Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ram-gopal-varmae34f0836-4175-4141-a078-247b0795bf9f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ram-gopal-varmae34f0836-4175-4141-a078-247b0795bf9f-415x250-IndiaHerald.jpgఎప్పుడూ వివాదాల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తన సినిమాల్లో నటించే నటీనటులు, టెక్నీషియన్లకు కనీస రెమ్యునరేషన్, జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి... ram gopal varma;koti;ganga;ram gopal varma;ram pothineni;goa;ganges;india;ram madhav;cinema;court;murder;letter;murder.;research and analysis wingఆర్జీవీ గురించి షాకింగ్ నిజాలు.. టెక్నీషియన్లనూ వదల్లేదట..!ఆర్జీవీ గురించి షాకింగ్ నిజాలు.. టెక్నీషియన్లనూ వదల్లేదట..!ram gopal varma;koti;ganga;ram gopal varma;ram pothineni;goa;ganges;india;ram madhav;cinema;court;murder;letter;murder.;research and analysis wingTue, 12 Jan 2021 10:01:00 GMTఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడూ వివాదాల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. తన సినిమాల్లో నటించే నటీనటులు, టెక్నీషియన్లకు కనీస రెమ్యునరేషన్, జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారట. దీనికి సంబంధించి ఆయనకు తాజాగా లీగల్ నోటీసును సదరు టెక్నీషియన్ల యూనియన్ పంపించిందట.

తన సినిమాలకు పనిచేసిన ఆర్టిస్టులకు, వర్కర్లకు వర్మ జీతాలు చెల్లించలేదని, కోటి రూపాయల వరకూ బాకీ పడ్డాడని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్(ఎఫ్‌డబ్ల్యూ‌ఐసీఈ) ఆరోపించింది. వర్మ సినిమాలకు ఇకపై తమ 32 యూనియన్లలోని ఏ ఒక్కరూ పనిచేయబోమంటూ ఎఫ్‌డబ్ల్యూ‌ఐసీఈ బహిరంగంగా ప్రకటించింది.

తమకు జీతాలు చెల్లించకుండా ఎగ్గొట్టినందుకు గానూ ఆయనకు ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా పంపామని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రెసిడెంట్ బీఎన్ తివారీ తెలిపారు. అయితే తాము పంపిన నోటీసులపై వర్మ ఇప్పటివరకు స్పందించలేదని, కనీసం పెండింగ్‌లో ఉన్న జీతాలను కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు అందాల్సిన జీతాలకు సంబంధించి గతేడాది సెప్టెంబరు 17న ఆయనకు లిఖిత పూర్వకంగా ఓ లేఖను అందజేశామని, అందులో తాము ఎంతమంది పనిచేశాము, ఎవరికి ఎంతెంత జీతం అందాల్సి ఉంది, ఈ విషయాలన్నింటినీ స్పష్టంగా తెలియజేశామని, కానీ వర్మ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు చెల్లించలేదని సదరు యూనియన్ ఆరోపించింది. దీనికి సంబంధించి వర్మకు లేఖ పంపడానికి ముందే గోవా ముఖ్యమంత్రికి కూడా తమ బాధను వ్యక్తం చేస్తూ లేఖ పంపించామని తెలిపారు. మరి దీనిపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రతి చోట దర్శకనిర్మాతలంతా షూటింగ్‌లు మానుకుని ఇళ్లకు పరిమితమై ఉంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలు తీసి ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీకి కూడా షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే 2020లో మర్డర్, కరోనా, దిశ వంటి నాలుగైదు సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులపై ప్రయోగించాడు. ఈ సినిమాల్లో మర్డర్ సినిమా కోర్టుల చుట్టూ కూడా తిరిగింది. అయితే ఎలాగోలా దాని నుంచి బయట పడ్డారు. విచిత్రమేమంటే ప్రపంచం మొత్తం భయపడిపోయిన కరోనా మీద కూడా ‘కరోనా’ అని ఓ సినిమా తీసేశాడు.ఆర్జీవీ. మరి ఆర్జీవీ అంటే మాటలా..!




వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!

మాజీ మంత్రి అఖిల ప్రియలో ఈ కోణం.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!?

ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఖాయం.... హైకోర్టులో ఈ రోజు వ‌చ్చే తీర్పు అదేనంట‌..

వీళ్లకి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వొద్దు.. డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు..?

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే...!

జగన్ మామ అదిరిపోయే వరం ఇచ్చాడు.. పిల్లలు ఖుషీ ఖుషీ..!?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>