PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-nara-lokesh-doesnt-contest-mangalagiricd34e14d-8716-4014-a625-16604b33a476-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-nara-lokesh-doesnt-contest-mangalagiricd34e14d-8716-4014-a625-16604b33a476-415x250-IndiaHerald.jpgచంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే నాయకుడు ఎవరంటే నారా లోకేష్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు, ఎప్పటి నుంచో తన కుమారుడుకు పట్టం కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల కంటే ముందు లోకేష్‌ని పార్టీలో యాక్టివ్ చేసిన బాబు, 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, చినబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేశారు. ఇక మంత్రిగా చినబాబు పనితీరు ఎలా ఉన్నా, అలా పదవి ఇవ్వడంపై విమర్శలు గట్టిగానే వచ్చాయి. nara lokesh;lokesh;jagan;nara lokesh;amaravati;2019;government;capital;mangalagiri;alla ramakrishna reddy;ycp;lokesh kanagaraj;s radhakrishna;party;sajjala ramakrishna reddyచినబాబు మరో ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారా?చినబాబు మరో ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారా?nara lokesh;lokesh;jagan;nara lokesh;amaravati;2019;government;capital;mangalagiri;alla ramakrishna reddy;ycp;lokesh kanagaraj;s radhakrishna;party;sajjala ramakrishna reddyTue, 12 Jan 2021 03:00:00 GMTనారా లోకేష్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు, ఎప్పటి నుంచో తన కుమారుడుకు పట్టం కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల కంటే ముందు లోకేష్‌ని పార్టీలో యాక్టివ్ చేసిన బాబు, 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, చినబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేశారు. ఇక మంత్రిగా చినబాబు పనితీరు ఎలా ఉన్నా, అలా పదవి ఇవ్వడంపై విమర్శలు గట్టిగానే వచ్చాయి.

ఇక ఇలాంటి విమర్శలు రావడం, టీడీపీకి భవిష్యత్ నాయకుడు కాబట్టి చినబాబుని  2019 ఎన్నికల్లో దించారు. అది కూడా రాజధాని అమరావతి ప్రాంతమైన మంగళగిరిలో. సాధారణంగా మంగళగిరిలో టీడీపీకి మంచి రికార్డు లేదు. కాకపోతే రాజధాని చేశారు కాబట్టి చినబాబు గెలుపు సులువు అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా చినబాబు, వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

అటు రాష్ట్రంలో పార్టీ కూడా దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే పార్టీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు గట్టిగానే కష్టపడుతూ వచ్చారు. లోకేష్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. ఇక కరోనా వచ్చాక చంద్రబాబు యాక్టివ్‌గా ఉండటం తగ్గించేసి, చినబాబుని రంగంలోకి దింపారు. చినబాబు రాష్ట్రంలో పర్యటిస్తూ, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారు. సమస్యలపై పోరాడుతూ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అటు కార్యకర్తలకు అండగా ఉంటున్నారు.

అయితే ఈ ఊపు ఇలాగే 2024 ఎన్నికల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇలా వర్క్ చేశాకైతే చినబాబు నెక్స్ట్ గెలవడానికి అవకాశాలు ఉంటాయని విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చినబాబు ప్లేస్ మార్చరని, మంగళగిరి బరిలోనే ఉంటారని చెబుతున్నారు. ఓడిన చోటే గెలవాలని చినబాబు చూస్తున్నారని అంటున్నారు. మరి చూడాలి 2024 ఎన్నికల్లో చినబాబు ప్లేస్ మార్చకుండా మంగళగిరి నుంచే పోటీ చేసి గెలుస్తారో లేదో.




ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>