MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-crack-movie-child-artist39f9c1b7-7f4d-4339-b7c7-a05b03ed0c6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-crack-movie-child-artist39f9c1b7-7f4d-4339-b7c7-a05b03ed0c6a-415x250-IndiaHerald.jpgరవితేజ డాన్ శీను మూవీతో డైరెక్టర్ గా మారిన గోపిచంద్ మలినేని మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో బాడీగార్డ్ చేసి హిట్ కొట్టిన గోపిచంద్, మళ్ళీ రవితేజతో కలిసి బలుపు సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. raviteja crack movie child artist;ravi;venkatesh;kumaar;shiva;shruti haasan;akash;amar;gopichand malineni;kranthi;kranti;raja;ravi anchor;ravi teja;sarath kumar;sharath;teja;thaman s;varalaxmi sarathkumar;makar sakranti;west bengal - kolkata;cinema;sankranthi;january;audience;director;lord siva;hero;heroine;traffic police;naveen nuli;disco raja;samuthirakani;raja the great;bengal tiger;sharrath marar1;mass;bodyguard;shambo siva shambo;krack;paruguక్రాక్ సినిమాలో రవి తేజ కొడుకు గా నటించిన ఈ అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?క్రాక్ సినిమాలో రవి తేజ కొడుకు గా నటించిన ఈ అబ్బాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?raviteja crack movie child artist;ravi;venkatesh;kumaar;shiva;shruti haasan;akash;amar;gopichand malineni;kranthi;kranti;raja;ravi anchor;ravi teja;sarath kumar;sharath;teja;thaman s;varalaxmi sarathkumar;makar sakranti;west bengal - kolkata;cinema;sankranthi;january;audience;director;lord siva;hero;heroine;traffic police;naveen nuli;disco raja;samuthirakani;raja the great;bengal tiger;sharrath marar1;mass;bodyguard;shambo siva shambo;krack;paruguTue, 12 Jan 2021 17:00:00 GMTరవితేజ డాన్ శీను మూవీతో డైరెక్టర్ గా మారిన గోపిచంద్ మలినేని మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో బాడీగార్డ్ చేసి హిట్ కొట్టిన గోపిచంద్, మళ్ళీ రవితేజతో కలిసి బలుపు సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వరుస ఫ్లాపులతో ఉన్న రవితేజకు బలుపు సినిమా ఊపునిచ్చింది. పవర్, బెంగాల్ టైగర్ సినిమాల తర్వాత మళ్ళీ రవితేజ ఫ్లాపుల బాట పట్టారు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా సినిమాలతో వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న రవితేజకు మళ్ళీ గోపించంద్ మలినేని పుణ్యమా అని హిట్ పడింది. దీంతో వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది.రవితేజ, శృతిహాసన్ హీరో, హీరోయిన్ గా నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. రవితేజతో శంభో శివ శంభో మూవీ డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ మూవీలో నటించడం విశేషం. విక్టరీ వెంకటేష్ నెరేషన్, థమన్ మ్యూజిక్, నవీన్ నూలి ఎడిటింగ్, జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ, సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ ఇలా ప్రతీదీ సినిమాని సూపర్ హిట్ గా నిలిపాయి. ముఖ్యంగా దాదాపు పది నెలలు కరోనా దెబ్బతో మూగబోయిన థియేటర్స్, రవితేజ క్రాక్ తో అరుపులు పెట్టడం ప్రారంభించాయి. ఇన్నాళ్ళు నడవని థియేటర్లు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. రవితేజ ఓపెనింగ్ అదిరిపోయింది. సినిమా క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ దూసుకుపోతుంది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో గోపిచంద్ మలినేని కొడుకు నటించడం మరో విశేషం. హీరోల పిల్లలు, డైరెక్టర్ల పిల్లలు సినిమాల్లో నటించడం మామూలే. క్రాక్ సినిమాలో గోపిచంద్ మలినేని కొడుకు, రవితేజ, శృతిహాసన్ ల కొడుకుగా నటించాడు. ఈ సినిమాలో తన ముదురు మాటలతో, రవితేజపై సెటైర్లు వేస్తూ కనిపిస్తాడు. మాటలతో నవ్వించడమే కాకుండా, ఈ బుల్లి గోపిచంద్ ఒక ఫైట్ కూడా చేశాడండోయ్. థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ కుర్రాడి యాక్టింగ్ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి గోపిచంద్ మలినేని తన కొడుకుని అప్పుడే ఇండస్ట్రీకి పరిచయం చేసేశాడు. తన కొడుక్కి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందించారు. మరి రాబోయే సినిమాల్లో కూడా తన కొడుకుకి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తారా? పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరీని హీరోని చేసినట్టు, గోపిచంద్ మలినేని కూడా తన కొడుకుని హీరోగా రెడీ చేస్తారేమో చూడాలి.





తెలుగు యువత అధ్యక్షుడిగా బీసీ నేత

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>