PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bandi-sanjayaaed6f59-2ba8-4ccb-abf1-73c3b40e2318-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bandi-sanjayaaed6f59-2ba8-4ccb-abf1-73c3b40e2318-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు తెచ్చిన నాయకుడు బండి సంజయ్.. అప్పటివరకు సామాన్య నాయకుడిగా ఉన్నా బండి సంజయ్ బీజేపీ పార్టీ ఎంపీ గా గెలుపొందిన తర్వాత తన దూకుడు ని పెంచాడు. కొన్నాళ్ళకు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక అయన తన దూకుడు ని మరింత పెచాడు.. అధికార పార్టీ ని విమర్శించి వెనక్కి నెట్టేయాలనే లక్ష్యంతో బండి సంజయ్ వేసిన తొలిఅడుగు దుబ్బాక రూపంలో మంచి ఫలితాన్ని ఇచ్చింది.. అప్పటివరకు తెరాస పార్టీ ఒక్కటే తెలంగాణ లో దిక్కు అన్న భావన ను బండి సంజయ్ తుడిచిపెట్టుకుపోయేలా చేశాడు. bandi sanjay;bhavana;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;mp;assembly;minister;josh;partyతెలంగాణ రాజకీయాల్లో ఆరితేరిపోయిన బండి సంజయ్..?తెలంగాణ రాజకీయాల్లో ఆరితేరిపోయిన బండి సంజయ్..?bandi sanjay;bhavana;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;mp;assembly;minister;josh;partyTue, 12 Jan 2021 19:00:00 GMTతెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు తెచ్చిన నాయకుడు బండి సంజయ్.. అప్పటివరకు సామాన్య నాయకుడిగా ఉన్నా బండి సంజయ్ బీజేపీ పార్టీ ఎంపీ గా గెలుపొందిన తర్వాత తన దూకుడు ని పెంచాడు. కొన్నాళ్ళకు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక అయన తన దూకుడు ని మరింత పెచాడు.. అధికార పార్టీ ని విమర్శించి వెనక్కి నెట్టేయాలనే లక్ష్యంతో బండి సంజయ్ వేసిన తొలిఅడుగు దుబ్బాక రూపంలో మంచి ఫలితాన్ని ఇచ్చింది.. అప్పటివరకు తెరాస పార్టీ ఒక్కటే తెలంగాణ లో దిక్కు అన్న భావన ను బండి సంజయ్ తుడిచిపెట్టుకుపోయేలా చేశాడు.

దుబ్బాక గెలుపుతో ఒక్కసారి గా బీజేపీ పార్టీ లో నూతనోత్సాహం వచ్చినట్లయ్యింది. గెలుపు మొహం చూసి చాల రోజులైనా నేపథ్యంలో ఈ విజయం వారికి ప్రత్యేకమైంది అని చెప్పొచ్చు.. అదే జోష్ తో గ్రేటర్ ఎన్నికల్లో పాల్గొన తెరాస కి పెద్ద షాక్ ఇచ్చింది బీజేపీ పార్టీ.. బీజేపీ పెద్ద పెద్ద నేతలు వచ్చి ప్రచారం చేయడంతో ప్రజలకు బీజేపీ పార్టీ పై నమ్మకం ఉంచి గెలుపు అంచులవరకు తీసుకెళ్లారు. దాంతో తెరాస పార్టీ దిగి రక తప్పలేదు. బీజేపీ దెబ్బకు ఇప్పటివరకు కూడా తెరాస పార్టీ హైదరాబాద్ లో మేయర్ ని ప్రకటించలేదు.

ఇక ఇప్పుడు రానున్న ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నిలకల్ పై దృష్టి పెట్టిన బీజేపీ పార్టీ మరో సరికొత్త ప్రణాళికలు వేసిందని చెప్పొచ్చు. మునుపెన్నడూ లేనట్టి రాజకీయాలను బండి సంజయ్ ఇప్పుడు చేస్తున్నారు. ప్రస్తుతం బండి సంజయ్.. ఖమ్మం, వరంగల్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లి.. టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల గురించిమాట్లాడుతున్నారు. . కేటీఆర్‌ను సీఎం చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదని కూడా బండి సంజయ్ చెప్పుకొచ్చారు. పార్టీలో చీలికలు వస్తాయని కేటీఆర్‌కు చెబుతున్నారని ఆయన అంటున్నారు. అలాగే మంత్రి పదవులు రాకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది అసంతృప్తితో ఉన్నారని.. వచ్చే ఎన్నికల నాటికి గంపగుత్తగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి దూకుతారని ప్రకటిస్తున్నారు. ఈ తరహా రాజకీయంతో తెరాస పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగెట్టేలా చేస్తున్నాడు.


కరోనా నుండి బయటపడ్డ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>