PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pellaina-chala-mandiki-ee-vishayame-teliyadu-mari-mee-sangatenti02cf1375-6ccc-4f1f-8459-34fb979dc40a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pellaina-chala-mandiki-ee-vishayame-teliyadu-mari-mee-sangatenti02cf1375-6ccc-4f1f-8459-34fb979dc40a-415x250-IndiaHerald.jpgవివాహం.. జీవితంలో ఓ ముఖ్యమైన భాగం.. అందుకే వీలైనంత వరకూ పెళ్లి గ్రాండ్‌గా చేసుకుంటారు. హిందూ పద్దతిలో వివాహం చేసుకుంటే.. పెళ్లి క్రతువులో అరుంధతిని చూపించడం ఓ ఆనవాయితీ.. మరి పెళ్లి అయిన తరువాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు.. మీలో చాలా మందికి పెళ్లయినా ఈ విషయం తెలియక పోవచ్చు. తెలుసుకుందాం.. రండి.. ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవంతయైన ఒక కన్యను, వర్ణింప శక్యంకాని ఒక సుందరుడిని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్య. యువకుని పేరు మన్మథుడు. సృష్టి కార్యంలో తనకు సాహmarriage;shiva;jeevitha rajaseskhar;jyothi;maharshi;mahima;sandhya;santoshi;gold;maharshi 1;mandalam;marriage;lord siva;husband;evening;sanskrit;arundhati;shakti;mantraపెళ్లయినా చాలా మందికి ఈ విషయమే తెలియదు.. మరి మీ సంగతేంటి..?పెళ్లయినా చాలా మందికి ఈ విషయమే తెలియదు.. మరి మీ సంగతేంటి..?marriage;shiva;jeevitha rajaseskhar;jyothi;maharshi;mahima;sandhya;santoshi;gold;maharshi 1;mandalam;marriage;lord siva;husband;evening;sanskrit;arundhati;shakti;mantraTue, 12 Jan 2021 07:00:00 GMTపెళ్లి గ్రాండ్‌గా చేసుకుంటారు. హిందూ పద్దతిలో వివాహం చేసుకుంటే.. పెళ్లి క్రతువులో అరుంధతిని చూపించడం ఓ ఆనవాయితీ.. మరి పెళ్లి అయిన తరువాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు.. మీలో చాలా మందికి పెళ్లయినా ఈ విషయం తెలియక పోవచ్చు. తెలుసుకుందాం.. రండి..

ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవంతయైన ఒక కన్యను, వర్ణింప శక్యంకాని ఒక సుందరుడిని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్య. యువకుని పేరు మన్మథుడు. సృష్టి కార్యంలో తనకు సాహాయపడమని చెబుతూ... బ్రహ్మ ఆ యువకునికి అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు సమ్మోహన బాణాలను అందించాడు. బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్య ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి (సరస్వతి) ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపించి, మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు.

తనవల్లనే కదా! ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్య చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయింది. అపుడు బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు “శివ మంత్ర అనుష్టానమును” వివరించి తన ఆశ్రమానికి వెల్లిపోయాడు. సంధ్య తదేకనిష్టతో తపమాచరించి శివుడి అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా ఆమె ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలుగరాదనే వరాన్ని అనుగ్రహించమంది.

శివుడు ఆమె లోకోపకార దృష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య నా భర్త తప్ప, పరపురుషుడు ఎవరైనా నన్ను కామ దృష్టితో చూచినట్లయితే, వారునపుంసకులుగా మారాలి! అంతేకాదు, నేను పుట్టగానే అనేకమందికి కామవికారాన్ని కల్గించాను, కాబట్టి ఈ దేహం నశించిపోవాలి అని కోరింది. శివుడు తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలువై  శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా నీవు తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.

శివుడి ఆజ్ఙగా సంధ్య శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కృత భాషలో... ‘అరుం’ అంటె అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి, ఆమె అరుంధతి అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి, పెద్దచేసి వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది.

ఈ దంపతులకు పుట్టినవాడే శక్తి.  శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. అరుంధతిని మనవారు “ఆరని జ్యోతి అని అరంజ్యోతి” అని పిలుస్తూంటారు. కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తఋషి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. వశిష్ట, అరుంధతీ ద్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారా రూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది.




మహేష్ సర్కారు వారి పాట.. చివరి నిమిషంలో అంతా ఛేంజ్..!

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>