PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpgఅయితే.. వీరి వీరి శాఖ‌ల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. జిల్లాల‌పై మాత్రం ఎవ‌రూ క‌న్నెత్తి చూడ‌డం లేద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. తూర్పు విష‌యాన్ని చూస్తే.. పినిపె విశ్వ రూప్‌.. ఆది నుంచి మౌనంగానే ఉంటున్నారు. అస‌లు ఆయ‌న మంత్రిగా ఉన్నారా ? అన్న సందేహం వ‌చ్చే మంత్రుల లిస్ట్‌లో ఉన్నారు. ఇక‌, చెల్లుబోయిన.. త‌న మానాన త‌ను రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు త‌ప్ప‌.. జిల్లాను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మంత్రి ప‌ద‌వి వ‌చ్చాక ఆదిలో దూకుడుగా ఉన్న ఆయ‌న ఇప్పుడు సైలెంట్ అవ్వ‌డం వెన‌క పై ysrcp;nani;kodali nani;venu;vishwa;krishna river;adinarayanareddy;district;east;media;perni nani;minister;krishna district;letter;ycp;dookudu;kavuru srinivas;mantra;venu thottempudiవైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!వైసీపీలో ఆ ముగ్గురు మంత్రులు అలా.. ఈ ముగ్గురు మంత్రులు ఇలా... ఒక్క‌టే విమ‌ర్శ‌లు...!ysrcp;nani;kodali nani;venu;vishwa;krishna river;adinarayanareddy;district;east;media;perni nani;minister;krishna district;letter;ycp;dookudu;kavuru srinivas;mantra;venu thottempudiWed, 13 Jan 2021 07:33:21 GMTకృష్ణా జిల్లాల‌కు వైసీపీ స‌ర్కారు ఇచ్చింది. ఇత‌ర జిల్లాలకంటే కూడా ఈ రెండు జిల్లాల్లోనూ మంత్రి ప‌ద‌వులు ఎక్కువ‌గా క‌ల్పించింది. ఇత‌ర జిల్లాల్లో ఇద్ద‌రితో స‌రిపెట్ట‌డం లేదా ఒక్క‌రితోనే స‌రిపుచ్చిన సీఎం జ‌గ‌న్‌.. తూర్పు గోదావ‌రి జిల్లాలో ముగ్గురికి, కృష్ణా జిల్లాలో ముగ్గురికి అవ‌కాశం క‌ల్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్ప‌డి ఏడాదిన్న‌ర దాటి పోయింది. మ‌రి మంత్రులు ఆయా జిల్లాల‌కు ఏం చేశారు ? అనే ప్ర‌శ్న సాధార‌ణంగానే తెర‌మీదికి వ‌స్తుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా దూకుడు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో మంత్రుల వ్య‌వ‌హార శైలిపై.. ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తున్నారు.

ఈ క్ర‌మంలో అటు తూర్పుగోదావ‌రి, ఇటు కృష్ణా జిల్లాల్లో మంత్రుల‌ను కంపేర్ చేస్తూ.. సోష‌ల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తు తున్నాయి. తూర్పులో చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, కుర‌సాల క‌న్న‌బాబు, పినిపె విశ్వ‌రూప్ మంత్రులుగా ఉన్నారు. కృష్ణా లో వెలంప‌ల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా చ‌క్రం తిప్పుతున్నారు. అయితే.. వీరి వీరి శాఖ‌ల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. జిల్లాల‌పై మాత్రం ఎవ‌రూ క‌న్నెత్తి చూడ‌డం లేద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. తూర్పు విష‌యాన్ని చూస్తే.. పినిపె విశ్వ రూప్‌.. ఆది నుంచి మౌనంగానే ఉంటున్నారు. అస‌లు ఆయ‌న మంత్రిగా ఉన్నారా ? అన్న సందేహం వ‌చ్చే మంత్రుల లిస్ట్‌లో ఉన్నారు.

ఇక‌, చెల్లుబోయిన.. త‌న మానాన త‌ను రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు త‌ప్ప‌.. జిల్లాను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మంత్రి ప‌ద‌వి వ‌చ్చాక ఆదిలో దూకుడుగా ఉన్న ఆయ‌న ఇప్పుడు సైలెంట్ అవ్వ‌డం వెన‌క పై నుంచి వ‌చ్చిన ఆదేశాలే అంటున్నారు. ఇక‌, కుర‌సాల క‌న్న‌బాబు.. వ్య‌వ‌సాయ శాఖ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించే తీరిక కూడా ఆయ‌న‌కు ఉండ‌డం లేదు. ఇక‌, జిల్లాపై ఏం దృష్టి సారిస్తార‌నే కామెంట్లు వ‌స్తున్నాయి.

తూర్పు ప‌రిస్థితి ఇలా ఉంటే.. కృష్ణా జిల్లాలో మంత్రులుగా ఉన్న ముగ్గురు రాజ‌కీయంగా దూకుడు చూపిస్తున్నారు త‌ప్ప‌.. అభివృద్ధిలో ఎక్క‌డ ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌డం లేద‌ని అంటున్నారు. జిల్లాలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నా... ఏ ఒక్క‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెబుతున్నారు.
గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హయాంలో చేప‌ట్టిన‌ కార్య‌క్ర‌మాలే ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి త‌ప్ప‌.. కొత్త‌గా జిల్లాలో  చేప‌ట్టిన కొత్త కార్య‌క్ర‌మాలు, అభివృద్ధి ప‌నులు ఏమీ లేవ‌ని అంటున్నారు. అయితే.. ప్ర‌తిప‌క్షంపై దూకుడు విష‌యంలో కృష్ణా జిల్లా మంత్రులు ముగ్గురూ ఒక‌రికి ఒక‌రు పోటీ ప‌డుతున్నార‌ని పెద‌వి విరుస్తున్నారు. ఇలా .. అటు తూర్పు, ఇటు కృష్ణాజిల్లాల మంత్రుల వ్య‌వ‌హార శైలిపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.




ఉత్సాహంగా ఉండటానికి,ఈ పదార్థాలు, తప్పనిసరిగా తీసుకోవాలి..!

త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ ను అందుకే పక్కన పెట్టాడా ?

అన‌సూయ‌ను టార్గెట్ చేసిన వ‌ర్షిణి... ఏం చేస్తోందంటే....!

హెరాల్డ్ సెటైర్ : కోర్టు తీర్పు దెబ్బకు చివరకు ఇలా అయిపోయాడా ?

దూసుకుపోతున్న కేసీఆర్ బంధువు.. అసలు ప్లాన్ ఏంటో..?

చంద్రబాబుకు క్రిస్టియన్లు షాక్ ఇచ్చారా.. అసలు వాస్తవం ఏంటో తెలుసా..?

షాకింగ్: అఖిల ప్రియ కిడ్నాప్‌ ఎపిసోడ్‌కూ.. ఆ హీరోకూ సంబంధం ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>