమానులతో పాటు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో ‘తలనొప్పి’ సినిమా అని తీసిపారేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన రివ్యూను వెల్లడించారు.
డబ్బు, సమయం, ప్రతిభ అన్నీ దండగయ్యాయని శివ సత్యం విమర్శించారు. విజయ్ కెరీర్‌లో ఇదొక చెత్త సినిమా అని పేర్కొన్నారు. స్క్రీన్‌ప్లే బాగోలేదని, యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కవైపోయాయని, దర్శకత్వం పరమ చెత్తగా ఉందని ఘోరంగా విమర్శించారు. ఎడిటింగ్ కూడా అస్సలు బాగాలేదని, కథ కూడ ఊహాజనితంగా ఉందని వెల్లడించారు. సినిమాను ఫ్లాప్‌గా తేల్చిన సత్యం.. ఒకే ఒక్క స్టార్ రేటింగ్ ఇచ్చారు. కాగా, సత్యం రివ్యూపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. అంతేకాదు, సత్యం రివ్యూలు నమ్మాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. ఇదే సత్యం రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆ సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. అలా అని ఈయన రివ్యూలు అన్ని సినిమాలకు ఫెయిల్ అవ్వలేదు. కిందటేడాది ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలకు 3.5 స్టార్స్ చొప్పున రేటింగ్ ఇచ్చారు. ఈ రెండూ సంక్రాంతి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’కి 2.5 రేటింగ్ ఇచ్చారు. దానికి తగ్గట్టే ఆ సినిమా కూడా ఆడింది. ‘భీష్మ’కు 3.25 రేటింగ్ ఇచ్చారు.. అదీ కూడా హిట్ గా నిలిచింది.
" style="height: 517px;">
అలా ఎప్పుడూ చేస్తుంటా.. నన్ను విలన్‌ను చేసేశారు...
రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?
రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్.. వీడియోతో సహా...
కరోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్...ఎంతంటే..?
2021 కేంద్ర బడ్జెట్ లో షాకింగ్ అదే..
చూస్తూ చూస్తూ కొంపముంచిన బాబు...?
ఉద్యోగ అవకాశం
సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.
Care@indiaherald.com
04042601008
సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>