PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/rajinikanthe55f9b01-5572-4b51-8743-3bca7350af84-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/rajinikanthe55f9b01-5572-4b51-8743-3bca7350af84-415x250-IndiaHerald.jpgరజినీకాంత్ రాజకీయ అరంగేట్రానికి ఫుల్ స్టాప్ పడినట్టేనని అందరూ భావిస్తున్న వేళ.. అభిమానులంతా మరోసారి ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ రోడ్లపైకి వచ్చి తమ ఆకాంక్షలను వెలిబుచ్చారు. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదంటూ సూపర్ స్టార్ మరోసారి స్పష్టం చేశారు కూడా. రజినీ మాట మేరకు అభిమానులు వెనక్కి తగ్గినా.. తమిళనాట రాజకీయ నాయకులు మాత్రం మరింతకాలం వేచి చూస్తామంటున్నారు. కమల్ హాసన్ మాజీ సహచరి, ప్రస్తుత బీజేపీ నేత గౌతమి రజినీ రాజకీయాల్లోకి రావాలి, వచ్చి బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోrajinikanth;kamal hassan;gouthami;raghava lawrence;tiru;bharatiya janata party;rajani kanth;assembly;tamilnadu;partyరజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?rajinikanth;kamal hassan;gouthami;raghava lawrence;tiru;bharatiya janata party;rajani kanth;assembly;tamilnadu;partyWed, 13 Jan 2021 12:00:00 GMTరజినీకాంత్ రాజకీయ అరంగేట్రానికి ఫుల్ స్టాప్ పడినట్టేనని అందరూ భావిస్తున్న వేళ.. అభిమానులంతా మరోసారి ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ రోడ్లపైకి వచ్చి తమ ఆకాంక్షలను వెలిబుచ్చారు. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదంటూ సూపర్ స్టార్ మరోసారి స్పష్టం చేశారు కూడా. రజినీ మాట మేరకు అభిమానులు వెనక్కి తగ్గినా.. తమిళనాట రాజకీయ నాయకులు మాత్రం మరింతకాలం వేచి చూస్తామంటున్నారు. కమల్ హాసన్ మాజీ సహచరి, ప్రస్తుత బీజేపీ నేత గౌతమి రజినీ రాజకీయాల్లోకి రావాలి, వచ్చి బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చే విషయంలో రజినీ పునరాలోచించాలని కోరారు గౌతమి.

అనారోగ్య కారణాలతో రజినీకాంత్ రాజకీయాలనుంచి విరమించుకున్నట్టు ఈపాటికే స్పష్టం చేశారు. ఆయన మాట గౌరవించాలని లారెన్స్ లాంటి వారు చాలామంది అభిమానుల్ని అభ్యర్థించారు. రజినీ మాటంటే మాటే, ఆయన మాటని మనమంతా గౌరవించాలని అన్నారు లారెన్స్. దీంతో హఠాత్తుగా బైటకొచ్చిన అభిమానులు కాస్త వెనక్కు తగ్గారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం రజినీ మద్దతుకోసం ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ నాయకులు రజినీ మద్దతుకోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారు. రాజకీయాల్లోకి రాకపోయినా పర్లేదు, కనీసం బీజేపీకి ఓటు వేయండి అని చెప్పించుకోవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే గౌతమి రంగంలోకి దిగారు.

బీజేపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు గౌతమి. ప్రస్తుతం ఆమె రాజపాళ్యం నియోజవర్గ బీజేపీ ఇన్ చార్జిగా ఉన్నారు. ఆ పార్టీ తరపున తమిళనాడులో పలు కార్యక్రమాలకు హాజరవుతున్న గౌతమి.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న మన ఊరి పొంగల్‌ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. విరుదునగర్‌ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గౌతమి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోందని, రజినీకాంత్ కూడా బీజేపీకి మద్దతిచ్చే విషయంలో పునరాలోచించుకోవాలని కోరారు. రజినీ మద్దతిస్తే.. తమిళనాడులో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని కచ్చితంగా అధికారంవైపు అడుగులేస్తుందని ఆమె దీమా వ్యక్తం చేశారు. 


చిరు ఆచార్య‌కు అదే మైన‌స్సా... !

రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు

మీర‌లా చేస్తే రూ.కోటి ముప్పై ల‌క్ష‌లు చేతికి...

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?

2021 కేంద్ర బడ్జెట్ లో షాకింగ్ అదే..

చూస్తూ చూస్తూ కొంపముంచిన బాబు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>