Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chory9f958915-b4a9-435c-8af8-f55ac5b317c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/chory9f958915-b4a9-435c-8af8-f55ac5b317c9-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద రోజురోజుకు ఎక్కువైపోతున్నది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటే ఇక ఇంటి యజమానులు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంటికి తాళం వేసి ఉంది అంటే చాలు దొంగలు ఎంతో రహస్యంగా చొరబడి ఇక అందినకాడికి దోచుకో పోతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇక అంతే కాకుండా ఎలాంటి ఆధారాలు దొరకకుండా అటు పోలీసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేటి రోజుల్లో దొంగలు. ఇక రోజు రోజుకు రెచ్చిపోతున్న దొంగలు ఎన్నో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఇళ్లనchory;kranthi;kranti;saritha;surya sivakumar;makar sakranti;sankranthi;huzur nagar;police;festival;silver;local language;medchalరెచ్చిపోయిన దొంగలు.. ఒక్క రాత్రిలో ఎన్ని ఇళ్లల్లో చోరీ చేశారో తెలుసా..?రెచ్చిపోయిన దొంగలు.. ఒక్క రాత్రిలో ఎన్ని ఇళ్లల్లో చోరీ చేశారో తెలుసా..?chory;kranthi;kranti;saritha;surya sivakumar;makar sakranti;sankranthi;huzur nagar;police;festival;silver;local language;medchalWed, 13 Jan 2021 11:00:00 GMTమేడ్చల్ పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు.



 అర్ధరాత్రి సమయంలో ఏకంగా అందినకాడికి దోచుకో పోయారు. 6 ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలు ఇళ్లను గుళ్ల చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల బీభత్సంతో  స్థానికులు  భయాందోళనలకు గురయ్యారు.  వివరాల్లోకి వెళితే తెలంగాణలోని మేడ్చల్ పట్టణంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు రెచ్చిపోయారు. సంక్రాంతి సందర్భంగా ఎంతోమంది సొంతూళ్లకు వెళ్లిన విషయాన్ని గమనించిన దొంగలు ముందుగా రెక్కీ నిర్వహించి తాళాలు ఉన్న ఇళ్లను గమనించారు. అర్ధరాత్రి సమయంలో పట్టణం మొత్తం నిద్రపోతుండగా దొంగలు తమ పనికానిచ్చారు. తాళాలు ఉన్న ఇళ్ల  దగ్గరికి చేరుకొని రహస్యంగా ఇంట్లోకి చొరబడి ఒక్కరాత్రి లోనే పట్టణంలో ఆరు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు.


 ఎంతో విలువైన బంగారు వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూర్య నగర్ కాలనీ సరిత రెసిడెన్సీలో మూడు ఇళ్లలో  దాని పక్క వీధిలోని మరో మూడు ఇళ్లలో  తాళాలు పగులగొట్టి దొంగలు చోరికి  పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు ఇక ఇంట్లో 40 తులాల వెండి ఆభరణాలతో పాటు పది వేల రూపాయల నగదు..  మరో ఇంట్లో 10 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. ఇక మరో రెండు ఇళ్ల యజమానులు పండుగ నేపథ్యంలో సొంతూరికి వెళ్లడంతో ఇక వారి ఇంట్లో ఎంత దొంగతనం జరిగింది అనే దానిపై వివరాలు తెలియరాలేదు.


చిరు ఆచార్య‌కు అదే మైన‌స్సా... !

రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?

రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు

మీర‌లా చేస్తే రూ.కోటి ముప్పై ల‌క్ష‌లు చేతికి...

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్‌.. వీడియోతో స‌హా...

క‌రోనా వ్యాక్సిన్ రేటు ఫిక్స్‌...ఎంతంటే..?

2021 కేంద్ర బడ్జెట్ లో షాకింగ్ అదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>