PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/supreme2667adbc-11b5-4291-8b83-5726d581de51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/supreme2667adbc-11b5-4291-8b83-5726d581de51-415x250-IndiaHerald.jpgదేశ రాజధాని నడిబొడ్డు ఢిల్లీ లో రైతులు ఎముకలు కొరికే చలిలో చేస్తున్న పోరాటం గురించి అందరికి తెలిసిందే.. మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన రైతులతో ప్రభుత్వం ఎన్ని చర్చలు జరిపినా ఆ చట్టాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తున్నారు. పంజాబ్, బీహార్ రైతులు మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి దేశం మొత్తంగా రైతులు తమ సంఘీభావాన్ని తెలియజేయగా వారితో పాటు ఉద్యమంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి, రైతు సంఘాలకsupreme;modi;delhi;bihar;capital;parliment;job;international;punjabరైతుల కు సుప్రీం కోర్ట్ సాక్షిగా మరో అన్యాయం జరగబోతుందా..?రైతుల కు సుప్రీం కోర్ట్ సాక్షిగా మరో అన్యాయం జరగబోతుందా..?supreme;modi;delhi;bihar;capital;parliment;job;international;punjabWed, 13 Jan 2021 19:00:00 GMTరాజధాని నడిబొడ్డు ఢిల్లీ లో రైతులు ఎముకలు కొరికే చలిలో చేస్తున్న పోరాటం గురించి అందరికి తెలిసిందే.. మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన రైతులతో ప్రభుత్వం ఎన్ని చర్చలు జరిపినా ఆ చట్టాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తున్నారు. పంజాబ్, బీహార్ రైతులు మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి దేశం మొత్తంగా రైతులు తమ సంఘీభావాన్ని తెలియజేయగా వారితో పాటు ఉద్యమంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి, రైతు సంఘాలకు అనేక మార్లు చర్చలు జరగగా అవి విఫలం అయ్యాయి..

ప్రభుత్వం చేసిన సడలింపులతో రైతులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. చట్టం రద్దు చేస్తేనే ఉద్యమం ఆపేస్తామని తేల్చి చెప్పారు రైతులు.. దీంతో ఈ విషయం ఇప్పుడు సుప్రీం కోర్టు కు చేరింది.. ఈ వ్యవసాయ చట్టంపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఓ కమిటీ ని నియమించడం జరిగింది.. అయితే ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే ఆ కమిటీ లో గతంలో వ్యవసాయ చట్టానికి అనుకూలంగా మాట్లాడినవారే ఉండడం చర్చించాల్సిన విషయం.. వ్యవసాయ చట్టానికి పూర్తి అనుకూలంగా ఉన్న వీరు ఎలాంటి నివేదిక సమర్పిస్తారో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో మొదలైంది..

అనిల్‌ ఘన్వాట్‌, అశోక్‌ గులాటి, భూపీందర్‌సింగ్‌ మాన్‌, ప్రమోద్‌ కుమార్‌ జోషిలతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు ప్రకటించారు. వీరు నలుగురూ.. వ్యవసాయంతో సంబంధం ఉన్న వారే. రైతుల కోసం ఉద్యమాలు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. రైతు ఉద్యమకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. అయితే… అసలు చిక్కు అంతా.. వీరు ఇప్పటికే అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్లే వస్తోంది. రైతుల ఆందోళనలు ప్రారంభమైన తర్వాత వీరందరూ పెద్ద ఎత్తున వివిధ పత్రికలకు వ్యాసాలు రాశారు. అందులో రైతుల ఆందోళనలను కొట్టి పారేసి.. చట్టాలను సమర్థించారు. కొత్త చట్టాలను ఏమాత్రం బలహీనపర్చినా భారత వ్యవసాయరంగం తన ముందున్న అంతర్జాతీయ అవకాశాలను దెబ్బతీసుకుంటున్నట్లే అవుతుందన్న బలమైన వాదన వినిపించారు.


కుర్రకారులో గిలిగింతలు రేపుతోంది..!

జమిలి నాటికి జత కట్టడం ఖాయం...?

ఆర్ఆర్ఆర్ గురించి షాకింగ్ న్యూస్..!

రజనీ మద్దతు కోసం బీజేపీ ?

తెలంగాణా నుంచి కేబినేట్ లోకి ఎవరంటే...?

ప్రజలకు జగన్ షాక్ ఇస్తారా...?

ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. చికెన్, గుడ్లపై నిషేధం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>