Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/murder-sketch0691cba8-00c7-420e-82ab-9358bf054bd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/murder-sketch0691cba8-00c7-420e-82ab-9358bf054bd3-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ క్రైం థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని స్టోరీ. సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మృతుడి సోదరి పన్నిన హనీట్రాప్. ఈ కుట్రను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. సోదరుడిని చంపిన హంతకుడిని హత్య చేసేందుకు..murder sketch;sathyam;satya;mumbai;delhi;maharashtra - mumbai;bollywood;police;capital;2020;murder;car;maharashtra;thriller;cheque;murder.;juneహనీట్రాప్ తో కిడ్నాప్.. మర్డర్ కూ స్కెచ్.. బాలీవుడ్ ను మించిన క్రైం స్టోరీ..హనీట్రాప్ తో కిడ్నాప్.. మర్డర్ కూ స్కెచ్.. బాలీవుడ్ ను మించిన క్రైం స్టోరీ..murder sketch;sathyam;satya;mumbai;delhi;maharashtra - mumbai;bollywood;police;capital;2020;murder;car;maharashtra;thriller;cheque;murder.;juneTue, 12 Jan 2021 17:58:00 GMT

ముంబై: బాలీవుడ్ క్రైం థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోని స్టోరీ. సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు మృతుడి సోదరి పన్నిన హనీట్రాప్. ఈ కుట్రను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. సోదరుడిని చంపిన హంతకుడిని హత్య చేసేందుకు సాక్షాత్తూ మృతుడి సోదరి అతడిపై హనీట్రాప్ వల విసిరింది. ఈ ఉదంతం మహారాష్ట్రలోని ముంబై నగరంలో కనిపించింది. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో సంచలనం రేపింది. 


2020 జూన్ నెలలో ముంబైలోని మలాద్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్ విషయంలో 2 గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నిందితుడు మహ్మద్ సాధిక్ 24 ఏళ్ల వయసుగల అల్తాఫ్ ను హత్య చేశాడు. హత్య చేశాక హంతకుడు సాధిక్ బాడీతో సహా  ఢిల్లీకి పారిపోయాడు. సోదరుడు అల్తాఫ్ హత్య సంఘటనతో తని సోదరి యాస్మీన్ ప్రతీకారం తీర్చుకోవాలని నోర్ణయించుకుంది. అల్తాఫ్ స్నేహితులు ఫరూక్, ఒవైస్, మనీస్, జాకీర్ ఖాన్, సత్యంపాండే ల సహాయంతో హంతకుడు సాధిక్ ను చంపాలని పక్కా ప్లాన్ రెడీ చేసింది.


అల్తాఫ్ హత్య జరిగి సరిగ్గా నెల రోజులు గఫైచిపోయింది. వారు మొదట సాధిక్ ను ఢిల్లీ నుంచి ముంబైకు రప్పించేందుకు హనీట్రాప్ పన్నారు. అప్పటికే నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో సాధిక్ ను బుట్టలో వేసింది యాస్మిన్. దీంతో సాధిక్ ప్రేమలో పడ్డాడు. ఢిల్లీలో ఉన్న సాధిక్ యాస్మిన్ ను కలవడానికి ముంబై వచ్చాడు. యాస్మిన్ అతన్ని ఆరేలోని చోటా క్మీర్ ప్రాంతానికి రావాలని చెప్పింది. సాధిక్ అక్కడకు చేరుకునేసరికి యస్మిన్ లేదు. యాస్మిన్ కు బదులుగా అల్తాఫ్ ఐదుగురు స్నేహితులు అక్కడున్నారు. వారంతా ఓ అంబులెన్సులో ఎదురు చూస్తన్నారు. సాదిక్ రాగానే అతడ్ని కిడ్నాప్ చేసేశారు.


ఆ తర్వాత వసాయినైగావ్ లోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అతన్ని చంపి మృతదేహాన్ని పారేయాలని ఓ అంచనాకొచ్చారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. సాధిక్ ను బలవంతంగా అంబులెన్సులో ఎక్కిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వారిని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే అప్రమత్తమైన డీసీ.. ముంబై రోడ్డుపై ఆ అంబులెన్స్ ను ట్రాక్ చేశారు. అంతలో అంబులెన్సులో పెట్రోలు అయిపోవడంతో వారు మరో కారును అద్దెకు తీసుకున్నారు. 


ఈ కారులో జాతీయ రహదారిపై దహిసర్ చెక్ పాయింట్ గుండా వెళుతుండగా పోలీసులు కాపు కాసి నిందితులను పట్టుకున్నారు. యాస్మిన్ తో సహా అందరినీ అరెస్టు చేసి సాధిక్ ను రక్షించారు. అయితే సాధిక్ ను మునుపటి అల్తాఫ్ హత్య కేసులో అరెస్టు చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే యస్మిన్ మొత్తం ప్లాన్ విని పోలీసులు కూడా షాక్ అయ్యారు.




కరోనా నుండి బయటపడ్డ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>