PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kinjarapu-family-check-to-ysrcp-in-sreekakulam-8c2cba0d-1962-4175-a7b3-9777cad1efb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kinjarapu-family-check-to-ysrcp-in-sreekakulam-8c2cba0d-1962-4175-a7b3-9777cad1efb0-415x250-IndiaHerald.jpgకింజరాపు ఫ్యామిలీ...ఏపీ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచే కుటుంబం. వెనుకబడిన జిల్లా శ్రీకాకుళంకు చెందిన ఈ ఫ్యామిలీకి రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేయగల సత్తా ఉంది. కష్టాల్లో ఉన్న ప్రతిసారి టీడీపీకి అండగా ఉండేది ఈ కుటుంబమే. అలాగే టీడీపీ అధికారంలోకి రావడానికి కింజరాపు ఫ్యామిలీ కృషి బాగానే ఉంటుంది. ఒకప్పుడు ఈ ఫ్యామిలీలో దివంగత ఎర్రన్నాయుడు టీడీపీ తరుపున కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, తనయుడు రామ్మోహన్ నాయుడులు కష్టపడుతున్నారు. rammohan naidu;cbn;jagan;ram mohan naidu kinjarapu;andhra pradesh;2019;district;srikakulam;air;cheque;tdp;local language;tekkali;dookudu;partyబాబాయ్-అబ్బాయ్‌లతో ఇబ్బందేనా....బాబుకు ఛాన్స్ దొరికిందా?బాబాయ్-అబ్బాయ్‌లతో ఇబ్బందేనా....బాబుకు ఛాన్స్ దొరికిందా?rammohan naidu;cbn;jagan;ram mohan naidu kinjarapu;andhra pradesh;2019;district;srikakulam;air;cheque;tdp;local language;tekkali;dookudu;partyWed, 13 Jan 2021 03:00:00 GMTజిల్లా శ్రీకాకుళంకు చెందిన ఈ ఫ్యామిలీకి రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేయగల సత్తా ఉంది. కష్టాల్లో ఉన్న ప్రతిసారి టీడీపీకి అండగా ఉండేది ఈ కుటుంబమే. అలాగే టీడీపీ అధికారంలోకి రావడానికి కింజరాపు ఫ్యామిలీ కృషి బాగానే ఉంటుంది. ఒకప్పుడు ఈ ఫ్యామిలీలో దివంగత ఎర్రన్నాయుడు టీడీపీ తరుపున కష్టపడ్డారు. ఇప్పుడు ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, తనయుడు రామ్మోహన్ నాయుడులు కష్టపడుతున్నారు.

2019 ఎన్నికల్లో జగన్ గాలి ఓ రేంజ్‌లో ఉన్నా సరే అచ్చెన్న టెక్కలి ఎమ్మెల్యేగా, రామ్మోహన్ శ్రీకాకుళం ఎంపీగా గెలిచారంటేనే వీరి సత్తా ఏంటో అర్ధమైపోతుంది. ఇక రాష్ట్ర స్థాయిలో టీడీపీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన, బడా బడా నేతలంతా పార్టీ మారినా, మంచి మంచి నాయకులు సైలెంట్ అయినా, చంద్రబాబుకు మాత్రం కింజరాపు ఫ్యామిలీ అండగా నిలిచింది.

మధ్యలో ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్న జైలుకు వెళ్లొచ్చినా, ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పుడు అచ్చెన్న ఏపీ అధ్యక్షుడుగా అధికార వైసీపీపై దూకుడుగా వెళుతున్నారు. అటు రామ్మోహన్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇక వీరి కష్టం వల్లే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ చాలా వరకు పుంజుకుంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 2 సీట్లే వచ్చాయి. వైసీపీకి 8 సీట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేశారు.

బాబాయ్-అబ్బాయ్‌లు ఇక్కడ వైసీపీకి ధీటుగానే పనిచేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో స్థానిక టీడీపీ నేతలతో కలిసి, ఆ పార్టీని మెరుగైన స్థితికి తీసుకొచ్చారు. దాదాపు 5 నియోజకవర్గాల్లో టీడీపీకి ప్లస్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, కింజరాపు ఫ్యామిలీ వైసీపీకి చెక్ పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. భవిష్యత్‌లో కింజరాపు ఫ్యామిలీతో వైసీపీకి ఇబ్బంది అనే చెప్పొచ్చు. అలాగే బాబుకు శ్రీకాకుళంలో మంచి ఛాన్స్ దొరికినట్లు అవుతుంది.




బాత్రూంలో జారిపడిన హీరోయిన్.. ఆ వెంటనే సాంగ్ షూట్‌ ఉండటంతో..

హనీమూన్ ఎప్పుడో చెప్పేసిన సింగర్ సునీత.. ప్లాన్ ఏంటంటే..

బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనితో ప్రేమలో ఉందా?

వాట్సాప్ వీడుతున్నారా? అయితే ఈ పని చేయండి.. లేదంటే డేంజరే

చీకట్లో దారి తప్పిన డ్రైవర్.. గూగుల్ మ్యాప్స్ నమ్మి చనిపోయాడు!

ప్రపంచంలోనే తొలిసారి వాటికీ కరోనా.. ఆందోళనలో అధికారులు!

శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో.. మన ర్యాంక్ ఎంతో చెప్పిన జాబితా.. అగ్రస్థానం మళ్లీ వాళ్లకే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>