Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/india-vs-australia0f250fae-67cf-4634-91d6-a8c3060b779c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/india-vs-australia0f250fae-67cf-4634-91d6-a8c3060b779c-415x250-IndiaHerald.jpgనాలుగో టెస్టు ముందు భారత్‌కు భరీ దెబ్బ తగిలింది. ఉన్నపళాన జట్టులోని స్టార్ ఆటగాళ్లంగా ఇంటి ముఖం పట్టనున్నారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టుకు టీమిండియా బరిలోకి దిగడంపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కరోనా నిబంధనల నేపథ్యంలో..india vs australia;rani;yajamanya;ravindra jadeja;india;australia;rishabh pant;kollu ravindraనాలుగో టెస్టు ముందు భారత్‌కు ఊహించని షాక్.. స్టార్‌లంతా ఇంటికే..!నాలుగో టెస్టు ముందు భారత్‌కు ఊహించని షాక్.. స్టార్‌లంతా ఇంటికే..!india vs australia;rani;yajamanya;ravindra jadeja;india;australia;rishabh pant;kollu ravindraTue, 12 Jan 2021 10:01:00 GMTఇంటర్నెట్ డెస్క్: నాలుగో టెస్టు ముందు భారత్‌కు భరీ దెబ్బ తగిలింది. ఉన్నపళాన జట్టులోని స్టార్ ఆటగాళ్లంగా ఇంటి ముఖం పట్టనున్నారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టుకు టీమిండియా బరిలోకి దిగడంపైనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కరోనా నిబంధనల నేపథ్యంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగాల్సిన నాలుగో టెస్టు అసలు జరుగుతుందా..? లేదా అనే చర్చ సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియాకు ఊహించని విధంగా స్టార్ ఆటగాళ్లంతా దూరం కావడంతో ఇక మిగిలిన ఆటగాళ్లతో మ్యాచ్ ఆడలేని పరిస్థితిలోకి భారత జట్టు చేరింది.

ఈ సిరీస్ మొత్తంలో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్ ఎవరైనా ఉన్నారంటే అతడు కచ్చితంగా రవీంద్ర జడేజానే.. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ.. ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో జడేజా బొటన వేలికి గాయమైంది. మూడో రోజు ఆట సందర్భంగా జడేజా బొటనవేలు ఎముక పక్కకు జరిగింది.

దీంతో అతడు మిగలిన రెండు రోజులూ బెంచికే పరిమితం అయ్యాడు. దీంతో నాలుగో టెస్టు మ్యాచ్‌కు జడేజా అందుబాటులో ఉండడని జట్టు యాజమాన్యం ప్రకటించింది.ఇక ఇదే టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లోనే తీవ్ర గాయంతో విలవిల్లాడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్.. తప్పనిసరి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్ ట్యాబెట్లు తీసుకుంటూ రెండో ఇన్నింగ్స్ కొనసాగించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయానికి చేరువ చేశాడు. అయితే ఆ తరువాత అవుటైన పంత్ కూడా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని సమాచారం.
పంత్‌తో పాటు అద్భుత డిఫెన్స్‌తో గెలుపును ఆసీస్‌కు దూరం చేసిన హనుమ విహారి కూడా కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే కుప్పకూలిపోయాడు. కానీ ట్యాబ్లెట్లు వేసుకుని మళ్లీ ఇన్నింగ్స్ కొనసాగించాడు. చివరి వరకు అశ్విన్‌తో పాటు క్రీజులో పాతుకుపోయి మ్యాచ్‌ను డ్రా చేశాడు. కండరాలు పట్టేయడంతో తదుపరి మ్యాచ్‌కు హనుమ విహారి కూడా అందుబాటులో ఉండడం అనుమానంగానే ఉంది.

ఇదిలా ఉంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్‌తో పాటు ఆసీస్ పర్యటనలో కూడా భారత్‌కు ఇదే చివరి మ్యాచ్. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడంతో ఇక నాలుగో టెస్టు ఎలా జరుగుతుంది..? జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకుండా ఎవరితో బరిలోకి దిగుతుంది..? అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వీటిపై జట్టు యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.


ఆర్జీవీ గురించి షాకింగ్ నిజాలు.. టెక్నీషియన్లనూ వదల్లేదట..!

వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!

మాజీ మంత్రి అఖిల ప్రియలో ఈ కోణం.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!?

ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఖాయం.... హైకోర్టులో ఈ రోజు వ‌చ్చే తీర్పు అదేనంట‌..

వీళ్లకి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వొద్దు.. డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు..?

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే...!

జగన్ మామ అదిరిపోయే వరం ఇచ్చాడు.. పిల్లలు ఖుషీ ఖుషీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>