PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వడం దాన్ని హైకోర్ట్ తిప్పికొట్టడం... సస్పెండ్ చేయడం జరిగింది. రాజకీయంగా ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. నిన్న సాయంత్రం ఈ మేరకు హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనితో ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ కి వెళ్ళింది. నేడు 10;30 కి విచారణకు వెళ్తుంది. ఈ పిటీషన్ లో ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వు లు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని పిటys jagan;kerala;jagan;andhra pradesh;karnataka - bengaluru;high court;government;court;local languageహైకోర్ట్ జగన్ కి షాక్ ఇస్తుందా...?హైకోర్ట్ జగన్ కి షాక్ ఇస్తుందా...?ys jagan;kerala;jagan;andhra pradesh;karnataka - bengaluru;high court;government;court;local languageTue, 12 Jan 2021 10:30:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వడం దాన్ని హైకోర్ట్ తిప్పికొట్టడం... సస్పెండ్ చేయడం జరిగింది. రాజకీయంగా ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. నిన్న సాయంత్రం ఈ మేరకు హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనితో ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ కి వెళ్ళింది. నేడు 10;30 కి విచారణకు వెళ్తుంది. ఈ పిటీషన్ లో ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వు లు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని పిటీషన్ లో పేర్కొంది. ఎన్నికల ప్రక్రి య అమల్లోకి వచ్చాక హైకోర్టు జోక్యం చేసుకోజాలదు అని ఎన్నికల కమీషనర్ స్పష్టంగా పిటీషన్ లో వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టత ఇచ్చారు. పూర్తయిన తర్వాత మాత్రమే సవాల్‌ చేయవచ్చని 2000వ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనే విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణలో రాజ్యాంగంలోని 226 అధికరణ మేరకు కోర్టుల విచారిణాధికారం పరిమితమైంది అని వెల్లడించింది.

కరోనాపై ప్రభుత్వ వివరణ పరిగణనలోకి తీసుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందని సింగిల్‌ జడ్జి పొరపాటు పడ్డారు అని అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వివరాలు ఏమీ లేకుండా విచారణ దశలో ఆ నిర్ణయానికి రావడం సరికాదు అని వెల్లడించింది. ఎస్‌ఈసీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన ఆధారాలు కో ర్టు ముందున్నాయి అని తెలిపింది. రాజస్థాన్‌, కేరళ, కర్ణాటక హైకోర్టులు స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలకు నిరాకరించాయి అనే విషయాన్ని పేర్కొంది. ఈ విషయాన్ని సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోవాల్సింది అని అభిప్రాయపడింది. వీటన్నిటి దృష్ట్యా ఆ ఉత్తర్వులను రద్దు చేయండి అని పిటీషన్ లో కోరింది ఎన్నికల సంఘం.


టీ తాగే సమయంలో ఈ పదార్థాలను అస్సలు తినకూడదట?

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!

మాజీ మంత్రి అఖిల ప్రియలో ఈ కోణం.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!?

ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఖాయం.... హైకోర్టులో ఈ రోజు వ‌చ్చే తీర్పు అదేనంట‌..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>