PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/talasanie0c4c426-50f3-4e99-84ba-ee65d2925640-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/talasanie0c4c426-50f3-4e99-84ba-ee65d2925640-415x250-IndiaHerald.jpgజనవరి 26 నుంచి తెలంగాణలో మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 18 ఏళ్ళు నిండిన మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సభ్యత్వం పొందిన వారికి ప్రభుత్వ పంపిణీ చేసే చేపలు పట్టుకోవడానికి, చెరువులపై హక్కులు కల్పించడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా ఫిబ్రవరి మొదటి వారంలో 150 సంచార చేపల విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.talasani;kcr;amala akkineni;srinivas;mudiraj;telangana;january;pond;chief minister;february;minister;fish;talasani srinivas yadavఫిబ్రవరిలో సంచార చేపల విక్రయ కేంద్రాలుఫిబ్రవరిలో సంచార చేపల విక్రయ కేంద్రాలుtalasani;kcr;amala akkineni;srinivas;mudiraj;telangana;january;pond;chief minister;february;minister;fish;talasani srinivas yadavTue, 12 Jan 2021 21:37:30 GMTజనవరి 26 నుంచి తెలంగాణలో మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.  మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలపై తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ముదిరాజ్, గంగపుత్రులు, తెనుగు, గుండ్ల బెస్త, బెస్త, ముతరాసి తెగలకు చెంది 18 సంవత్సరాల వయసు దాటిన వారిని అర్హులుగా గుర్తించి సభ్యత్వం కల్పించాలని చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల లబ్ది అర్హులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.  కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయడంతో పాటు మత్స్యకారులకు సబ్సిడీ పై వివిధ రకాల వాహనాలను అందజేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.  ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ అందించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఇందుకోసం విధివిధానాలను సిద్దం చేయాలని మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. సభ్యత్వం పొందిన వారికి ప్రభుత్వ పంపిణీ చేసే చేపలు పట్టుకోవడానికి, చెరువులపై హక్కులు కల్పించడం జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు పూర్తయిన అనంతరం మత్స్య సహకార సొసైటీ లకు ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు.

అదే విధంగా ఫిబ్రవరి మొదటి వారంలో 150 సంచార చేపల విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 6 లక్షల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ కాగా, 4 లక్షల రూపాయలను లబ్దిదారుల వాటా గా చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని వివరించారు.  3 నుండి 5 మంది మహిళలతో కూడిన టీం కు ఒక వాహనాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మత్స్యకార మహిళలు ఈ వాహనం ద్వారా చేపలు, చేప వంటకాలను విక్రయించు కోవడం ద్వారా స్వయం ఉపాది పొందుతారని వివరించారు. ఈ వాహనాలను జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో 3 చొప్పున ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.


వామ్మో ....ఆదాశర్మ బీచ్ లో ఎం చేసిందో తెలుసా .

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>