- Actress Leela Ganesh Bids Hopes On Her Debut Leela (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- Actress Leela Ganesh Bids Hopes On Her Debut Leela (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
- Actress Leela Ganesh Bids Hopes On Her Debut Leela (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
అంతా దైవ 'లీల' అంటున్న హారర్ థ్రిల్లర్ 'లీల' కథానాయకి స్నేహా గణేష్
రాయల్ మూవీ క్రియేషన్స్ పతాకంపై బాల దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా ఏ.ఎం.భాషా నిర్మించిన 'లీల' ధియేటర్స్ లో విడుదలకు ముందే 'ఊర్వశి ఓటిటి' ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన స్నేహా గణేష్... "లీల" చిత్రం తనకు మంచి గుర్తింపునిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. 'లీల'లో నటించే అవకాశం రావడం దైవలీల'గా పేర్కొంది. ఈ చిత్రంలో తాను హీరోయిన్ మాత్రమే కాదని... సినిమాలోనూ సినిమా హీరోయిన్ గా నటించడం భలే గమ్మత్తుగా అనిపించిందని చెప్పింది. ఈ చిత్రం ఈనెల 14న "ఊర్వశి ఓటిటి" ద్వారా విడుదల కానుంది.
విజయ్, స్నేహ గిరీష్, సంధ్య ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ దాసరి, ఎడిటింగ్: ఎం.ఎన్.ఆర్, సంగీతం: శ్రీమిత్ర, నిర్మాత: ఏ.ఎం.భాషా, రచన-దర్శకత్వం: బాల!!